ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా ఆశ్చర్య పరిచింది. ఏకంగా ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టటమే కాకుండా, వారిని అరెస్ట్ చేయటం, అలాగే కింద కోర్టుల్లో ఇంత ఘోరం జరుగుతున్నా వారికి బెయిల్ ఇవ్వకపోవటం, అప్పట్లో ఒక పెద్ద సంచలనం అయ్యింది. చివరకు హైకోర్టు జోక్యంతో, వారికి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే తరువాత కేసు హైకోర్టుకు వెళ్ళటంతో, హైకోర్టు ఈ అంశం పై ఆశ్చర్య పోయింది. ఎస్సీల పైనే ఎలా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారని, కింద కోర్టు మేజిస్త్రేజ్ ఎలా బెయిల్ ఇవ్వకుండా నిరాకరిస్తారని చెప్తూ, ఈ కేసుని హైకోర్టు ఓపెన్ చేసి, గత ఏడాది కాలంగా విచారణ చేసింది. ఎట్టకేలకు ఈ రోజు ఈ కేసు పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గుంటూరు అర్బన్ నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ దుర్గా ప్రసాద్, అలాగే రిమాండ్ ని అంగీకరించిన మంగళగిరి మేజిస్ట్రేట్ లక్ష్మీ, బెయిల్ మంజూరు చేయని, గుంటూరు అదనపు జిల్లా జడ్జి వాసంతి పై క్రమశిక్షణా చర్యలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, సంచలానికి తెర లేపింది. కృష్ణాయపాలెంలో దళిత రైతులను అరెస్ట్ చేసిన విషయంలో, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని కోర్ట్ తేల్చింది. మొత్తానికి మరోసారి ప్రభుత్వ పెద్దలను నమ్ముకుంటే, ఏమి అవుతుందో, ఇప్పటికైనా అధికారులకు తెలిసి వచ్చింది.
news
ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత... గాల్లోకి కాల్పులు జరిగిన పోలీసులు
కర్నూల్ జిల్లా ఆత్మకూరులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు ఇవి కాల్పుల వరకు వెళ్ళటంతో, ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై దా-డి చేయటంతో, పరిస్థితి చేయి దాటి పోయింది. కర్నూల్ జిల్లాలో పద్మావతి స్కూల్ దగ్గరలో మసీదు నిర్మాణ విషయంలో, జరిగిన గొడవ కాల్పుల వరకు వెళ్ళింది. శ్రీశైలం నియోజకవర్గానికి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ ఇంచార్జ్ గా ఉన్నారు. అయితే అక్కడ మసీదు నిర్మాణం జరుగుతూ ఉండటంతో, ఆయన దాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ మైనారిటీ వర్గీయులు బీజేపీ నేతను తరిమి కొట్టారు. ముందుగా రాళ్ళ దా-డి చేసి, బుడ్డా శ్రీకాంత్ రెడ్డి కారు ధ్వంసం చేసారు. ఈ దా-డి-లో బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి కూడా గాయాలు అయ్యాయి. పరిస్థితి చేయి దాటి పోవటంతో, బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు స్టేషన్ కు తీసుకుని వెళ్లి ఆశ్రయం ఇచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ ని కూడా ముట్టడించారు. శ్రీకాంత్ రెడ్డిని తరిమి కొట్టటంతో, పోలీసులు చివరకు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు నిరసన తెలుపుతున్నారు.
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం...
రాష్ట్ర ప్రజలకు వరుస షాకులు ఇస్తూ, షాకుల మీద షాకులు ఇస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మరో బాదుడికి సిద్ధం అయ్యింది. సినిమా టికెట్ల రేట్లు తగ్గించి, మాది పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, సినిమా టికెట్ల రేట్లు తగ్గింపుని వ్యతిరేకించిన వారు అందరూ కూడా, పేదల వ్యతిరేకులు అని సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి గారే చెప్పారు. అయితే సినిమా టికెట్ల విషయంలోనే జగన్ మోహన్ రెడ్డి గారు ఇంత ఉదారంగా ఉంటే, ఇక మిగతా విషయాలు అన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక లెక్కా అని అందరూ భావించారు. అందులోనూ నిన్నే నా చేతికి ఎముక కూడా లేదని ప్రకటించుకున్నారు. ఇవన్నీ చూసిన ప్రజలకు, గంటల్లోనే షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. సంక్రాంతి పండుగ సీజన్ లో వేసే, స్పెషల్ ఆర్టీసీ బస్సుల చార్జీలు అన్నీ, ఏకంగా 50 శాతం పెంచేసారు. నిన్న ఆర్టీసీ ఎంపీ ద్వారకా తిరుమల రావు, ఈ నిర్ణయం ప్రకటిస్తూ, డీజిల ధరలు గతంలో కంటే బాగా పెరిగాయని, అందుకే పెంచక తప్పదు అంటూ తేల్చి చెప్పారు. ఆ ఎముక లేని చేయి తగ్గించేది ఏదో, డీజిల్ మీద తగ్గిస్తే, ఆర్టీసీ చార్జీలు మీద తగ్గిస్తే లాభం కదా అని, పేదలు వాపోతున్నారు.
స్వరూపానంద వ్యాఖ్యలకు షాక్ తిన్న వైసీపీ నేతలు.. ఇదేంటి ప్లేట్ ఇలా తిప్పేసారు ?
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో, నిన్నటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలకు విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామి కూడా హాజరు అయ్యారు. స్వరూపానంద జగన్ కు అత్యంత సన్నిహితులు అనే విషయం తెలిసిందే. జగన్ గెలుపు కోసం యాగాలు చేసానని, బహిరంగంగా చెప్పి, జగన్ ను ముద్దు కూడా పెట్టుకున్నారు. అయితే ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రసంగిస్తూ, స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు వైసీపీకి షాక్ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో తిరగలేని పరిస్థితితులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలతో, ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇలా ప్లేట్ ఎందుకు మార్చారో ఎవరికీ అర్ధం కాలేదు. రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఉందని, అందుకే తాను మూడు ఏళ్ళుగా హిమాలయాల్లో ఉంటున్నా అని అన్నారు. అయితే ఆయన ఏ పరిస్థితిలో ఈ వ్యాఖ్యలు చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ సభకు హాజరు అయిన వారు మాత్రం, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించే, ఆయన ఇలా వ్యాఖ్యలు చేసి ఉంటారాని, భావిస్తున్నారు. స్వరూపానంద స్వామి మాట్లాడుతూ తాను ఎక్కడో రిషికేశ్, హిమాలయాల్లో తిరిగినా, ఇక్కడ ఏపిలో తిరగలేక పోతున్నా అని చెప్పటం, ఏపిలో రోడ్డుల పరిస్థితి పై అయి ఉంటుందని, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి ఉంది కాబట్టి, ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
అలాగే ఇంగ్లీష్ మీడియా పైన కూడా స్వరూపానంద వ్యాఖ్యలు చేయటం, మరో సంచలనం. యాసతో, తెలుగు భాషను చంపేస్తున్నారని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియం మీద ఉన్న మోజుతో తెలుగు భాషను లెక్క చేయటం లేదని అన్నారు. తల్లిదండ్రులు తెలుగు భాషను నేర్పటం లేదని, అలాగే స్కూల్ లో మాత్రం ఇంగ్లీష్ మీడియా కావాలని ఆయన అన్నారు. తెలుగు భాషకు మించిన భాష మరొకటి లేదని అన్నారు. తెలుగు భాష జోలికి రావద్దు అని అన్నారు. సినీ పరిశ్రమ వర్గాలు కూడా, తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తెలుగు భాషను చం-పొ-ద్దు అని అన్నారు. తెలుగు భాషను తోక్కేద్దాం అంటే, ఉవ్వెత్తున ఎగురుతుందని అన్నారు. తెలుగు భాష యాస మారొచ్చు కానీ, భాష మాత్రం ఒకటే అని, తెలుగు తీయనైన భాష అని అన్నారు. అయతే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్దలు కానీ, వైసీపీ నేతలు కానీ, తెలుగు భాష గురించి ఎవరైనా మాట్లడితే, ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా మాట్లాడితే, వారి పైన ఎదురు దా-డి చేస్తూ ఉంటారు. మరి స్వరూపానంద పై ఏమి చేస్తారో చూడాలి.