మనం మెట్రోలు, బులెట్ ట్రైన్ ల దగ్గరే, కేంద్రం వైపు ఆశగా చూస్తూ కూర్చుంటున్న టైంలో, చంద్రబాబు తన విజన్ ఏంటో చూపించారు... ప్రపంచంలోనే ఇప్పుడిప్పుడే వస్తున్న హైపర్‌లూప్ రవాణా వ్యవస్థను, భారత దేశంలోనే తొలి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం చేయనున్నారు. మొన్నటి దాకా, ఈ వార్తలు చూసి అందరూ నవ్వారు... అమరావతి ఏంటి, హైపర్‌లూప్ ఏంటి అన్నారు... అయితే, స్వయంగా హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ (HTT) ఈ విషయం ప్రకటించింది. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి విజయవాడ మధ్య హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మించడానికి ఏపి ప్రభుత్వం హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్‌(HTT)తో అధికారికంగా భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయివేట్ ఇన్వెస్టర్ల నుండి నిధులు సేకరించి ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో అమరావతి మరియు విజయవాడ నగరాలను కలిపే విధంగా హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మించడానికి ప్రభుత్వ మరియు HTT సంస్థలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

మొదటి ఫేజ్‌లో భాగంగా మొదటి ఫేజ్‌లో భాగంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఆక్టోబర్, 2017 నుంచి 6 నెలల పాటు హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ అధ్యయనం చేయనుంది.

రెండవ ఫేజ్‌లో భాగంగా... రెండవ ఫేజ్‌లో భాగంగా ప్రాజెక్ట్ పనులు పట్టాలెక్కుతాయి. భారతదేశంలో హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కుదిరిన మొట్టమొదటి ఒప్పందం ఇదే కావటం విశేషం.

భారత్‌దేశంలోనే తొలి హైపర్‌లూప్ నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఆనందంగా ఉందని హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీస్ ఛైర్మెన్ మరియు కో-ఫౌండర్ బిబోప్ గ్రెస్టా తెలిపాడు.

ప్రపంచంలోనే, మొట్టమొదటి హైపర్‌లూప్ రవాణా వ్యవస్థను, ముందుగా లాస్ ఏంజిల్స్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకు 610 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు.

మన కళ్ళ ముందు రోడ్డు ప్రమాదం జరిగితే ఏం చేస్తాం ? మహా అయితే 108కి ఫోన్ చేసి వెళ్లిపోతాం. కానీ, ఒక డీజీపీ స్థాయి అధికారి అలా చేయలేదు. రోడ్డు మీద గాయాలతో పడి ఉన్న అతన్ని తన కారులో కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తక్షణం చికిత్స చేయించాడు. ఇదేదో…సినిమా స్టోరీలా ఉందా..? కానేకాదు.. జరిగిన వాస్తవం. మానవత్వంతో స్పందించిన ఐపీఎస్ ఎవరో కాదు ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు.

ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో డి.జి.పి. శ్రీ నండూరి సాంబశివరావు, ఐ.పి.యస్, అధికారిక విధులలో బాగంగా రాజమండ్రి ప్రయాణిస్తుండగా పెద్దవల్లి మండలం, ఖండవల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైన సంఘటన చూసి వెంటనే గాయపడిన వారిని తన వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వివరాలకు వెళ్తే, మండపేట గ్రామానికి చెందిన శ్రీ ఎలేటి వెంకట దుర్గాప్రసాద్ భార్య కుమారుడితో కలిసి చింతలపూడి నుండి మండపేటకు ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తుండగా ఎండ తీవ్రత వల్ల కళ్లు తిరిగి రోడ్డు ప్రక్కన వున్న చెట్టుకు డీకోనడం జరిగింది. ఈ సంఘటనలో వారి 7 సంవత్సరాల కుమారుడికి కుడి చేయి విరిగినది.

అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న డి.జి.పి. గారు ప్రమాదాన్ని చూసి, తనే స్వయంగా వారిని పరామర్శించి గాయపడ్డ పిల్లవాడిని, తల్లిదండ్రులను తక్షణం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. ముగ్గురు క్షేమంగా వున్నారు.

నిర్మాణాత్మక ప్రతిపక్షం, సలహాలు సూచనలు ఇస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనే దానికి ఇది మరో ఉదాహరణ...

గడిచిన 35 రోజులుగా వ్యవసాయ వర్శిటీ విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 64ను రద్దుచేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ప్రకటించారు.

మంత్రి మీడియాతో మాట్లాడుతూ 27.7.2017న జారీ చేసిన జీవో 64పై వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో ఈ జీవోను ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ, ఐసిఏఆర్ అధికారిక గుర్తింపు పొందిన రాష్ట్రేతర విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పదోన్నతులు, నియామకాలతో పాటు విద్యా ప్రమాణాలను కాపాడుతామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి స్పష్టం చేశారు. సరైన విద్యా ప్రమాణాలను కలిగిన ఏ విద్యార్ధికి శాఖాపరమైన నియామకాల్లో అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.

ఉత్తర్వులు రద్దు చేసిన నేపధ్యంలో వ్యవసాయ విద్యార్ధులు తక్షణమే తరగతులకు హాజరు కావాలని మంత్రి సోమిరెడ్డి కోరారు. విలువైన విద్యా సంవత్సరాన్ని నష్టపోవద్దని విద్యార్ధులకు హితవుపలికారు.

అయితే ఈ సమస్య పరిష్కారంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది. తమ భవిష్యత్‌‌కు అడ్డుగోడలా నిలిచిన జీఓ 64ను ఉపసంహరించేలా ప్రభుత్వాన్ని కోరాలంటూ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కోరారు. దీంతో ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆ వెంటనే స్పందించిన చంద్రబాబు జీవో నెంబర్ 64ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

జీఓ నెంబర్ 64 ను ఉపసంహరించుకోవడంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యను పరిష్కరించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

pk 06092017 1

మూడున్నరేళ్ల క్రితం వరకూ క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి, తర్వాత పెద్దగా ప్రచారానికి నోచుకోని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మళ్లీ తెర పైకి తీసుకువచ్చేందుకు వైసీపీ కన్సల్లెంట్ ప్రశాంత్ కిశోర్ ప్లాన్ వేశారు. 9121091210కు మిసిడ్ కాల్ ఇచ్చి వైఎస్ కుటుంబంలో చేరమంటున్నారు...

ఇక్కడ వరకు బాగానే ఉంది... ఇష్టమైన వాళ్ళు చేస్తారు, ఇష్టం లేని వాళ్ళు చెయ్యరు... కాని, ఇక్కడ కూడా లోటస్ పాండ్ ఫేక్ బ్యాచ్ తో కలిసి, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, ఫేక్ చేసి పడేస్తుంది.

సోషల్ మీడియాలో ఇలా ఫేక్ చేస్తూ అడ్డంగా దొరికారు, ప్రశాంత్ కిషోర్ టీం... ట్విట్టర్ లో అవంతిక చిన్నా అనే ఒక ప్రొఫైల్ లో పదే పదే, "వైఎస్ కుటుంబం" అంటూ ట్వీట్ లు వస్తున్నాయి.. ఆ ఫోటో, ఆ ఎకౌంటు అన్నీ తేడాగా ఉన్నాయి.. కొంచెం రీసెర్చ్ చేస్తే, ఇది ప్రశాంత్ కిషోర్ / లోటస్ పాండ్ ఫేక్ ఎకౌంటు అని అర్ధమైంది...

"real indian girl dp" అని గూగుల్ ఇమేజ్ సెర్చ్ లో, సెర్చ్ చేస్తే, ఆ ట్విట్టర్ ఎకౌంటు కి, ఏ ఫోటో అయితే పెట్టుకుందో, అదే ఫోటో ఇక్కడ కూడా ప్రత్యక్షమైంది... దీంతో, ఇది కూడా ఫేక్ అని తేలిపోయింది. ఇది వరకు, ఇలాగే ప్రశాంత్ కిషోర్ టీం అడ్డంగా దొరికినా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు...

ఇప్పుడు ప్రజల డౌట్ ఏంటి అంటే, ఇంతకీ "ఇది వైఎస్ఆర్ కుటుంబమా... ప్రశాంత్ కిషోర్ ఫేక్ కుటుంబమా...." జగన్ దగ్గర ఇవన్నీ చూపించి, వీరంతా మన కుటుంబమే అని చెప్తాడా ?

pk 06092017 2

pk 06092017 3

pk 06092017 4

Advertisements

Latest Articles

Most Read