ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ఒకే రాజధాని ఉంటుంది. దివాలా తీసిన సౌత్ ఆఫ్రికా లాంటి రాష్ట్రాలతో పోల్చుకుని, మనకు కూడా మూడు రాజధానులు అంటూ, మన పాలకులు తీసుకున్న తలా తోక లేని నిర్ణయంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనే మాటే లేకుండా పోయింది. ఒకే రాజధాని ఉంచండి మహా ప్రభో అని ఉద్యమాలు చేసే స్థాయికి మన పాలకులు తీసుకొచ్చారు. అమరావతి రైతులు, మహిళలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు, తాము బాగుపడతాం అని భూములు ఇచ్చారు. తల్లి లాంటి భూమిని ఈ రాష్ట్రం కోసం ఇచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం రావటంతో, వాళ్ళ పరిస్థితి తలకిందులు అయ్యింది. అటు భూములు పోయాయి, ఇటు రాష్ట్రం బాగుపడలేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. పోరాట బాట పట్టారు. వారిని పైడ్ ఆర్టిస్ట్ లు అన్నారు, ఒక సామాజికవర్గం వారే అన్నారు , ఒక పార్టీ నడుపుతున్న ఉద్యమం అన్నారు. ఇలాంటి అవహేళనలు అన్నీ దాటుకుని, అమరావతి ఉద్యమం ముందుకు సాగింది. రెండేళ్ళ ఉద్యమ ప్రస్థానంలో, ఉద్యమ హోరు పెంచారు. న్యాయస్థానంలో న్యాయం దక్కాలని, దేవస్థానంలో ధర్మం నిలవాలని, న్యాయస్థానం టు దేవస్థానం అనే మహా పాదయాత్రను మొదలు పెట్టారు. 45 రోజులు పాటు ఈ మహా పాదయాత్ర సాగింది.

amaravati 17122021 2

ఈ మహా పాదయాత్రకు రాయలసీమలో కూడా అనూహ్య మద్దతు లభించింది. అక్కడ ప్రజలు కూడా అక్కున చేర్చుకున్నారు. మా ప్రాంతానికి అభివృద్ధి కావాలి, అమరావతి రాజధానిగా ఉండాలని నినదించారు. ఈ రోజు తిరుపతిలో అమరావతి పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ ముగింపు సభకు అనూహ్య రీతిలో వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అంతే కాదు ఈ రోజు ముగింపు సభలో అన్ని పార్టీల నేతలు, ఒకే వేదికను పంచుకొనున్నారు. తెలుగుదేశం నుంచి చంద్రబాబు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి కన్నా, కాంగ్రెస్ నుంచి తులసి రెడ్డి, సిపిఐ నుంచి నారాయణ ఒకే వేదిక మీదకు రానున్నారు. అయితే సిపియం మాత్రం, తాము అమరావతికి మద్దతే కానీ, బీజేపీ ఉన్న ఏ వేదిక పంచుకోమని, ఈ మీటింగ్ కు దూరంగా ఉంది. ఇక వైసీపీ ఒక్కటే మద్దతు తెలపటం లేదు. అయితే తిరుపతి మహా సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ప్రజలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవటంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. నీతి ఆయోగ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్ చేసిన ప్రకటనతో, ఏపి ప్రజలతో కేంద్రం ఎలా ఆడుకుంటుందో అర్ధం అవుతుంది. అలాగే ఇక్కడ ఏపి ప్రభుత్వ అసమర్ధత కూడా స్పష్టం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ గా మారిన ప్రత్యేక హోదా విషయం, ఇది ముగిసిన అధ్యయానం అంటూ కేంద్రం చెప్తూ వచ్చింది. 14వ ఆర్ధిక సంఘం కమిషన్, ఇక దేశంలో ప్రత్యేక హోదా అనే మాటే ఉండదు అంటూ చెప్పిన విషయాన్ని కేంద్రం పదే పదే చెప్తూ, తప్పించుకునే విధంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే 14వ ఆర్ధిక సంఘం ఇక ప్రత్యేక హోదా అనే అంశం లేదు అని తేల్చి చెప్పిన అంశాన్ని, ఇప్పుడు మళ్ళీ తెర మీదకు తెచ్చారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసారు. బీహార్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అంశం పరిశీలిస్తున్నాం అంటూ బాంబు పేల్చారు. బీహార్ బాగా వెనుకబడిన ప్రాంతం అని, వారికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు. అయితే ఆయన ఏపి డిమాండ్ గురించి తెలియకుండా మాట్లాడారు అని అనుకోవటానికి లేదు. కచ్చితంగా దీని వెనుక ఏదో ఒక మర్మం ఉందనే తెలుస్తుంది. కేంద్రం ఈ మాటల పై స్పందించక పోవటం కూడా అనుమానాలకు తావు ఇస్తుంది.

status 16122021 2

ఇప్పటి వరకు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యయనం అయితే, ఈ మొత్తం అంశం గురించి తెలిసిన తరువాత కూడా, అయినా కూడా బీహార్ కు సంబంధించి, ఈ అంశం పై మేము చర్చిస్తున్నాం, ఆలోచిస్తున్నాం అని ఎందుకు అన్నారు ? కేంద్రం మదిలో ఏదో లేకుండా ఇలా ఎందుకు మాట్లాడతారు ? బీహార్ లో రాజకీయ లబ్ది కోసం, బీజేపీ ఈ ప్లాన్ వేస్తుందా అనే అనుమానం కూడా వస్తుంది. బీహార్ కు కనుక ప్రత్యేక హోదా ఇస్తే కనుక, కచితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఏపి లో పరిస్థితి కూడా ఇప్పుడేమి పెద్ద గొప్పగా లేదు. ఇంకా చెప్పాలి అంటే, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, ఏపి ఆర్ధిక పారిస్థితి దారుణంగా ఉంది. అదీ కూడా ఏపికి ఇది విభజన హామీల్లో ఇచ్చిన చట్టంలో ఉన్న అంశం కాబట్టి, ఈ అంశం పై కచ్చితంగా మనకు కూడా న్యాయం జరగాలి. 22 మంది ఎంపీలు ఉన్న అధికార పార్టీ ఈ విషయం పై చరోవ తీసుకుని, ఇప్పుడు కేంద్రం మెడలు వంచాలసిన అవసరం ఉంది. మరి జగన్ గారు ఏమి చేస్తారో ?

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో గట్టిగా ముగ్గురు నలుగురు పేర్లు మాత్రం, ప్రజలకు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొంత మంది బూతులు మాట్లాడితే, కొంత మంది వెటకారం చేస్తారు, కొంత మంది తన శాఖ తప్ప అన్ని శాఖల గురించి చెప్తారు. ఇలా ప్రజలను ఎంటర్టైన్ చేసే ఒక మంత్రి పేర్ని నాని. నిజానికి పేర్ని నాని శాఖ, రవాణా శాఖ, సమాచార ప్రసారాల శాఖ. ఈ రెండు శాఖల గురించి ఆయన మాట్లాడితే చాలా తక్కువ. క్యాబినెట్ సమావేశం జరిగితే, సమాచార శాఖా మంత్రిగా అవి వివరిస్తారు. రవాణా శాఖ గురించి, ఆయన ఎప్పుడు మాట్లాడారో కూడా తెలియదు. చంద్రబాబుని తిట్టటం, పవన్ కళ్యాణ్ పై కులం పేరుతో వెళ్ళటం నాని స్టైల్. అయితే ఈ మధ్య పేర్ని నాని, మరో బాధ్యత కూడా తీసుకున్నారు. అదే సినిమా వాళ్ళతో చర్చలు. చిరంజీవి, దిల్ రాజు, ఇలా సినీ పెద్దల అందరితో కలిసి, సినిమా పరిశ్రమ గురించి, మరీ ముఖ్యంగా ఈ మధ్య హాట్ టాపిక్ అయిన ఆన్లైన్ సినిమా టికెట్ల గురించి ఆయన చర్చిస్తూ, ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. సినిమా పరిశ్రమ వర్గాలు కూడా, సినిమాకు సంబంధించి ఏమైనా ఉంటే, ముందుగా జగన్ మోహన్ రెడ్డి కంటే ముందే, పేర్ని నాని కలిసి, ఆయనతో చర్చిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసిన ప్రజలు, ఏమనుకుంటారు ?

perni 15122021 2

పేర్ని నాని సినిమాటోగ్రఫీ మంత్రి ఏమో, ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతులు కూడా ఉంటాయి ఏమో అని అనుకుంటారు కదా ? ఏపిలో సినిమాటోగ్రఫీ అంటే పేర్ని నాని అని, మీడియా కూడా ఇప్పటి వరకు అనుకుంటుంది. ఇక ప్రజలు అనుకోవటంలో ఆశ్చర్యం ఏమి ఉంది. అయితే, ప్రజలను, అటు మీడియాకు కూడా షాక్ ఇస్తూ, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతులు ఇచ్చారు. ఈ వార్త చూసిన పలువురు షాక్ అయ్యారు. అదేంటి ఇన్నాళ్ళు పేర్ని నాని సినిమాటోగ్రఫీ మంత్రి కాదా ? మరి ఎందుకు సినిమా వాళ్లతో చర్చలు జరుపుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. జగన్ మార్క్ అంటే ఇలాగే ఉంటుంది మరి. టికెట్ ధరలు జీవోని హైకోర్టు కొట్టివేయటంతో, ఇప్పుడు ప్రభుత్వం అపీల్ చేసిన సంగతి తెలిసిందే. మరి కోర్టు వ్యవహారాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయని అనుకున్నారో ఏమో కానీ, ఉన్నట్టు ఉండి, పేర్ని నానికి సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ బాధ్యతులు కూడా ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, తనదైన శైలిలో, తనకంటూ ఒక మార్క్ తెచ్చుకున్నారు. ఒక్కడే అయినా, ప్రభుత్వానికి అదరక బెదరక, ప్రతి రోజు ప్రభుత్వానికి చెవిలో జోరీగలా తయారయ్యారు. ప్రతి రోజు జరిగే అంశాలు, ప్రెస్ మీట్ పెడుతూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ ఉంటారు. అందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే, వైసీపీ పెద్దలు, రఘురామకృష్ణం రాజుని మాత్రం, ఎక్కడా ఏ విధంగా కూడా లొంగదీసుకోలేక పోతున్నారు. సిఐడి కేసు పెట్టి, హింసించినా, ఆయన డోంట్ కేర్ అంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా కూడా తనదైన శైలిలో, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. రఘురామకృష్ణం రాజు మాట్లాడితేనే హాట్ టాపిక్ కాదు, ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఆయన వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తున్న వైసీపీ వారికేమో మండి పోతుంది. నిన్న పార్లమెంట్ లో మాట్లాడిన మిథున్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక కష్టాలు గురించి ఏకరువు పెట్టారు. అంతే కాదు, మీరు వేడుకోండి మహా ప్రభో, మీరు కనుక మమ్మల్ని ఆదుకోలేక పోతే, మాకు దిక్కు లేదు అంటూ, లిటరల్ గా, దేబరిస్తూ, ప్రధానిని, ఆర్ధిక మంత్రిని, తమని రక్షించండి అని వేడుకున్నారు.

rrr 15122021 2

అయితే ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. స్వయంగా అధికార పార్టీ, మా పని అయిపొయింది, ఆదుకోండి అని చెప్పటంతో, ఈ వార్త సెన్సేషన్ అయ్యింది. అయితే ఈ వీడియో చుసిన అందరూ , మిథున్ రెడ్డి చెప్పిన దానికంటే, మిథున్ రెడ్డి వెనుక ఉన్న రఘరామకృష్ణం రాజుకి ఎక్కువ ఆకర్షితులు అయ్యారు. రఘురామకృష్ణం రాజు, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, నవ్వు ఆపుకుంటున్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ ఉంది. ఎందుకంటే, ఆయన గత ఏడాదిగా, ఆర్ధిక పరిస్థితి గురించి వివరిస్తూ వస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోక పోగా, వైసీపీ పెద్దలు, రఘురామరాజు పై ఎదురు దా-డి చేసే వాళ్ళు. ఇప్పుడు స్వయంగా తమ పార్టీ ఎంపీ , అలా వేడుకుంటుంటే, బహుసా రఘురామకృష్ణం రాజుకి, ఇదే అంశం పై తాను మాట్లాడితే, వైసీపీ చేసిన హేళనలు గుర్తుకు వచ్చి ఉంటాయి. ఏది ఏమైనా, రఘురామరాజు ఎక్స్ప్రెషన్ చూడండి అంటూ, వీడియో వైరల్ అవుతుంటే, ఆ వీడియో చూస్తున్న వైసిపీ అభిమానులు మాత్రం, కుతకుతలాడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read