ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావుకు సోమవారం తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తణుకు పదహారో నెంబరు జాతీయ రహదారిపై డీజీపీ సాంబశివరావు కాన్వాయి ప్రమాదానికి గురైంది.

ఎదురుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వచ్చిన కాన్వాయ్ ఢీకొట్టింది. డీజీపీ వాహనం సహా కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. అయితే డీజీపీ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.

డీజీపీ సాంబశివరావు వేరే వాహనంలో విజయవాడ వెళ్లిపోయారు. కాకినాడ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో, మంగళగిరి దగ్గర అత్యాధునిక హంగులతో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం రూపుదిద్దుకుంటోంది. ఆధునిక సాంకేతికతతో ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి.

మొత్తం ఐదు లక్షల యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్టేడియం తాలూకు గ్యాలరీలో దక్షిణం, ఉత్త రం బ్లాకులను ఐదు అంతస్తులుగాను, తూర్పు, పడమర బ్లాకులను మూడు అంతస్తులుగాను నిర్మిస్తున్నారు. వీటిలో మూడు బ్లాకులు పూర్తికాగా, ప్రస్తుతం నార్త్ బ్లాకు గ్యాలరీ పనులు కొనసాగుతున్నాయి.

2018 నాటికి నిర్మాణం పూర్తి చేసి, కొన్ని రంజీ మ్యాచులు ఆడి, 2019 నాటికి ఇంటర్నేషనల్ మ్యాచులు మొదలు పెట్టనున్నారు.

ఇవి హైలైట్స్:

  • 23.20 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం
  • 180 గజాల వ్యాసంలో ఉండే మైదానం మధ్య నుంచి బౌండరీ లైను 75 గజాల వ్యాసార్థంలో ఏర్పాటవుతోంది
  • గ్రౌండు చుట్టూ ఉండే అండర్‌గ్రౌండు డ్రెయినేజికి, బౌండరీలైనుకు మధ్య మళ్లీ 15 గజాల జాగా ఉంటుంది
  • మైదానంలో మొత్తం 11 పిచ్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పిచ్‌లు ఒక్కోటి 66 అడుగుల పొడవు, పదడుగుల వెడల్పుతో ఉంటాయి
  • అత్యాధునిక సాట్రమ్‌ వాటర్‌ డ్రెయిన్లతో, దాదపు 10 వేల లీటర్ల నీటిని బయటకు పంపే సామర్ధ్యం
  • 34 వేల మంది ప్రేక్షకులు కూర్చొనేందుకు గ్యాలరీ
  • 5 కోట్లతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియం
  • మొత్తం ఖర్చు రూ.120 కోట్లు (అంచనా)

ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు 37వ పెళ్లి రోజు... పైగా ఆదివారం... ఇలా అన్నీ కలిసి వస్తే, మనమైతే, హాయిగా ఫ్యామిలీతో గడుపుతాం... కాని ఈయన మనందరికీ అతీతం... ఆయనకి ఉన్న టార్గెట్స్ వేరు...

ఇవాళ కూడా యధావిధిగా వర్క్ లోకి వెళ్ళిపోయారు... ఉదయం నుంచి సమీక్షలతో గడిపేశారు... సాయంత్రం, రాజధాని నిర్మాణంపై అధికారులతో, టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విజయదశమి రోజు అమరావతిలో నిర్మాణాల మొదలుపెడుతున్నాం అని, దానికి తగ్గ షెడ్యుల్ గురించి చర్చించారు...

ప్రజలకు కట్టిచ్చే, బహుళ అంతస్థుల హౌసింగ్‌ నిర్మాణాల గురించి, బ్రిటన్‌ ఆర్కిటెక్ట్‌ల బృందం విజయవాడ రాబోతున్నట్లు చెప్పారు.

ఇలా పెళ్లి రోజు కూడా, రాష్ట్రం కోసం కష్టపడుతూ, ముందుకు సాగుతున్నారు...

బెజవాడ మారిపోతుంది... అన్నిటితో పాటు, మద్యం షాపులు కూడా కొత్త లుక్ తో వస్తున్నాయి... మద్యం షాపులు అంటే, ఈగల్లా మూగే జనం, హడావిడి, గోల గోలగా ఉండే వాతావరణం ఇప్పటి వరకు చూసాం... ఇప్పుడు, విజయవాడలో సూపర్ మార్కెట్ లా ఉండే వైన్ షాప్ వచ్చింది.

విజయవాడ టిక్కిల్‌ రోడ్డులో, "హ్యాంగోవర్‌" పేరిట వైన్‌ షాపు నడుస్తోంది... ఇక్కడ అంతా సూపర్‌ మార్కెట్‌ మాదిరిగానే ఉంటాయి. కావాల్సిన బాటిల్స్ బాస్కెట్లో వేసుకుని క్యాష్‌కౌం టర్‌ దగ్గరకు వెళ్తారు. అక్కడి మొత్తం బిల్లును చెల్లించే ఇళ్లకు తీసుకుపోతారు. షాపు చాలా హైఫై లుక్‌ను సంతరించుకుంది.

మెట్రో నగరాలు, విమానాశ్రయాల్లో ఉండే ఇలాంటి షాపులు ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విజయవాడలో ఏర్పాటైంది. ప్రభుత్వ నిభందనలు ప్రకారం, అన్ని అనుమతులు తీసుకుని ఈ షాప్ నడుపుతున్నారు..

Advertisements

Latest Articles

Most Read