టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పిటీషన్ వాదనలు సందర్భంగా హైకోర్టు, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా పాలన అంటే గౌరవం లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టుని, న్యాయమూర్తులను, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని బూతులు తిడుతుంటే, కనీసం స్పందించని పోలీసులు, ముఖ్యమంత్రిని తిట్టారు అనగానే, పట్టాభిని అరెస్ట్ చేసేంత ఉత్సాహం, జడ్జిలను తిట్టిన వారి విషయంలో ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రతిష్టలు, గౌరవాలు ముఖ్యమంత్రికే కాదని, అందరికీ ఉంటాయాని కోర్టు తెలిపింది. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులు పైన ఉందనే విషయం గుర్తు పెట్టుకోవాలి అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. చట్టం ముందు అందరూ సమానమే అని, హోదాలను బట్టి చట్టం మారదని, ముఖ్యమంత్రి అయినా ఎవరు అయినా చట్టం ముందు సమానమే అని కోర్టు తెలిపింది. పోలీసుల వ్యవహార శైలిపై, కోర్టు ముందు అనేక పిటీషన్లు నమోదు అవుతున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. పట్టాభి అరెస్ట్ విషయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదు అంటూ కోర్టు పోలీసులను ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్ట్ లో అన్నీ తప్పుల తడకలు ఉన్నాయని, ఒక పక్క మేము పట్టాభిని అరెస్ట్ చేయటానికి ఇంటికి వెళ్ళామని రిమాండ్ రిపోర్ట్ లో రాసారని కోర్టు తెలిపింది.

hc 24102021 2

మరో పక్క ఏమో సెక్షన్‌ 41ఏ నోటీస్ ఇచ్చాం అని, ఆయన సహకారం అందించలేదు కాబట్టి, అరెస్ట్ చేసాం అని అంటున్నారు. రెండూ విరుద్ధమైన వ్యవహారాలు అని, రిమాండ్ రిపోర్ట్ రాసిన అధికారికి ఇది ఆత్మహత్యాసదృశంలా కనపడటం లేదా అని కోర్టు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న తప్పులను ఎత్తి చూపింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వ్యవహారం ఉందని కోర్టు తెలిపింది. అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే, 41ఏ నోటీస్ ఎందుకు ఇచ్చారని కోర్టు ప్రశ్నించింది. నోటీస్ ఇచ్చాం అని అంటున్నారని, మరి నోటీస్ ఇస్తే, అరెస్ట్ చేయాలి అంటే, మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకునే అరెస్ట్ చేయాలి కదా అని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటించారో లేదో తెలపాలని, అఫిడవిట్ వేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. వాళ్ళు మాట్లాడింది, తప్పా ఒప్పా అనేది చెప్పటం లేదని, కానీ ప్రతి దానికి ఒక విధానం ఉంటుందని, ఆ విధానం ప్రకారం పోలీసులు ప్రవర్తించారా లేదా అనేది ఇక్కడ చర్చ అని, ఒకరి విషయంలో ఒకలా, మరొకరి విషయంలో ఒకలా ఉండదని, హోదాలు చట్టం ముందు ఉండవని, అందరికీ చట్టం ఒకటే అని కోర్టు తెలిపింది.

మా ఎన్నికల వివాదంలో, వైసీపీ కార్యకర్తలు దూరారు అనే వార్తలు, ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే మా ఎన్నికల్లో ఆ వర్గం మీద ఈ వర్గం, ఈ వర్గం మీద ఆ వర్గం దూషణలకు దిగాయి. అయితే, ఎన్నికలు అయిపోవటం, ప్రకాష్ రాజ్ ఓడిపోయి, మంచి విష్ణు గెలవటం, అందరూ ఫోటోలు దిగటంతో, ఇక వివాదం ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే రెండు వర్గాలు ఈ వివాదాన్ని ఇంకా ఇంకా లాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేసారు. సినిమీ ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు, మా ఎన్నికల్లో దూరారని, ఒక వైసిపి కార్యకర్త ఫోటో ఒకటి విడుదల చేసారు. అతనికి ఏమి సంబంధం ఉందని ఎన్నికల ప్రక్రియలో ఉన్నాడని నిలదీసారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు, అలియాస్ సాంబా. జగ్గయ్యపేటకు చెందిన ఈ వ్యక్తి ఒక రౌడీ షీటర్ అని ప్రకాష్ రాజ్ చెప్తూ, జగన్ మోహన్ రెడ్డితో ఈ రౌడీ షీటర్ ఉన్న ఫోటోలు కూడా విడుదల చేసారు. ఈ విషయం పై ఆయన ఎన్నికల అధికారికి కూడా లేఖలు రాసారు. దీని పై సమాధానం చెప్పాలని కోరారు. తాము అందుకే సిసిటీవీ ఫూటేజ్ మొత్తం ఇవ్వమని కోరుతున్నాం అని, అక్రమాలు జరిగాయాని ప్రకాష్ రాజ్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వైసిపి కార్యకర్త విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుడ్ని.

vishnu 24102021 2

ప్రకాష్ రాజ్ కు కౌంటర్ గా విష్ణు ఈ రోజు మరో వీడియో విడుదల చేసారు. ప్రకాష్ రాజ్ ఎవరు అయితే నూకల సాంబశివరావు అనే వ్యక్తి విష్ణు మనిషి అని చెప్తున్నారో, ఈ మనిషి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ తో ఉన్న వ్యక్తులకు కూడా సాన్నిహితంగా ఉంటున్నాడు అంటూ విష్ణు మరో వీడియో విడుదల చేసి సంచలనానికి తెర లేపారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుడు శ్రీకాంత్ కొడుకు నటించిన పెళ్లిసందడి బృందం తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు, ఆ బృందంతో ఈ వైసిపి రౌడీ షీటర్ సాంబ కనిపించాడు. ఇదే వీడియోని ఇప్పుడు విష్ణు పోస్ట్ చేసారు. జగన్, మోహన్ బాబు, విష్ణుతో సాంబకు దగ్గర సంబంధాలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ చెప్పగా, ఇదే సాంబ ప్రకాష్ రాజ్ ప్యానెల్ తో ఉన్నవారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీనికి సమాధానం చెప్పలని విష్ణు వర్గం అంటుంది. అసలు ఈ వివాదంలో వైసిపి ఎందుకు దూరింది అనే విషయం పై క్లారిటీ రావటం లేదు. ఇదే వైసిపి నేతను ఇప్పుడు విష్ణు కూడా టార్గెట్ చేయటంతో, వైసిపి శ్రేణులు కూడా షాక్ తిన్నాయి. జగన్ కు సన్నిహితంగా ఉంటూ, వైసిపీ వాడిని పావుగా వాడుకుంటున్నారా అని వైసిపి శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.

ఏపి అధికారుల పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చు పై, వివరణ ఇవ్వాలి అంటూ, కేంద్రం లేఖ రాసింది. ఎంపీ లాడ్స్ నిధులు పక్కదోవ పడుతున్నాయి అంటూ, రఘురామకృష్ణం రాజు ప్రధాని కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదు నేపధ్యంలోనే కేంద్రం నుంచి ఈ స్పందన వచ్చిందని తెలుస్తుంది. కేంద్రం సూచించిన నిబంధనలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయకపోవటం పై కేంద్రం, రాష్ట్రానికి లేఖ రాసింది. దీని పై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి అంటూ, ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శికి, కేంద్రం లేఖ రాసింది.  మత సంబంధ భవనాలకు ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయింపు విషయం పై కేంద్రానికి ఫిర్యాదు అందింది. బాపట్లలో ఒక చర్చి నిర్మాణానికి రూ.86 లక్షల నిధులను వెచ్చించారు అంటూ రఘురామరాజు తమ ఫిర్యాదులో తెలిపారు. చాలా చోట్ల ఇలాగే చేసారు అంటూ ఫిర్యాదు చేసారు. దీని పై కేంద్రం ప్రశ్నల వర్షం కురిపిచింది. మత సంస్థలకు  ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు చేయకూడదని తెలిసినా, ఎందుకు ఖర్చు చేసారు అంటూ కేంద్రం ప్రశ్నించింది. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, వీటికి అధికారులే బాధ్యులు అవుతారు అంటూ, కేంద్రం రాష్ట్ర అధికారులను హెచ్చరించింది. పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని కోరింది.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ రావటంతో, నిన్న సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. అక్కడ నుంచి ఆయన విజయవాడ బయలుదేరారు. మార్గమధ్యలో హనుమాన్ జంక్షన్ వద్ద, టిడిపి నేతలు ఘన స్వాగతం పలికి, జంక్షన్ లో ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళ్లి పూజలు చేసారు. అక్కడ వరకు అంతా బాగానే సాగింది. పట్టాభిని అక్కడ వరకు ఎవరూ ఆపలేదు. అయితే పొట్టిపాడు టోల్ గేట్ వద్దకు రాగానే, అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి, పట్టాభివాహనాన్ని, వాహనంతో పాటు ఉన్న ఇతర టిడిపి నేతల వాహనాన్ని ఆపేసారు. పట్టాభి వాహనం తప్ప, ఇతర వాహనాలు అన్నీ పోలీసులు ఆపేసారు. పట్టాభి వాహనం ముందు , వెనుక పోలీస్ జీపులు పెట్టి ముందుకు పోనిచ్చారు. అయితే పట్టాబి పై విజయనగరం జిల్లాలో, జగన్ ని సజ్జల ని తిట్టారు అంటూ, ఒక కేసు నమోదు అయ్యిందని, అక్కడ కేసు నమోదు అయ్యిందని ప్రచారం జరిగింది. అయితే ఈ కేసులోనే పట్టాభిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుని వెళ్తున్నారు అని, క్షణాల్లో సమాచారం వైరల్ అయ్యింది. దీంతో పట్టాభిని మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఒకసారి మళ్ళీ షాక్ కు గురయ్యారు.

pattabhi 24102021 2

పట్టాభితో పాటు ఉన్న వాహనాలను, పావుగంట తరువాత పోలీసులు విడుదల చేయటం, పట్టాభిని విజయవాడకు తీసుకుని వెళ్ళారని చెప్పటంతో, వారు అంతా పట్టాభి నివాసానికి చేరుకోగా, అక్కడ పట్టాభి లేక పోవటం చూసి షాక్ అయ్యారు. అయితే పట్టాభిని పోలీసులు తీసుకుని వెళ్ళారని ప్రచారం జరగటంతో, 12 గంటల ప్రాంతంలో పట్టాభిని తాము అరెస్ట్ చేయలేదని, ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా తమకు లేదని స్పష్టం చేసారు. కేవలం వెహికల్స్ ఎక్కువ ఉన్నాయని, కేవలం పట్టాభి వాహనాన్ని అనుమతి ఇచ్చాం అని, అయితే పట్టాభి వాహనం వేగంగా వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అయితే తనను మళ్ళీ అరెస్ట్ చేస్తారనే సమాచారం ఉండటంతోనే, పట్టాభి పొట్టిపాడు టోల్ గెట్ దాటగానే, వేరే వాహనం మారి, సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళారని కొంత మంది టిడిపి నేతలు చెప్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. మరో తప్పుడు కేసులో అరెస్ట్ చేస్తారానే సమాచారం ఉండటంతోనే, పట్టాభి సేఫ్ ప్లేస్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read