ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉండేది. సాంకేతిక, డ్రోన్లు, సిసి కెమెరాలు, అధునాతన హంగులు, ఫ్రెండ్లీ పోలీసింగ్, ఇలా పోలీసులు పేరు చెప్తే గడగడలాడే పరిస్థితి. తప్పు చేస్తే, ఎవరైనా ఒకటే. అంతెందుకు, ఇప్పుడు డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ గారు, విజయవాడ కమీషనర్ గా ఉండగా, కాల్ మనీ కేసులో, అప్పటి అధికారంలో ఉన్న టిడిపి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే స్వేఛ్చ అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. గౌతం సవాంగ్ గారికి మంచి పేరు వచ్చింది. కేవలం ప్రభుత్వాల మార్పు, అదే పోలీస్ వ్యవస్థ, అదే సవాంగ్ గారు, పరిస్థతి మాత్రం విరుద్ధంగా మారింది. పోలీసుల తీరుని అందరూ విమర్శిస్తూ, ఎత్తి చూపే పరిస్థితి. ఏకంగా డీజీపీ కోర్టు బోనులో నుంచుని సెక్షన్లు చదవాల్సిన పరిస్థితి. ప్రతి రోజు ఏదో ఒక కేసులో ఏపి పోలీసులకు అక్షింతలు పడాల్సిందే. ఇక అధికార వైసిపి పార్టీని ఎవరైనా విమర్శించారు అంటే చాలు, ఏపి పోలీసులు మీ ఇంటి ముందు వాలిపోతారు. అది 60 ఏళ్ళు దాటిన రంగనాయకమ్మ కానీ, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కానీ, ఈ ప్రభుత్వం విమర్శలు చేస్తే మాత్రం వదిలి పెట్టదు. సరే ఇదే పధ్ధతి అందరికీ ఉంటే, ఏపి పోలీసులు అందరికీ, అన్ని వర్గాలకు ఇదే రకమైన న్యాయం చేస్తే, ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు.

police 25102021 2

ఇక్కడే సమస్య. వైసిపి కార్యకర్తలు, నేతలు ఏకంగా జడ్జిలను, కోర్టులను, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ని, హైకోర్టు చీఫ్ జస్టిస్ ని, ఇలా ఎంత మందిని తిట్టినా, కోర్టు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోలని చెప్పినా, చోద్యం చూస్తూ ఉంటారు. అదే టిడిపి నేతలు తిడితే, అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్దలుకొట్టి, నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారు. జెడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న చంద్రబాబు ఇంటి పై దా-డి చేస్తామని ముందు రోజే చెప్పినా, పట్టించుకోరు. ఇలాంటి వైసిపి దా-డు-ల-కు కొత్త కొత్త నిర్వచనాలు చెప్తారు. భావ ప్రకటనా స్వేఛ్చ అని, వినతి పత్రం అని, బీపీ పెరిగింది అని, ఇలా ఏవో ఏవో కారణాలు చెప్పి, సమర్ధిస్తారు. ఇదే విషయం నిన్న కోర్టు ప్రస్తావించింది. హోదాలను బట్టి న్యాయం ఉండదు అని, ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటుందని కోర్టు తెలిపింది. మరి టిడిపి నేతలు మాట్లితే తోడ కొట్టి, మీసం తిప్పే పోలీస్ అధికారుల సంఘం, వైసిపి నేతలు పోలీసులను అన్ని బూతులు తిడుతున్నా, ఎందుకు తొడలు కొట్టటం లేదో, మీసాలు తిప్పటం లేదో అర్ధం కావటం లేదు. మొత్తానికి ఏపి పోలీసుల వన్ సైడ్ వైఖరి పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆశిద్దాం.

2014 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా వ్యవసాయ ఆదయ రాష్ట్రం అని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు గారు ట్రాక్ రికార్డు, ఆయన బ్రాండ్ ఇమేజ్ పుణ్యమా అని రాష్ట్రానికి ఎక్కువగా పరిశ్రమలు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు వందల కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టాయి. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులను కాదు అనుకుని కూడా కొన్ని కంపెనీలు ఏపి వచ్చాయి అంటే, అది కేవలం చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ వల్లే. దానికి ప్రత్యెక ఉదాహరణ కియా పరిశ్రమ. తరువాత ప్రభుత్వం మారింది. జగన్ మోహన్ రెడ్డి గారి నుంచి ప్రజలు ఏమి అద్భుతాలు కోరుకోలేదు. చంద్రబాబు గారి వేసిన పునాదిని, ముందుకు తీసుకుని వెళ్తే చాలు అనుకున్నారు. అనేక కంపెనీలు అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకుని, శంకుస్థాపనలు చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ ఫాలో అప్ చేసి, సరైన వాతవరణం కలిపిస్తే చాలు, ఆ కంపెనీలు ఈ పాటికే ఏపి ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టేవి, యువతకు ఉద్యోగాలు కూడా వచ్చేవి. అయితే ఎందుకో కాని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. అంతే కాక, అనే కార్యక్రమాలు పారిశ్రామిక రంగం పై ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో కొత్త పెట్టుబడులు సంగతి తరువాత, ఇప్పటికే ఉన్న పెట్టుబడులు కూడా వెనక్కు వెళ్ళిపోవటం మొదలు పెట్టాయి.

vem 25102021 2

అనేక కంపెనీలు ఇలా వెనక్కు వెళ్ళిపోవటం మనం చూసాం. వెళ్ళిపోతే పర్వాలేదు కాని, పుండు మీద కారంలాగా, తెలంగాణా రాష్ట్రానికి వెళ్లి మనలను వెక్కిరిస్తున్నాయి. ఏపి లాస్, తెలంగాణా గైన్ అని ఊరికే అనలేదు. ఇలాంటి వాటి వల్లే అన్నారు. తాజాగా చంద్రబాబు తెచ్చిన VEM టెక్నాలజీస్ అనే కంపెనీ తెలంగాణాకు వెళ్ళిపోయింది. 2018లో ఈ కంపెనీ శంకుస్థాపన కూడా చేసుకోవటం మరో విశేషం. పశ్చిమగోదావారి జిల్లా, ఏలూరు సమీపంలో, ఈ కంపెనీ నిర్మాణానికి సిద్ధం అయ్యింది కూడా. ఏరో స్పెచ్ కు సంబదించిన పరిశ్రమ అంటే, ఎంత భవిష్యత్తు ఉంటుందో ఊహించండి. 2,000 కోట్ల పెట్టుబడి.....6,000 ఉద్యోగాలు... 325 ఎకరాలలో ఈ కంపెనీ మన ఏపిలో, మన గోదావరి జిల్లాలో వచ్చేది. నేడు ఇదే కంపెనీ ఇప్పుడు తెలంగాణాకు వెళ్ళిపోయింది. అక్కడ కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కూడా అయిపొయింది. ఏపి ప్రజలు ఏమి కోల్పోతున్నారో, అర్ధం అవుతుందో లేదో కానీ, మనకు వాలంటీర్ ఉద్యోగాలు, మటన్ కొట్టు ఉద్యోగాలు, బియ్యం వ్యాన్ ఉద్యోగాలు మాత్రమే మిగిలేల ఉన్నాయి. అలోచించి ఆంధ్రుడా.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టిన సంగతి తెలిసిందే. టిడిపి పార్టీ ఇచ్చిన బంద్ కాల్ సందర్భంగా నాదెండ్ల బ్రహ్మం బంద్ లో పాల్గున్న సందర్భంలో, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత సాయంత్రం, అందరినీ వదిలి పెట్టినా నాదెండ్ల బ్రహ్మంను మాత్రం వదిలి పెట్ట లేదు. ఆయన ఆచూకీ లభ్యం కాక, ఆందోళన చెందారు. చివరకు తరువాత రోజు ఉదయం అతని ఆచూకీ లభ్యం అయ్యింది. పోలీసులు కస్టడీలో ఉన్నట్టు అప్పుడు చెప్పారు. అయితే ఆయన్ను స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టగా, పోలీసులు కొట్టారని మేజిస్ట్రేట్ కు చెప్పారు. చివరకు నాదెండ్ల బ్రహ్మంను రిమాండ్ కు పంపారు. దీంతో నాదెండ్ల బ్రహ్మం, హైకోర్టులో బెయిల్ కోసం పిటీషన్ వేసారు. దీని పై శనివారం అన్ని కేసులతో పాటు, ఇది కూడా విచారణకు వచ్చింది. ఈ సందర్భంలో ఈ ససే విచారణను సోమవారం విచారణ చేస్తాం అని చెప్తూనే, కోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసులతో పాటుగా, కింద కోర్టు మేజిస్ట్రేట్ల పై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఆలోచన ఏమిటి, అసలు మీరు ఏమి చేయాలి అనుకుంటున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

magistrate 24102021 2

నాదెండ్ల బ్రహ్మం కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్టిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ళ లోపు సెక్షన్లు అని, మరి 41ఏ నోటీసులు ఇచ్చి, ముందుగా విహరణ చేసి, మేజిస్ట్రేట్ అనుమతి తీసుకుని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కోర్టు ప్రశ్నించింది. నిబంధనలను మీ ఇష్టం వచ్చినట్టు తుంగలోకి తొక్కుతారా అంటూ ప్రశ్నించింది. పోలీస్ స్టేషన్లో అతన్ని కొట్టటం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ వైఖరి పై కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక పక్క అతన్ని పోలీసులు కొట్టిన విషయం నమోదు చేసారు, మరి రిమాండ్ కు ఎందుకు ఇచ్చారు అంటూ కోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో అసలు ఏమి జరుగుతుంది, సామాన్యుల పరిస్థితి ఏమిటి అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు వైఖరి పై అనేక ఫిర్యాదులు తమకు వస్తున్నాయని, అన్నీ గమనిస్తున్నాం అని హెచ్చరించింది. నాదెండ్ల బ్రహ్మం బెయిల్ విషయం పై సోమవారం నాడు విచారణ చేస్తాం అని కోర్టు తెలిపింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కి రాష్ట్రపతి అపాయింట్‍మెంట్ ఇవ్వటంతో, చంద్రబాబు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పయనం అయ్యారు. చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఇప్పటికే సీనియర్ నేతలు అందరూ ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట సోమిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, టీడీ జనార్ధన్, అనగాని, బీసీ జనార్ధన్ రెడ్డి ఢిల్లీ బయలు దేరారు. బెంగళూరు నుంచి  కాలువ శ్రీనివాసులు వెళ్లనున్నారు. విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరిన అచ్చెన్నాయుడు, వంగపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, విజయవాడ నుంచి ఢిల్లీ బయల్దేరిన యనమల, కేశినేని, నక్కా ఆనంద్‍బాబు, వర్ల రామయ్య, షరీఫ్, నిమ్మల రామానాయుడు ఢిల్లీ వెళ్లారు. ప్రధానంగా టిడిపి కార్యాలయం పై దా-డి, పట్టాభి ఇంటి పై దా-డి, అలాగే రాష్ట్రంలో విచ్చలవిడిగా లభ్యం అవుతున్న గంజాయి, డ్ర-గ్స్ పైన ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా, ఈ రెండున్నర ఏళ్ళలో, రాష్ట్రంలో జరిగిన అనేక రాజ్యాంగ విరుద్ధమైన పనుల పై కూడా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. ఇవన్నీ చేసి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు కోరనున్నారు. రాష్ట్రపతితో భేటీ తరువాత చంద్రబాబు అమిత్ షా ని కూడా కలిసే అవకాసం ఉంది.

delhi 25102021 2

అమిత్ షా గత మూడు రోజులుగా కాశ్మీర్ లో ఉన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. ఆయన సమయాన్ని బట్టి, అపాయింట్మెంట్ లభించే అవకాసం ఉన్నట్టు టిడిపి నేతలు చెప్తున్నారు. ఇతర నేతలను ఎవరిని కలుస్తారు అనేది చూడాల్సి ఉంది. ఎన్నికల తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళలేదు. మరి ఈ భేటీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, ఎప్పుడూ లేని విధంగా టిడిపి ఆఫీస్ పై, పట్టాభి ఇంటి పై దా-డి చేసిన వారిని గుర్తించి, వారి పై కేసులు పెట్టమని, నోటీసులు ఇచ్చామని, అరెస్ట్ లు చేస్తున్నామని హడావిడి చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం చంద్రబాబు పర్యటన నేపధ్యంలో, ఢిల్లీ నుంచి వివరాలు అడిగితే ఇవి చూపించటానికే మత్రమే చేస్తున్న పనులు అని టిడిపి ఆరోపిస్తుంది. గతంలో ఎన్నో జరిగాయని, ఏకంగా బాబు ఇంటి మీద దా-డి చేసినా ఏమి చేయలేదని, ఇప్పుడు కేవలం ఢిల్లీ పర్యటన నేపధ్యంలో హడావిడి చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read