సినిమా టికెట్ల మధ్య వ్యవహారం, పేర్ని నాని, రామ్ గోపాల్ వర్మ మధ్య చర్చలు దారి తీసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ బాబు, దిల్ రాజు లాంటి వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడినా, చివరకు వారు ఏమి చేయాలని పరిస్థితి. కబురులుతోనే అయిపొయింది. అసలు ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీ పై ఎందుకు కోపమో తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే, మధ్యలో రామ్ గోపాల్ వర్మ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. చివరకు పేర్ని నానితో సమావేశం పెట్టుకున్నారు. ఇప్పటికే వర్మ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకొని, సచివాలయానికి బయలు దేరారు. మరి కాసేపట్లో వర్మ, భేటీ కాబోతున్నారు. అయితే ఇంత ఇంపార్టెంట్ విషయం పై మాట్లాడుతూ ఉండగానే, వైసీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వివాదాస్పదం అయ్యాయి. సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారని అన్నారు. సామాన్యులకు సినిమా చేసే ఉద్దేశంతోనే, జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారని, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి అనే ఒక సియం ఉన్నాడని గుర్తించటం లేదని అన్నారు. మరి ఈ అంశం చర్చలు జరుగుతున్న సందర్భంలో రావటం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.
news
నాలుగో సారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం... భారీ షాక్ ఇచ్చిన కాంట్రాక్టర్లు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో, ఈ సంఘటన చూస్తే అర్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి, బయట ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిపే సంఘటన ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న పరిస్థితిలో, ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉండి. చివరకు రోడ్డుల గుంటలు పూడ్చటానికి కూడా ఎవరూ ముందుకు రావటం లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా బందర్ పోర్ట్ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర పరాభవం ఎదురైంది. ఇప్పటికే ఒకసారి బందర్ పోర్ట్ కోసం టెండర్లు పిలిచారు. అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రెండో సారి కూడా టెండర్లు పిలిచారు. ఎంత సేపటికి ఎవరూ ముందుకు రాకపోవటంతో, ఏకంగా నాలుగు సార్లు గడువు పొడిగించారు. అయిన సరే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. దీంతో ప్రభుత్వం తప్పని పరిస్థితిలో, టెండర్ ని రద్దు చేసింది. కొన్ని సంస్థలను ప్రభుత్వం బ్రతిమిలాడినా ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏపిలో ఉంది. గతంలో చంద్రబాబు మొత్తం సెట్ చేసి, నవయుగ కంపెనీకి ఇవ్వగా, జగన్ రాగానే రద్దు చేసి పెట్టారు. అప్పటి నుంచి బందర్ పోర్ట్ పరిస్థితి ఇలాగే ఉంది.
రాష్ట్ర ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చిన ఉద్యోగులు.. భయపడం అంటున్న ఉద్యోగులు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీఆర్సీ ప్రకటించటంతో బిగ్ షాక్ తగిలింది. నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో వివిధ గ్రామా, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సుమారు లక్షా 30 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వీళ్ళంతా కూడా జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయత్ అధికారి అధ్వర్యంలో నడిచే వాట్స్ అప్ గ్రూప్ ల్లో నుంచి పెద్ద ఎత్తున ఎగ్జిట్ అవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఎవరికి సందేశాలు ఇవ్వాలి, ఎవరికి పని చెప్పాలో అర్ధం కాక, తీవ్ర అయోమయం నెలకొంది. పైగా, అన్ని జిల్లాల్లో కూడా ఈ వార్డు, గ్రామ సెక్రటరీలు, అధికారిక గ్రూప్ ల నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. అడ్మిన్ ల దగ్గర నుంచి కూడా, ఈ గ్రూపుల్లో ఎగ్జిట్ కావటంతో, నిన్న ఉదయం నుంచి కూడా తీవ్ర సందిగ్ధత నెలకొంది. దీంతో పాటు, వీళ్ళు అంతా కూడా గత ఏడాది ఆగష్టు లో తమకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామన్నారని చెప్పారని, అయితే నేటి వరకు కూడా చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజున కూడా, గత ఏడాది అక్టోబర్ రెండున కానీ, వీళ్ళకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అయితే మొన్న జగన్ పుట్టిన రోజున ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోవటంతో, అప్పట్లో ఆందోళన చేయగా, పీఆర్సీ రోజు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
అయితే నిన్న పీఆర్సీ ప్రకటనలో కూడా, ఈ ఏడాది జూన్ వరకు, కూడా ప్రొబేషన్ డిక్లేర్ ని వాయిదా వేయటంతో, ఒక్కసారిగా వీళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా, అధికారిక వాట్స్ అప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర అయోమయం నెలకొంది. దీని పై వెంటనే గ్రామ వార్డు సచివాలయాల సెక్రటరీగా పని చేసే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు, అదే విధంగా జాయింట్ కలెక్టర్లకు కూడా వాట్స్ అప్ మెసేజ్ లు పంపిస్తూ, వెంటనే వారితో మాట్లాడాలని, వారికి ఏమైనా సమస్య ఉంటే, ప్రభుత్వంతో మాట్లాడాలి కానీ, ఈ విధంగా గ్రూప్ ల నుంచి బయటకు వెళ్తే, అధికారిక కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారని, ఆయన ప్రశ్నించారు. వెంటనే వారి అందరితో మాట్లాడాలని, లేని పక్షంలో, ప్రభుత్వ విధులను బహిష్కరిస్తే, వారి పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, చెప్పాలని చెప్పారు. అయినా ఎవరూ కూడా లెక్క చేయటం లేదు.
ఫోన్ కాల్ పై స్పందించిన వెంకట్రామిరెడ్డి...
సచివాలయ ఉద్యోగుల సంఘం కాకర్ల వెంకటరామి రెడ్డికి, ఉద్యోగ సంఘ నేతలు ఇచ్చిన స్టేట్మెంట్ కు సంబంధించి, కింద స్థాయి ఉద్యోగుల నుంచి ఫోన్ లు వస్తున్నాయి. వెంకటరామి రెడ్డి ఒక్కరికే కాదు, అటు బొప్పరాజు, బండి శ్రీనివాస్ కి కూడా, ఈ ఫోన్లు వరుసగా వస్తూ, తమ భవిష్యత్తు పణంగా పెడతారా అని వారు అందరూ ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. దీని పైన వెంకటరామి రెడ్డికి ఫోన్ చేసిన, సచివాలయ ఉద్యోగికి సంబందించిన వాయిస్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సచివాలయ ఉద్యొగులు అందరూ ఆనందంగా ఉన్నారని, మీరు ఎలా చెప్తారు ? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర నిరాశలో మేము ఉంటే, ఆరు నెలలు వరకు కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేసేది లేదని, అలాగే దీనికి సంబంధించి, అందరూ బాగున్నారని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారని ప్రశ్నించారు. లక్షా 30 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు అని కూడా ఆ ఆడియోలో ప్రశ్నించారు. అయితే వెంకటరామి రెడ్డి సమాధానం ఇస్తూ బ్యాలెన్స్ తప్పి మాట్లాడారు. బూతులు మాట్లాడారు. అయితే ఈ ఫోన్ కాల్ వైరల్ అవ్వటంతో, వెంకటరామి రెడ్డి వివరణ ఇచ్చారు. అర్ధరాత్రి పూట ఫోన్ చేయటంతోనే, అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.