వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డబ్బు అంటే విపరీతమైన ప్రేమ అని, రోజుకి ఇన్ని కోట్లు వస్తే కానీ నిద్రపోడని టిడిపి యువనేత నారా లోకేష్ ఇటీవల తరచూ చెబుతున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం అని కూడా వివిధ సంఘటనలతో వివరిస్తున్నారు. ఇసుకలో రోజుకి 3 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కప్పం చేరుతుందని లోకేష్ ఆరోపించారు. ఇవన్నీ నిజాలేనని, డబ్బు-ఆస్తి కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడని ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బయటపెట్టారు. వారం వారం తాను రాసే కొత్త పలుకు శీర్షికతో అందించే ప్రత్యేక కథనం వైకాపాలో ప్రకంపనలు రేపుతోంది. రెండు వారాల క్రితం వివేకా హత్య జరుగుతున్నప్పుడు జగన్ రెడ్డికి సమాచారం ఉందని, అప్పుడు జగన్ రెడ్డితోపాటు నలుగురున్నారని ప్రకటించి సంచలనం సృష్టించారు. దీనిపై ఆ నలుగురు కానీ, జగన్ రెడ్డి కానీ, వైకాపాలో ఏ ఒక్క గొంతూ లేవకపోవడం అది నూటికి నూరుశాతం నిజమేనని జనం నిర్ధారించుకున్నారు. తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వైఎస్ షర్మిలకు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పంచడంలేదనే విషయాన్ని వెల్లడించారు. జగన్, షర్మిల మధ్య జెరూసలెంలోనే ఆస్తుల పంపకం మధ్య చర్చలు జరిగాయని ఆర్కే కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత కూడా ఆస్తుల పంపకంలో జగన్ రెడ్డి విక్రమార్కుడు సినిమాలో రవితేజ పాత్ర పోషించారని..ఈ అన్యాయపు పంపకాలను షర్మిల ఒప్పుకోలేదని వివరించారు. దీనిపైనా వైకాపా క్యాంపు మౌనమే మెయింటెన్ చేస్తోంది. అంటే ఇదీ వెయ్యిశాతం నిజమేనని వైకాపా ఒప్పుకుంటున్నట్టే.
news
గుడ్ మార్నింగ్ అంటూ వెళ్లిన కేతిరెడ్డిని షాక్ ఇచ్చిన యువకుడు..
అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి నిరసన సెగ ఎదురు అయ్యింది. గుడ్ మార్నింగ్ అంటూ వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డిని షాక్ ఇచ్చాడు యువకుడు. మూడేళ్లయినా తనకు ఇంటిపట్టా రాలేదని కేతిరెడ్డిని నిలదీసాడు యువకుడు. కేతిరెడ్డి పై ప్రశ్నల వర్షం కురిపించాడు, ఆ యువకుడు. తనను నిలదీసిన యువకుడు ఆసిఫ్ పై ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే గత నెలలో లోకేష్ పాదయాత్ర ధర్మవరంలో జరిగిన తరువాత, కేతిరెడ్డి డ్రామాలు అన్నీ బయట పడ్డాయి. లోకేష్ , కేతిరెడ్డి గుట్టు మొత్తం బయట పెట్టాడు. అప్పటి నుంచి కేతిరెడ్డి తీవ్ర అసహనంతో ఉంటున్నారు. వారం క్రితం కూడా, ప్రజల పై రుసరుసలాడుతూ, మా ఫ్యామిలీ మొత్తం, మీ కొంపలు చుట్టూ తిరుగుతున్నాం అంటూ ప్రజల పై అసహనం వ్యక్తం చేసారు. ఇప్పుడు మరోసారి ఈ రోజు, తన అసహనం బయట పెట్టాడు కేతిరెడ్డి.
అర్ధరాత్రి జగన్ చేసిన పనికి నిరసనగా, కొలికపూడి శ్రీనివాసరావు సంచలన నిర్ణయం..
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో, ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటం, ఇక తాము ఎలాగూ గెలవం అనే అభిప్రాయం వైసీపీలో ఉండటంతో, రేపు వచ్చే చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పడే విధంగా, అనేక తిక్క తిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అమరావతిలో ఇళ్ల పట్టాల కోసం మరో 268 ఎకరాలు కేటాయించింది జగన్ ప్రభుత్వం. తంలో R3 జోన్‍లో ఉన్న గ్రామాల్లో 1134.58 ఎకరాలు ఇప్పటికే కేటాయించారు. అయితే రెండు జిల్లాల కలెక్టర్ల వినతితో, మరో 268 స్థలాల కేటాయింపు చేసారు. ఈ నెల 18న జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరగనుంది. అయితే, ఈ విషయం పై ఇప్పటికే సుప్రీం కోర్టుకి వెళ్లారు రైతులు. ఇది ఇలా ఉంటే, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా, సంచలన నిర్ణయం తీసుకుని, కొలికపూడి శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ విధ్వంసానికి నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అబ్బురాజుపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు.
ఆదిరెడ్డి అరెస్ట్ కేసులో, ఏపి సిఐడికి హైకోర్టు షాక్...
చిట్ ఫండ్ కేసులో అరెస్ట్ అయిన, జగజ్జనని చిట్‍ఫండ్ అధినేతలు, అలాగే టిడిపి నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు ఇద్దరికీ కూడా హైకోర్టు, కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా పది రోజులు క్రితం, చిట్ ఫండ్స్ డబ్బు వేరే అవసరాలకు వాడారు అంటూ, వీరి ఇద్దరినీ కూడా, సిఐడి అరెస్ట్ చేసింది. దీంతో ఇద్దరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసుని తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి వేసిన పిటీషన్ ని, రాజమండ్రి సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ నేపధ్యంలోనే ఇద్దరూ హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. వారం రోజుల క్రితమే బెయిల్ పిటీషన్ దాఖలు చేయటం, సీనియర్ న్యాయవాదులు దమ్మలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వీరికి చిట్ ఫండ్ చట్టం వర్తించదు అని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని వాదించారు. ఈ వాదనలు విన్న తరువాత, కోర్ట్ బెయిల్ ఇచ్చింది. అయితే ఇదంతా కావాలనే కక్ష సాధింపు చర్యల్లోనే, ఇలా చేసారని టిడిపి ఆరోపించింది. చంద్రబాబు కూడా జైలుకి వెళ్లి, వీరిని పరామర్శించిన సంగతి తెలిసిందే.