రాష్ట్రాన్ని కరువురహితంగా తీర్చిదిద్ది, వ్యవసాయానికి స్వర్గధామంగా మార్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను విస్తృతంగా నిర్మిస్తోంది. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మొట్ట ప్రాంత రైతుల చిరకాల సాగునీటి కల నేరవేర్చడానికి చింతలపూడి ఎత్తి పోతల పదకం రెండవ దశ పనులకు సంబందించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాటు నాయుడు, రెడ్డి గూడెం మండలం మద్దుల పర్వ గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్ ను గురువారం ఆవిష్కరించారు.

ఇప్పటికే రూ.1701 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయి.మొత్తం రూ. 4,909,80కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు గోదావరి జలాలు తరలించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. 15 ఏళ్ల నుంచి నాగారునసాగర్ ఎడమ కాలువ 3వ జోన్ పరిధిలో ఉన్న 18 మండలాలకు చెందిన 2.10లక్షల ఎకరాలకు సాగునీరు పూర్తిస్తాయిలో ఆందడంలేదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ద్వారా ద్వారా ఆ ప్రాంత రైతులకు సాగునీటి కషాలు తీరనున్నాయి. ఈ పధకం ద్వారా 410 గ్రామంలోని 21 లక్షల జనాభాకు త్రాగునీరు సౌకర్యం కల్పించబడుతుంది.

గోదావరి జలాల ఎత్తిపోతల తీరిది
చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే, కృష్ణా, పశ్చిమ గోదారి జిల్లాలకు గోదావరి జలాలు తరలించొచ్చు. ఈ పథకం ద్వారా గోదావరి జలాలు రెండు దశల్లో ఎత్తిపోయనున్నారు. మొదటి దశలో పశ్చిమ గోదావరి జల్లాలోని తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం వద్ద లీడింగ్ ఛానల్ ద్వారా గోదావరి జలాలను పంపించనున్నారన్నారు. ఆక్కడి నుంచి 13.22కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాలపురం మండలంలోని గుడ్డిగూడెం గ్రామినికి గోదావరి జలాలు చేరుకుంటాయి. అక్కడ రెండో దశ పథకం కింద లిప్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ 14 పంపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా 92 మీటర్లు ఎత్తులో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువలోకి గోదావరి జలాలను ఎత్తిపోతలు చేస్తారు. అదే సమయంలో ప్రధాన కాలువ సామర్ధ్యం పెంచి, నాగార్శన సాగర్ ఎడమ కాలువ 21 బ్రాంచి కెనాల్ కు ఆనుంధానించి, కృష్ణా జిల్లాలోని నిర్దేశిత ఆయకట్టకు సాగునీరు అందించనున్నారు.

పథకంతో కలిగే ఉపయోగాలు
చింతలపూడి ఎత్తిపోతల పథకం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 9 నియోజకవర్గాల్లోని 33మండలాలకు చెందిన 2 లక్షల ఎకరాకలకు కొత్తగా సాగునీరు ఆందనుందన్నారు. అలాగే రూ.2.80, లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వాడ కాలువ ప్రాజెక్టు పరిధిలో గల 17వేల ఎకరాలు, ఎర్ర కాలువ ప్రాజెక్టు కింద ఉన్న 28వేల ఎకరాలతో పాటు తమ్మిలేరు ప్రాజెక్టు పరిధిలో ఉన్న పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోని మరో 25వేల
ఎకరాల ఆయకట్ల స్థిరీకరణ జరగనుంది. వాటితో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న 200 చెరువులను నింపడం 50 వేల ఎకరాలతో పాటు నాగార్జునసాగర్ కాలువలపై నిర్మించిన చిన్ననీటి ఎత్తిపోతల పథకాల కింద ఉన్న మరో 10వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

ఈ రెండు దశల వల్ల భూగర్భ జలాల మట్టం పెరిగి, బోర్ల ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుంది. కేవలం సాగునీరు అందివ్వడమే కాకుండా చింతలపూడి ఎత్తిపోతల ధ్వారా తాగునీరు రౌతు గూడెం, రెడ్డిగణపవరం గ్రామాల మధ్య 3వ లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ లిఫ్ట్ దగ్గర 6 పంపులను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్లేరు వాగుపై 20టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న జలాశయానికి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించనున్నారు. ఈ నీటిని సాగుతో పాటు తాగునీటి అవసరాలకూ వినియోగించనున్నారు.

‘ఇన్నేళ్లుగా ఇక్కడ పనిచేసే అవకాశాలు లేక హైదరాబాద్‌కో, ఢిల్లీకో, అమెరికాకో వెళ్లారని, ఇప్పుడు ప్రపంచంలో ఉండే తెలుగువారంతా వచ్చి పనిచేసే అవకాశం అమరావతిలో కల్పిస్తాం రండి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ఇప్పడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అద్భుత అవకాశాలు వస్తున్నాయని, ప్రపంచస్థాయి వైద్య సంస్థలు ఏర్పాటవుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. గురువారం విజయవాడ ఎ1 కన్వెన్షన్ సెంటర్ నుంచి ఆయన ఇబ్రహీంపట్నంలో ప్రవాసాంధ్రులు నిర్మించనున్న అమరావతి అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఎఐఎంఎస్) కు మీటనొక్కి శంకుస్థాపన చేశారు.
అమరావతి-అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రపంచ స్థాయి ఆస్పత్రిగా రూపొందాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భవిష్యత్తులో అధునాతన వైద్యానికి, అత్యవసర వైద్యానికి, అన్ని రకాల క్లిష్ట చికిత్సలకు అమెరికానుంచే రోగులు అమరావతి వచ్చి చికిత్స చేయించుకుంటారని అన్నారు.

నవనీత కృష్ణ ఇండియా వచ్చినప్పుడు తమను కలిశారని, మెడికల్ కళాశాలతో కూడిన బోధనాస్పత్రి నిర్మించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారని, భూమి ఇవ్వడానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ సర్పంచ్, దాత మల్లెల పద్మనాభరావు ముందుకు వచ్చారని, అంతకు ముందు భూ వివాదం కోర్టులో ఉంటే..అందరినీ పిలిపించి మాట్లాడామన్నారు. ఆ భూమిలో ఒక మెడికల్ కాలేజీ పెడితే బాగుంటుందని సూచించారని చెప్పారు. ఎన్నారైలు కళాశాల పెట్టడానికి ముందుకు రాగా, దీనికి అడ్డంకులు సృష్టించకూడదని ఒక నిర్ణయం తీసుకున్నామని..ఆ పర్యవసానంగానే ఒక అమరావతి, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రూపంలో ఒక ఉత్తమ సంస్థ ఇక్కడికి వస్తోందని చంద్రబాబు వివరించారు.

రాజధాని అమరావతికి 13 వైద్య కళాశాలలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ లో ఇన్ని మెడికల్ కాలేజీలు లేవన్నారు. విజయవాడ, గుంటూరులో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయని చెప్పారు. మంగళగిరిలో ఎయిమ్స్ పెడుతున్నారని, ఎన్నారై కాలేజీ, కాటూరు, సిద్ధార్ధ, లిమ్రా మైనారిటీ కాలేజీ ఉన్నాయని, సరికొత్తగా ఎస్.ఆర్.ఎం, విట్ వచ్చాయని,బి.ఆర్ షెట్టి, ఇండో-యుకె, అమృత్, ఇప్పుడు అమరావతి-అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తోందని ముఖ్యమంత్రి వివరించారు.

ఇవాళ అమెరికాలో నలుగురు వైద్యులు ఉంటే ఒకరు భారతీయ సంతతికి చెందినవారని, ప్రతి నలుగురు భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్ వారు అని, అది మన ఆస్తి అని అభివర్ణించారు. ఇక్కడ చదువుకుని అమెరికా వెళ్లి అక్కడ సంపాదించి వచ్చి మళ్లీ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారని, జన్మభూమి అభవృద్ధిలో భాగస్వాములవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎఎఐఎంఎస్ చైర్మన్ నవనీత కృష్ణను, భాగస్వాములను అభినందించారు.

‘మీవాళ్లంతా ఇక్కడ చదువుకుని అమెరికా వెళుతున్నారు, ఉత్తమ విద్యార్ధులు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇది మీకు నష్టం కదా?’ అని కొందరు తనను ప్రశ్నించగా, తిరిగి వారు ఉత్తమ పరిజ్ఞానం సంపాదించి వస్తారు. డబ్బులతో వస్తారు.’ అని తాను వారికి సమాధానమిచ్చానని, అదే ఈరోజు జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. అమెరికాలో సముపార్జించిన విజ్ఞానాన్ని, సంపాదించిన కష్టార్జితాన్ని తీసుకుని అద్భుతమైన ఆస్పత్రిని ఇక్కడ నిర్మించేందుకు వచ్చారని ప్రశంసించారు. రాజధాని అమరావతి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఉండాలని తాను అభిలషిస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.

ఎ.ఎ.ఐ.ఎం.ఎస్ మరో రెండేళ్లలో అంటే..2019 కి 300 బెడ్స్ తో, తర్వాత 400 బెడ్స్ తో ఆస్పత్రి నిర్మాణం దశలవారీగా పూర్తి చేస్తారని, 4 సెంటర్లలో ఒక శాటిలైట్ ఆస్పత్రిని పెట్టుకుని అక్కడి నుంచి రోగులను ప్రధాన ఆస్పత్రికి పంపించే కార్యక్రమం రూపొందించారని చంద్రబాబు ఏఏఐఐఎంస్ యాజమాన్యానికి కితాబునిచ్చారు. అమెరికాలో ఉండే విద్యాఫలాలను ఇక్కడికి తెస్తున్నారని, ఉత్తమ పద్ధతులను కూడా తీసుకురావాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో అమెరికా వాళ్లే అమరావతి వచ్చి వైద్యం చేయించుకునే రోజు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం కోసం తాము గ్రామాల్లో, నగరాల్లో అమలు చేస్తున్న వైద్య ఆరోగ్యపథకాలను, ఎన్టీఆర్ వైద్యసేవ, చంద్రన్న బీమా, తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ తదితర పథకాలు, సదుపాయాలను ముఖ్యమంత్రి ఉదహరించారు.

ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటి విప్లవ ఫలాలు ఇంటింటికీ అందించారని ప్రశంసించారు. ఆయన్ని హైటెక్, హైటెక్ అంటూ ఎగతాళి చేశారని, ఐటి విప్లవ ఫలాలు పేద, ధనిక, మధ్య తరగతి తారతమ్యం లేకుండా అన్ని వర్గాల యువత అందుకుందని అన్నారు. ఐటీలో ఎక్కువ వేతనాలు లభిస్తాయన్న విజన్ ఉన్నందువల్లనే నాడు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐటికి ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని జాస్తి గుర్తు చేశారు.

హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో తన తల్లిగారింట్లో ఒక పనిమనిషి కుమారుడు కాగ్నిస్ టెక్నాలజీస్ లో పనిచేస్తున్నారని, నెలకు రూ.65 వేల వేతనం ఆర్జిస్తున్నాడని తెలిపారు. కుమారుడికి ఉద్యోగం వచ్చినా ఆమె అభిమానంతో ఆ ఇంటనే పనిచేస్తానని ఆమె అన్నప్పుడు కదిలిపోయినట్లు తెలిపారు. కాయకష్టంతో బతికే ఒక పనిమనిషి కుమారుడు మంచి వేతనం పొందగలిగాడని, ఆనాడు ముఖ్యమంత్రి దార్శనికత వల్ల ఇది సాధ్యమైందన్నారు. రెండేళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబాన్ని మర్చిపోయి రాష్ట్రాభివృద్ధికి 17 గంటలదాకా కష్టపడుతున్నారని ప్రశంసించారు. తన ఉద్యోగ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడులా కష్టపడే ముఖ్యమంత్రిని చూడలేదని జాస్తి కృష్ణ కిశోర్ అన్నారు. అభివృద్ధి అనే దొడ్డ వృక్షాన్ని ఆయన పెంచుతున్నారని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఫలాలనిస్తుందని వ్యాఖ్యానించారు.

ఏముంది, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎదో షో చేస్తాడు... ఎన్నికలు అయిపోయినాక, అమరావతి చెక్కేస్తాడు... ఇది నంద్యాల ఎన్నికలప్పుడు చంద్రబాబు గురించి వినిపించిన మాటలు... భుమా నాగిరెడ్డి చివరి కోరిక మేరకు, నంద్యాల అభివృద్ధి కోసం, 1300 కోట్లతో పనులు మొదలు పెట్టారు.

అయితే ప్రతిపక్షాలు మాత్రం, ఇవన్నీ ఎన్నికల్లో గెలవటానికి చంద్రబాబు వేసే జిమ్మిక్కులు అనేశాయి... కాని ప్రజలు చంద్రబాబుని నమ్మారు.... కళ్ళ ముందు అభివృద్ధి చూసి, తెలుగుదేశం అభ్యర్ధి భుమా భ్రమ్మానంద రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించారు... దీంతో భ్రమ్మానంద రెడ్డి మీద నంద్యాల ప్రజలు పెట్టుకున్న ఆశలు, మరింత బాధ్యతను పెంచాయి.

ఎన్నికలు అయ్యి, ఫలితాలు వచ్చిన మరు క్షణమే, ఆగిపోయిన పనులు ప్రారంభించారు.... రోడ్లు వెయ్యటం మొదలు పెట్టారు... ఇళ్ళ నిర్మాణం కూడా మొదలైంది... కొన్ని ఇల్లు కూడా రెడీ అయిపోయాయి... మిగతా అన్ని పనులు కూడా జోరుగా సాగుతున్నాయి... మరో పక్క సంక్షేమ పధకాలు కూడా ఇదే విధంగా కొనసాగుతున్నాయి... ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అర్హులకి వచ్చే చెక్స్ పంపిణీ కూడా భ్రమ్మానంద రెడ్డి చేస్తున్నారు..

2019లో, చెప్పిన పనులు అన్నీ అయితేనే, మళ్ళీ పోటీ చేస్తా అని భ్రమ్మానంద రెడ్డి కాన్ఫిడెన్ట్ గా చెప్పారు అంటే, ఆయనకు ఎంత చిత్తసుద్ధి ఉందో, ప్రభుత్వం ఎలా సహకరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.. మొత్తానికి, నంద్యాల ప్రజలు కోరుకున్న నంద్యాల తయారు అవుతుంది...

మన సంకల్పం గొప్పది అయితే, ప్రకృతి కూడా ఇలాగే సహకరిస్తుంది... "పిచ్చోడిలాగా మమ్మల్ని చావ గోడతాడు" పంట కుంటలు తవ్వండి అంటే, ఇది చంద్రబాబుని ఉద్దేశించి ఆ రోజు కొంత మంది వాగిన వాగుడు... కాంగ్రెస్ నాయకుడు రఘవీరా రెడ్డి అయితే, రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరీ, అన్యాయం జరుగుతుంది అని గగ్గోలు చేశారు... చివరకి ఏమైందో తెలుసా ?

అనంతపురంలో రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి, 33 వేల పంట కుంతలు నిండితే, దాని ద్వారా 1.5 TMC నీరు స్టోర్ అయ్యింది... అంటే దాదాపు 15 నుంచి 20 వేల ఎకరాలు సాగు చేసుకోవచ్చు... చెరువులు, వాగులు, వంకలు, పొంగి పొర్లుతున్నాయి.... చెక్ డ్యాంలు నిండిపోయాయి... గ్రౌండ్ వాటర్ అయితే ఎప్పుడూ లేనంతగా పెరిగాయి... తవ్విన 70 వేల పంట కుంటలలో, 33 వేల పంట కుంటలు నిండిపోయాయి... పంట కుంటల ప్రయోజనాలు, ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని, రైతులు కూడా ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు...

అనంతపురం నుంచి కరువుని తరిమి కొడతా అంటూ, చంద్రబాబు కరువు పై చేస్తున్న యుద్ధం ఇది... చిన్న మానవ ప్రయత్నం ఎంత గొప్పటి ఫలితాన్ని ఇచ్చిందో చూసారా... చంద్రబాబుకి సహకరించండి, ప్రకృతితో పోరాడి అయినా జయిస్తాడు...ఆయన అనుకున్నది సాధిస్తారు...

రేపు చంద్రబాబు అనంతపురం వస్తున్నారు... ఈ నిండు కుండలా ఉన్న చెరువులు, వాగులు, వంకలు, పంట కుంటలు చంద్రబాబుకి స్వగతం పలకనున్నాయి..

Advertisements

Latest Articles

Most Read