ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు సాధించటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతుంది. మెడలు వంచేస్తాం అని చెప్పిన వాళ్ళు, రాజ్యసభలో వైసిపీ అవసరం బీజేపీకి ఉన్నా, ఎలాంటి షరతులు ఇవ్వకుండా పూర్తిగా సహకారం ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆటలు ఆడుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు వల్లే నిధులు రావటం లేదని తేల్చేసారు. అయితే పోయిన వారం ఢిల్లీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ రెండో డీపీఆర్ 47 వేల కోట్లకు ఆమోదం త్వరలోనే వచ్చేస్తుందని, మరో వారం రోజుల్లో క్యాబినెట్ కూడా దీన్ని ఆమోదిస్తుంది అంటూ, విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఆ మాటలు అన్నీ వట్టి మాటలే అని తేలిపోయింది. అసలు విషయం ఇప్పుడు కేంద్రం చెప్పేసింది. అయితే ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చింది. పోలవరం పై కేంద్రం బాంబు పెల్చిందనే చెప్పవచ్చు. ఈ రోజు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైనా పెండింగ్ లో ఉందా, పెండింగ్ లో ఉంటే దానికి `సంబంధించిన అనుమతులు ఎప్పటి లోగా ఇస్తారు, అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్న వేసారు.
ఈ ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి షకావత్ సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి సవరించిన డీపీఆర్ విషయం పై తమ దగ్గర ఎలాంటి అనుమతులు పెండింగ్ లో లేవని స్పష్టం చేసారు. అంతే కాకుండా, 2011-2019 మధ్య కాలంలోనే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఎటువంటి సవరించిన అదనపు డీపీఆర్ తమకు సమర్పించ లేదని, ఆయన చెప్పారు. అంతే కాకుండా, గతంలో డీపీఆర్ కు సంబంధించి, 2005 ధరల ప్రకారం, 2009 లో జరిగిన అప్పటి 95వ అడ్వైజరీ మీటింగ్ లో పది వేల కోట్ల చిల్లరకు ఈ డీపీఆర్ ని ఆమోదించామని, అయితే అప్పటి నుంచి కూడా తమ శాఖలో ఎటువంటి డీపీఆర్ పెండింగ్ లో లేదని మరో బాంబు పేల్చారు. సవరించిన అంచనాలు అయితే 2019కి ముందు రెండు సార్లు సవరించామని, అయితే డీపీఆర్ మాత్రం ఏమి తమ వద్ద పెండింగ్ లో లేదని చెప్పారు. మరి పోయిన వారం విజయసాయి రెడ్డి, 47 వేల కోట్లకు ఆమోదం వచ్చేస్తుందని ఎలా చెప్పారో చూడాలి.