చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలకు, రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. చంద్రబాబు బాధ పడటంతో, అందరూ రగిలిపోయారు. ఇది జాతీయ మీడియా న్యూస్ కూడా అయ్యింది. తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, ఇలా వివిధ రాష్ట్రాల నేతలు, ప్రజలు కూడా స్పందించారు. అయితే మొన్న ఆదివారం ఖమ్మంలో , కమ్మ వనభోజనాలు అంటూ పెట్టుకుని, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్, ఈ విషయం పై స్పందించారు. స్పందించి వదిలేస్తే సరిపోయేది, కానీ కొడాలి నాని, వంశీ, అంబటి, ద్వారంపూడి పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చం-పి-తే, 50 లక్షలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ చేసాడు. వారిని చం-పి-న వారికి ఈ బహుమతి ఇస్తానని అన్నాడు. వంశీ, నాని చాలా ఎక్కువగా మాట్లాడారని, వారిని కమ్మ కులం నుంచి బహిష్కరిస్తున్నామని అన్నారు. ఈ వీడియో ఆదివారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది చూసిన ఎవరైనా కులం కోణంలో చూస్తారు. దీన్ని చంద్రబాబుకి ఆపాదిస్తారు. లేదా తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారు. అయితే దీని వెనుక పెద్ద కుట్ర ఉందనే చర్చ జరుగుతుంది, ఈ మొత్తం ఎపిసోడ్ ఒక డ్రామా అని విశ్లేషకులు భావిస్తున్నారు.

telangana 02122021 2

ఏపిలో అధికార పార్టీ నేతల పైన ఒక చిన్న పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేస్తారు. అలాంటిది ఒక మంత్రిని, ముగ్గురు ఎమ్మెల్యేలను 50 లక్షలు ఇచ్చే చం-పే-స్తా అని బహిరంగంగా ప్రకటన చేస్తే, అతని పైన కేసులు లేవు. ఎవరికీ బీపీలు పెరగలేదు. ఎందుకో మరి ? అటు తెలంగాణాలో కూడా అతని పై కేసులు లేవు. ఈ కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీకి అనుచరుడు. ఈ సంఘటన నిన్న ఒక టీవీ ఛానల్ అందుకుని చర్చ పెట్టే దాకా సామాన్యులకు అసలు తెలియదు. నిన్న చర్చ పెట్టటం, వంశీ రావటం, టీవీ ఛానల్ బలవంతంగా క్షమాపణ చెప్పాడు అని చెప్పటం హడావిడి హడావిడిగా జరిగిపోయాయి. ఇక్కడ అర్ధం కాని విషయం ఏమిటి అంటే, అసలు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ చంద్రబాబుకి ఎందుకు అండగా నిలుస్తాడు ? చంద్రబాబు అంటేనే టీఆర్ఎస్ కు మంట. బహిరంగంగా చంపేస్తాను అంటుంటే, ఎందుకు ఎవరూ కేసులు పెట్టటం లేదు ? అసలు ఈ కమ్మ వనభోజనాలకు, చంద్రబాబుకి లింక్ ఏముందని, ఆ కులం భుజాల పై నుంచి చంద్రబాబుని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు ? దీన్ని లింక్ పెట్టుకుని, నిన్న వంశీ ఎపిసోడ్ ఎందుకు నడిపారు ?. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు విశ్లేషిస్తే, ఇది నిజమో, డ్రామానో అర్ధం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ట్రూ అప్ చార్జీలు పేరిట, రెండు నెలల పాటు వినియోగదారుల పై బాదుడు ప్రారంభించిన ప్రభుత్వం, నెల రోజుల పాటు విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలతో వెనక్కు తగ్గింది. దీంతో రెండు నెలల పాటు ఏపిలో ప్రతి ఇంట్లో విద్యుత్ షాక్ తో విలవిలలాడిన ఏపి ప్రజలు, ఈ నెల ట్రూ అప్ చార్జీలు లేకపోవటంతో, కొద్దిగా ఊరట పొందారు. వివిధ ప్రజా సంఘాలతో పాటు, రాజకీయ పార్టీలు, ప్రజలు, ట్రూఅప్ చార్జీల పై ఆందోళన చేసాయి. విద్యుత్ నియంత్రణ మండలి చేసిన పబ్లిక్ హియరింగ్ లో కూడా, అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఎప్పుడో వినియోగించిన కరెంటుకి, ఇప్పుడు మళ్ళీ చార్జీలు వసూలు చేయటం ఏమిటి అంటూ, నిలదీశారు. ఈ మొత్తం ట్రూఅప్ చార్జీలు అన్నీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేసారు. ఈ నేపధ్యంలోనే మొన్న జరిగిన హియరింగ్ అనంతరం, ఏపి విద్యుత్ నియంత్రణ మండలి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వసూలు చేసిన దాదాపుగా 600 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూళ్ళని ఇప్పటికే సదరన్, ఈస్ట్రన్ కంపెనీలను సర్దుబాటు చేసారు. అయితే సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇప్పటికీ సర్దుబాటు చేయలేదు. సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో కూడా బిల్లులు సర్దుబాటు చేయనున్నారు. ఎంత చేస్తారు అనేది చూడాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వివాదం నడుస్తునే ఉంది. క-రో-నా తరువాత, రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్ర హీరోలు నటించిన సినిమాలు విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ రోజు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదల అయ్యింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సినీ టికెట్లు ధరలు తగ్గిస్తూ, ఈ ఏడాది ఏప్రిల్ లో జీవో నెంబర్ 35ని విడుదల చేసింది. ఇది విడుదల చేసిన తరువాత, అందులో టికెట్లు రెట్లు తగ్గిస్తూ స్పష్టంగా పేర్కొంది. సి సెంటర్ల అంటే, పల్లెటూరుల్లో ఉండే టికెట్ ధరలను మరీ రూ.5 కు కుదించింది. దీని పైన అప్పట్లోనే సినీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసిన జీవో నెంబర్ 35లో ఉండే టేబుల్, ఏవైతే టికెట్ రేట్లు ఉన్నాయో, గ్రామాలు, మండల కేంద్రాలు, నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు, వీటిల్లో ఏవైతే టికెట్ రేట్లను తగ్గించారో, ఆ టేబుల్ ని నిన్నటి నుంచి ప్రభుత్వ వర్గాలు తెర మీదకు తెచ్చాయి. ఆ రేట్లు ప్రకతమే టికెట్లు ఉండాలనే ప్రచారం చేస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు, అనేది మాత్రం తెలియటం లేదు. ప్రభుత్వం నేరుగా ప్రచారం చేయకుండా, కొంత మంది చేత ఇప్పుడు ఈ జీవోని బయటకు తెచ్చి, ప్రచారంలో పెట్టింది.

balayya 02122021 2

తమ ప్రత్యర్ధి పార్టీలో ఉన్న బాలకృష్ణ సినిమా విడుదల అవుతుంది అనే ఉద్దేశంతోనే, ఈ రేట్లకే టికెట్లు అమ్మాలి అని నిర్దేశిస్తూ, ప్రభుత్వమే ఇలా ఒత్తిడి చేస్తుందని, నందమూరి అభిమానాలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు అఖండ సినిమా నుంచి మొదలు, అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాం చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇలా అన్ని సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి. ఇప్పటికే బెనిఫిట్ షోస్ ని ఆపేశారు. ఇప్పుడు టికెట్ రేట్లు కూడా భారిగా తగ్గిస్తే, ఎలా అని సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సినీ పరిశ్రమ వర్గాలు ఇప్పటికే అనేక సార్లు మంత్రి పేర్ని నానితో సమావేశం అయ్యారు. టికెట్ రేట్లు గురించి అడిగారు. అయితే పరిశీలిస్తాం అని చెప్పారు కానీ, ఈ రోజు వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. టికెట్ రేట్లు ఇలాగె ఉంటే భారీ బడ్జెట్ సినిమాలు ఇక వచ్చే అవకాసం ఉండదని, భారీగా పరిశ్రమ నష్టపోయే అవకాసం ఉంటుందని సినీ పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి , కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులు, ఇక మీ ప్రభుత్వ అకౌంట్ లో వేయం అని, నేరుగా పంచాయతీల ఎకౌంటులోనే వేస్తాం అంటూ, దిమ్మ తిరిగే విధంగా రియాక్షన్ ఇచ్చింది. 14, 15వ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించిన నిధులను, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం పంపించినా కూడా, ఈ మొత్తం దాదాపుగా రూ.1350 కోట్లు, అంటే ఇందులో 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపుగా 400 కోట్లు, అలాగే 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల 944 కోట్లు, మొత్తం 1344 కోట్ల రూపాయాల నిధులను పంచాయతీల నుంచి లాగేసింది. ఇదేమిటి అని ప్రశ్నించిన, పంచాయతీ సర్పంచ్లకు, షాక్ ఇచ్చింది. ఇది విద్యుత్ బిల్లులు బకాయలు అని, ఇవి విద్యుత్ సంస్థకు చెల్లిస్తున్నామని స్పష్టం చేసింది. వారం రోజులు క్రితం, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల 944 కోట్లు, శుక్రవారం సాయంత్రం పంచాయతీ ఎకౌంటులలో పడితే, ఆ తరువాత రోజే ఆ ఎకౌంటుల నుంచి డబ్బులు లాగేశారు. ఈ లోపు పంచాయతీ నిధులు వచ్చాయని, మౌళిక సదుపాయాలకు సంబంధించిన బిల్లులను సిఎంఎస్ఎఫ్ లో అప్లోడ్ చేస్తున్న సమయంలోనే, ఈ మొత్తం ఎకౌంటులు అన్నీ కూడా ఖాళీ అవ్వటంతో, సర్పంచ్లు బిత్తర పోయారు. దీని పైన రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ సమావేశం ఏర్పాటు చేసి, తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, ఆందోళన చేస్తున్నారు.

modi 02122021 2

తమ నిధులు తమకు ఇచ్చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జరిగిన అన్యాయం పైన, రాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ లాగేసిందని, తమ ఎకౌంటులు అన్నీ ఖాళీ అయ్యాయని పెద్ద ఎత్తున సర్పంచ్లు అందరూ, కేంద్ర ప్రభుత్వానికి కుప్పలు తిప్పలుగా ఫిర్యాదులు పంపించారు. అదే విధంగా రాజకీయ పక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసాయి. అదే విధంగా తెలుగుదేశం ఎంపీలతో పాటుగా, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలోనే, కేంద్ర ప్రభుత్వం దీని పైన అలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. నిన్న మధ్యానం రాష్ట్రంలో ఉండే అన్ని పంచాయతీలకు ఒకే మెసేజ్ పంపించింది. రాష్ట్రంలో ఉండే అన్ని పంచాయతీలు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం, ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే, సాయంత్రం లోపు అన్ని పంచాయతీలు ఓపెన్ చేస్తున్నారు. దీంతో ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులు అన్నీ పంచాయతీ ఎకౌంటులోనే పడతాయి. మొత్తానికి మన అతి తెలివికి, కౌంటర్ ఇచ్చింది కేంద్రం.

Advertisements

Latest Articles

Most Read