నరేగా బిల్లులకు సంబంధించి, ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. సుమారుగా 494 పిటీషన్ల పై గతంలో హైకోర్టు, ఈ రోజు లోగా బిల్లులు చెల్లించాలని, దానికి సంబంధించిన వివరాలను, అటు పిటీషనర్ తరుపు న్యాయవాదులతో పాటు, ఇటు ప్రభుత్వం కూడా, కోర్టుకు తెలపాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ రోజు, ఈ కేసులకు సంబంధించి, ఈ రోజు మళ్ళీ ఈ కేసు విచారణ హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది, నరేగా బిల్లులకు సంబంధించి అనేక కేసుల్లో విజిలెన్స్ విచారణ జరుగుతుందని చెప్పి, హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. దీని వల్లే తాము బిల్లులు చెల్లించ లేక పోతున్నాం అని, ఏ కేసుల్లో అయితే విజిలెన్స్ విచారణ పూర్తి అయ్యిందో, అటువంటి కేసులలో 20 శాతం మినహాయించి బిల్లులు చెల్లించామని, హైకోర్టుకు మోఖికంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి, రాత పూర్వకంగా తమకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో పిటీషనర్ తరుపు న్యాయవాదులు, అసలు తమ క్లైంట్ల పై విజిలెన్స్ విచారణ అనేది జరగటం లేదని, ఒకవేళ విచారణ జరిగితే తమ క్లైంట్లకి నోటీసులు ఇవ్వకుండా, ఎలా విచారణ చేస్తారు అంటూ అని ప్రశ్నించారు.

hc 15092021 2

తమకు డబ్బులు కూడా చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. అదే విధంగా, గత ఏడాది అక్టోబర్ లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చిందని, అందులో విజిలెన్స్ విచారణ పూర్తయ్యిందని, బిల్లులు చెల్లిస్తామని తెలిపారని కోర్టుకు చెప్పారు. దీంతో హైకోర్టు ఒక్కసారిగా ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రతి సారి వాయిదాలు కోరటం, జాప్యం చేయటం పట్ల, పిటీషనర్లు జీవించే హక్కు కోల్పోతున్నారని, కోర్టు చెప్పింది. అధికారులను గతంలో పిలిచినప్పటికి కూడా ఎటువంటి మార్పు రాలేదని, అందు వల్ల, వచ్చే నెల నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కోర్టు ముందుకు హాజరు కావలి అంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు చీఫ్ సెక్రటరీ హాజరు అయ్యే రోజు, పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని, కోర్టు ముందుకు అఫిడవిట్ దాఖలు చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వాస్తవాలు చెప్పాలని కోర్టు ఆదేశాలు జరీ చేసింది. దీంతో ఇప్పుడు ఈ కేసు కూడా హాట్ టాపిక్ అయ్యింది.

జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ ని ఈ రోజు సిబిఐ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే, సిబిఐ కోర్టు ఈ తీర్పు ఇవ్వటానికి, ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంది అనే అంశం పై, న్యాయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. రఘరామరాజు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టేయటం వెనుక, సిబిఐ వైఖరే కారణం అని, సిబిఐ వైఖరితోనే, ఈ బిగ్ రిలీఫ్ వచ్చినట్టు న్యాయవాదుల్లో చర్చ జరుగుతుంది. రఘురామకృష్ణం రాజు థర్డ్ పార్టీ. జగన్ మోహన్ రెడ్డి పై కేసులు వేసింది సిబిఐ. దాదాపుగా 11 చార్జ్ షీట్లు వేసారు. గతంలో కూడా సిబిఐ అనేక సార్లు జగన్ కు వ్యతిరేకంగా అనేక పిటీషన్లు వేసింది. అయితే ఈ సారి రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ లో మాత్రం, వింత వైఖరి అవలంభించింది. రఘురామకృష్ణం రాజు వాదనలు వినిపిస్తూ, జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు కండీషన్లు ఎలా ఉల్లంఘిస్తుంది కోర్టు ముందు వాదనలు వినిపించారు. తమ అధికారాన్ని ఉపయోగించి, సహా నిందితులకు ఎలా పోస్టింగ్ లు ఇస్తుంది, ఎలా ప్రభావితం చేస్తుంది, మొత్తం తమ వాదనల్లో కోర్టు ముందు ఉంచారు. అయితే తాము ఎవరి మీద అయితే 11 చార్జ్ షీట్లు వేసారో, అదే సిబిఐ మాత్రం, ఇక్కడ వింత వైఖరి అవలంభిస్తూ.

cbi jagan 15092021 2

ఒకసారి న్యాయవాదులకు జ్వరం వచ్చిందని, ఒకసారి కౌంటర్ వేస్తామని సమయం తీసుకోవటం, ఒకసారి కోర్టు ఇష్టం అంటూ ఒకే లైన్ లో చెప్పటం ఇవన్నీ జగన్ మోహన్ రెడ్డి లాయర్లుకు కలిసి వచ్చాయి. రఘురామరాజుకి ఈ కేసుతో ఏమి సంబంధం అంటూ జగన్ తరుపు న్యాయవాదులు వాదించారు. రఘురామరాజు థర్డ్ పార్టీ అని, అతనికి, ఈ కేసుతో సంబంధం లేదని, ఆయనది రాజకీయ కక్ష అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఇక్కడ జగన్ లాయర్లు చెప్పిన మరో కీలక పాయింట్, అసలు స్పందించాల్సిన విచారణ సంస్థ సిబిఐ, జగన్ బెయిల్ కండీషన్లు ఉల్లంఘించారని ఎక్కడా చెప్పలేదని, సిబిఐకి లేని అభ్యంతరం, రఘురామరాజుకి ఎందుకు అంటూ కోర్టు ముందు వదనలు వినిపించారు. దీంతో కోర్టు కూడా జగన్ తరుపు న్యాయవాదుల వాదనతో ఏకీభావిచిందనే చెప్పాలి. సిబిఐ ఎక్కడా అభ్యంతరం చెప్పక పోవటంతో, విచారణ సంస్థకే ఏమి ఇబ్బంది లేనప్పుడు, ఈ పిటీషన్ ఎందుకు అనే జగన్ తరుపు న్యాయవాదుల వాదనను కోర్టు కూడా ఏకీభవించి, పిటీషన్ రద్దు చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద సిబిఐ తీసుకున్న తటస్థ వైఖరి జగన్ కు కలిసి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో సతమతం అవుతున్న వేళ, కేంద్రం నుంచి భారీ రిలీఫ్ లభించింది. ఇప్పటికే ఈ ఆర్ధిక ఏడాది చేయాల్సిన అప్పు చేసేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ అప్పు కోసం, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి, ఎట్టకేలక కొంత అప్పు సాధించుకున్న విషయం తెలిసిందే. అయితే అదే ఏ మూలకు సరిపోదు. మళ్ళీ కేంద్రం నుంచి ఎలా ఎక్కువ అప్పుకి పర్మిషన్ తెచ్చుకోవాలా అనే ఆలోచిస్తున్న సమయంలో, కేంద్రం నుంచి ఒక శుభవార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట కలిగించే వార్త ఇది. 2021-22 త్రైమాసిక-1లో, కేంద్ర ఆర్ధిక శాఖ నిర్దేశించిన లక్ష్యాలను 11 రాష్ట్రాలు చేరుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న రాష్ట్రాలకు, బహిరంగ మార్కెట్ లో అదనపు అప్పు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా, మరో పది రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ అప్పు తీసుకోవటానికి అనుమతి ఇచ్చింది. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా, మన రాష్ట్రానికి మాత్రం ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి. మొత్తం 11 రాష్ట్రాలకు అదనంగా రూ.15,721 కోట్ల వరకు అప్పు పొందేందుకు అనుమతి ఇస్తూ, కేంద్రం అనుమతులు ఇస్తూ, ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

appu 14092021 2

ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.2,655 కోట్ల వరకు అదనపు అప్పు తీసుకునేందుకు, కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. మూలధన వ్యయం లక్ష్యాన్ని చేరుకున్నందుకు, జీఎస్డీపీలో 0.25 శాతం వరకు అదనపు అప్పు తీసుకోవచ్చు అంటూ కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆర్ధిక ప్రగతి మరింతగా ముందుకు వెళ్లేందుకు, ఈ ప్రోత్సహకాలను ఇచ్చినట్టు కేంద్ర ఆర్ధిక శాఖ చెప్తుంది. నిజానికి రుణాలు తీసుకునేందుకు, జీఎస్డీపీలో 4 శాతం వరకు అనుమతి ఇస్తారు. అయితే కేవలం అయుదు నెలల్లోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుమతికి మించి అప్పులు తీసుకుంది. ఇప్పటికే అనేక అప్పులు దాచింది అంటూ, కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి లేఖలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై వివరణ ఇచ్చే పనిలో ఉంది. అయితే ఇప్పటికే అప్పు లిమిట్ అయిపోవటంతో, రాష్ట్ర ప్రభుత్వం, ఆదాయ మార్గాల వైపు చూస్తూ, విపరీతంగా అన్ని రకాల పన్నులు పెంచేసింది. ఇలాంటి సమయంలో, కేంద్రం నుంచి అదనపు అప్పు తీసుకోండి అనే ప్రకటన రావటంతో, రాష్ట్రానికి పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, ఏ1, ఏ2గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల కండీషనల్ బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ పై ఈ రోజు సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డికి బిగ్ రిలీఫ్ వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు వేసిన పిటీషన్ ను సిబిఐ కోర్టు కొట్టేసింది. జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ రఘురామరాజు పిటీషన్ వేసారు. బెయిల్ కండీషన్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ రఘురామరాజు పిటీషన్ వేసారు. అయితే ఇదే విషయంలో సిబిఐ మాత్రం, ఎలాంటి కౌంటర్ వేయకుండా, సిబిఐ కోర్టుకే నిర్ణయం వదిలేసింది. ఈ పిటీషన్ పై రాష్ట్రం మొత్తం ఆసక్తి నెలకొంది. అయితే రఘురామరాజు మాత్రం, సిబిఐ కోర్టు నిర్ణయం పై ఆయన మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్నే తెలంగాణా హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని, వేరే బెంచ్ కు దీన్ని పంపించాలి అంటూ హైకోర్టుకు వెళ్ళగా, అక్కడ మాత్రం రఘురామరాజుకు రిలీఫ్ దొరకలేదు. మొత్తం మీద, సిబిఐ కోర్టు, ఈ రోజు జగన్, విజయసాయి రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

cbi 15092021 2

ఈ పిటీషన్ రద్దు చేసిన తరువాత రఘురామకృష్ణం రాజు స్పందించారు. సాక్షిలో వచ్చినప్పుడే తనకు అనుమానం వచ్చిందని, అందుకే బెంచ్ మార్చాలని అడిగాం అని, అయినా న్యాయస్థానాల మీద గౌరవంతో ఉన్నానని, దీని పై హైకోర్టులో అపీల్ కు వెళ్తామని అన్నారు. సాక్షి కధనలకు అనుకూలంగా కూడా రెండూ ఒకేసారి రావటం యాదృచికం అని అన్నారు. గత నెలలో సాక్షి ట్వీట్ చేసినప్పుడే అర్ధం అయ్యిందని, కోర్టు మీద అపోహలు లేకుండా, బెంచ్ మార్చాలని కోరామని, అయినా కోర్టు తన వాదన వినలేదని రఘురామరాజు తెలిపారు. సిబిఐ వాదనలు కూడా అసంబద్ధంగా అనిపించాయని, రెండేళ్లుగా కోర్టుకు రాకపోయినా, సిబిఐకి ఏమి అభ్యంతరం లేక పోవటం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. దీని పై కలత చెందకుండా, హైకోర్టుకు వెళ్తాం అని, హైకోర్టు తరువాత సుప్రీం కోర్టుకు కూడా వెళ్తాం అని అన్నారు. ఇది ముందే ఊహించింది అని, కోర్టుల పై గౌవరం నమ్మకం ఉందని, నా ప్రయత్నంలో విఫలం అయ్యానని అన్నారు...

Advertisements

Latest Articles

Most Read