రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇన్నాళ్ళు చేసిన నిరీక్షణను నిరాశ ఎదురైంది. ఇన్నాళ్ళు పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన చర్చలు, వాళ్ళ డిమాండ్లు ఏమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫిట్ మెంట్ విషయంలో కనీసం 27 శాతం అయిన పీఆర్సీ ఇస్తారు అనుకున్నారు. నిన్న జగన్ మోహన్ రెడ్డితో జరిగిన చర్చల్లో కూడా, ఇదే విషయం ఉద్యోగ సంఘాలు స్పష్టం చేసాయి. అయితే ప్రభుత్వం మాత్రం, ఉద్యోగుల ఆశల మీద నీళ్ళు చల్లింది. కేవలం 23 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఉద్యోగులు సమక్షంలో ఈ ప్రకటన చేసారు. దీనికి సంబంధించి, 2020 ఏప్రిల్ నుంచి ఈ ఫిట్ మింట్ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. అయితే గతంలో అయితే అరియర్స్ ఇస్తాం అని చెప్పే వాళ్ళు, ఈ సారి మాత్రం మానిటరీ బెనిఫిట్స్ అని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఇది ఏమిటో అర్ధం కాలేదు. ఇలా అనేక కన్ఫ్యూషన్ ఇందులో నెలకొంది. అయితే ఇప్పటికే ఐఆర్ 27 శాతం ఇస్తున్నా, దాని కంటే తక్కువగా పీఆర్సీ ఇవ్వటం, చరిత్రలో ఇదే మొదటి సారి. ఎప్పుడైనా ఐఆర్ కంటే, ఫిట్ మెంట్ ఎక్కువ ఉంటుంది. గతంలో చంద్రబాబు ఏకంగా 43 శాతం పీఆర్సీ ఇస్తే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కేవలం 23 శాతం ఇవ్వటంతో, ఉద్యోగులు షాక్ తిన్నారు.
అయితే ఉద్యోగ సంఘాలు ఈ విషయం సంతోషం వ్యక్తం చేస్తుంటే, కింద స్థాయి ఉద్యోగులు మాత్రం మండి పడుతున్నారు. వాళ్ళ గ్రూపుల్లో ఈ విషయం పై ఉద్యోగ సంఘ నేతల పై విరుచుకు పడుతున్నారు. చరిత్రలో లేని విధంగా, ఈ విధంగా ఐఆర్ కంటే తక్కువగా ఇవ్వటం పై మండి పడుతున్నారు. అసలు రిటైర్మెంట్ వయసు ఎవరు అడిగారని అంటున్నారు. ఈ దెబ్బతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని అన్నారు. ఇక సీపీఎస్ విషయంలో అతి గతీ లేదు. ఇక ఉద్యోగ సంఘాల నేతల పైన అయితే, కింద స్థాయి ఉద్యోగులు మండి పడుతున్నారు. ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్ విషయంలోనే కాక, HRA విషయంలో కూడా ప్రభుత్వం ఏ ప్రకటన చేయక పోవటం పై న కూడా ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అంశం ఎక్కడకి వెళ్తుందో చూడాలి. ఉద్యోగ సంఘాల నేతలను మ్యానేజ్ చేసి, ప్రభుత్వం ఇలా చేసిందని, కింద స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. కింద స్థాయి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల పై తిరగబడే అవకాసం ఉండి.