పెగసస్‍ వ్యవహరం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పెగసస్‍ ని ఉపయోగించి, ప్రతిపక్ష నాయకులూ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, అలాగే కొంత మంది విలేఖరుల ఫోన్ ట్యాప్ చేసారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. అలాగే పార్లమెంట్ లో కూడా ఇదే వ్యవహారం పై రచ్చ జరుగుతుంది. ఈ నేపధ్యంలో పెగసస్‍ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. పెగసస్‍ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అంటూ, సామాజిక కార్యకర్తలతో పాటుగా, కొంత మంది పత్రికాధిపతులు కూడా దీని పై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సీనియర్ జర్నలిస్టు ఎన్.రామ్ కూడా ఈ అంశం పై పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ పిటీషన్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందుకు వచ్చింది. పిటీషనర్ తరుపున సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబల్, జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందు తమ వాదనలు వినిపించారు. పెగసస్‍ వ్యవహరంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఈ పిటీషన్ ను విచారణకు అనుమతించి వాస్తవాలు బయటకు వచ్చేలా, తగు చర్యలు తీసుకోవాలి అంటూ సుప్రీం కోర్టుని కోరారు.

ramana 30072021 1

దీని పై స్పందించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కచ్చితంగా దీని పైన విచారణ జరుపుతామని, ఈ పిటీషన్ ను అనుమతించి, లిస్టు చేయాలి అంటూ ఆదేశాలు జరీ చేసారు. అయితే సహజంగా ఏ ముఖ్యమైన పిటీషన్ లు అయినా, వాటిని ప్రతి రోజు చీఫ్ జస్టిస్ ముందు పెడతారు. ఈ క్రమంలోనే, ఈ రోజు ఈ పిటీషన్ ను, కపిల్ సిబల్, చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ పిటీషన్ గురించిన వివరాలు చెప్పారు. దీని పై స్పందించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కచ్చితంగా దీని పైన విచారణ జరుపుతాం అని, దీన్ని లిస్టు చేయాలని కోరారు. ఇది లిస్టు చేసిన తరువాత, ఎప్పుడు విచారణకు వస్తుంది, ఏ బెంచ్ ముందుకు విచారణ వస్తుంది అని తెలిసే అవకాసం ఉంటుంది. అప్పుడు కేంద్రానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి, వారి అభిప్రయం కూడా తెలుసుకుంటారు. అయితే ఈ అంశం కేంద్రానికి షాక్ అనే చెప్పాలి. ఈ విషయంలో పార్లమెంట్ లోనే విచారణకు అంగీకరించని కేంద్రానికి, ఇప్పుడు ఇది సుప్రీం కోర్టుకు చేరటంతో, ఈ విషయం పై విచారణ మొదలైతే పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

ఏపీ ప్రభుత్వం ఒక్క నెలలోనే 6 నెలల అప్పు తీసుకుందని తన నివేదిక వెల్లడించిన కాగ్ - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నెలలోనే  రూ.19,717 కోట్లను రుణాల రూపంలో సమీకరించింది -ఏడాది మొత్తం మీద రూ.37,079 కోట్లు రుణంగా బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.. ఇందులో 53.18 శాతం(6 నెలల అప్పు) ప్రభుత్వం తొలి నెలలోనే తీసుకుందన్న కాగ్ - గతేదాది 34.57 శాతం ఉందన్న కాగ్ - ప్రతినెలా ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తున్న కాగ్ - తాజాగా ఏపీలో ఏప్రిల్ నెల లెక్కలను వెల్లడించిన కాగ్ - ఏప్రిల్ నెలలో చేసిన అప్పులో ప్రజా రుణం కింద రూ.3,926.33 కోట్లు, ప్రజా పద్దుగా ఉన్న రూ.15,861 కోట్లు - ఇలా వచ్చిన మొత్తంలో రూ.73.47 కోట్లు నగదు నిల్వ ఉండటంతో మొత్తం రుణం రూ.19,714.04 కోట్లుగా లెక్క కట్టిన కాగ్ - పన్ను రాబడి రూ.7,738 కోట్లే - ఏప్రిల్‍లో పన్ను రాబడి మరీ తగ్గిపోయిందన్న కాగ్ - ఇందులో జీఎస్టీ రూ.2,866.44 కోట్లు - కేంద్ర సాయం రూ.3,630 కోట్లతో పాటు పన్నేతర ఆదాయం కలిపి రూ.11,616 కోట్లు  - ఏపీలో ఏప్రిల్ నెలలో రూ.31,311 కోట్ల ఖర్చు.. దీనిలో రాబడి రూపేణా వచ్చింది కేవలం 37 శాతం - అప్పులు, ఇతరత్రా రుణాల రూపంలో సమీకరించింది సుమారు 63 శాతం ఉందన్న కాగ్

అమ్మో ఒకటో తారీఖు... ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి బుగ్గనకు పట్టుకున్న భయం. ఢిల్లీ చుట్టూ అప్పు కోసం ప్రదిక్షణలు చేస్తున్నారు. అప్పు ఎవరు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. కేంద్రం షరతులు సవరించాలని కోరుతున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించటం లేదు. మరో రెండు రోజుల్లో ఒకటో తారిఖు వచ్చేస్తుంది. మళ్ళీ జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఖర్చులు ఉంటాయి. ఇలా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో గత నాలుగు నెలలుగా జీతాలు సరిగ్గా రాకపోవటంతో, ఈ సారి పరిస్థితి పై ఉద్యోగుల్లో కూడా టెన్షన్ నెలకొంది. దీని పై ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. జీతాలు సరైన సమయానికి రాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ ఇవ్వటం లేదని అన్నారు. పీఆర్సి పై గందరగోళం ఉందని అన్నారు. ఆయన ఈ రోజు తిరుపతి దర్శనం అనంతరం, మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జీతాలు సరైన సమయానికి ఇవ్వకపోవటం పై అసహనం వ్యక్తం చేసారు. ఈ సారి అయినా జీతాలు సమయానికి పడాలని శ్రీవారిని వేడుకున్నట్టు ఆయన మీడియాతో తెలిపారు. ఒప్పంద ఉద్యోగులు పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

salaries 29072021 2

ఆయన మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికే 37 నెలలు జాప్యం అయ్యింది, ఇక జాప్యం లేకుండా, వెంటనే పక్క రాష్ట్రంలో ప్రకటించినట్టుగా, 11వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్ధిక పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో లేదు. ముఖ్యంగా ఒక జిల్లాలో పెన్షనర్ కి పెన్షన్ పడితే, మరో జిల్లాలో పెన్షన్ పడనటువంటి పరిస్థితి ఉంది. ఈ జీతాలు కూడా, ఒకటో తారీఖు పడాలి. మా ఉద్యోగులకు జీతాలు పడటం అనేది ఒక పండుగ దినం లాంటిది. గత నాలుగు నెలలు నుంచి కూడా ఆ పండుగ అనేది లేకుండా అయిపొయింది. ఏ రోజు జీతం వస్తుందో అర్ధం కాని పరిస్థితి మాకు నెలకొంది. అలాగే పాల వాళ్ళు, కిరాణా దుకాణం వాళ్ళు కూడా, మీకు జీతాలు ఎందుకు రాలేదు, ఎప్పుడూ ఫస్ట్ తారీఖు వస్తాయి కదా అంటూ, మా ఉద్యోగులను చులకన భావంతో చూసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధమైన పరిస్థితి లేకుండా, కనీసం జీతాలు అయినా ఇచ్చేందుకు ఆర్ధిక వనరులు సమకూర్చుకోవాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అన్నారు.

టీవీ5 వ్యవహరంలో, విజయసాయి రెడ్డి కక్ష పూరితంగా, కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటూ, తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఫైర్ అయ్యారు. ఆయన మాటల్లోనే... "వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాష్ట్రానికి పనికొచ్చే ఏ పనీ చేయకపోయినా.. పనికిమాలిన పనులు మాత్రం చాలా చేస్తున్నారు. ఎందుకూ పనికిరాని ఎంపీల బృందాన్ని వెనకేసుకుని ఢిల్లీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వైసీపీ ఎంపీలను ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా.. జగన్ రెడ్డిపై ఉన్న కేసుల నుండి తప్పించడానికి వాడుతున్నారు. సొంత వ్యవహారాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేకుండా పోయింది. అనేక కేసుల్లో ఏ-2గా ఉండి బెయిలుపై తిరుగుతున్న జైలు పక్షి.. మనీలాండరింగ్ వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలు రాశారు. అది కూడా వాట్సాప్ మెసేజీల ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందంటూ చర్యలు తీసుకోవాలన్నారు. లేనిదాన్ని ఉన్నట్లు అభూతకల్పనలు సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు సృష్టించడంలో వైసీపీ నేతలు, జగన్ రెడ్డి కింద పని చేస్తున్న అధికారులు ఆరితేరిపోయారు. ఇప్పుడు.. రఘురామరాజు,బి.ఆర్.నాయుడు మధ్య జరగని సంభాషణను జరిగినట్లు ఫేక్ ప్రచారానికి తెరలేపారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకునే గతంలో సుప్రీంకోర్టు కొన్ని తీర్పులిచ్చింది. 14.07.2021 నాడు A to Z ఇన్ఫ్రా సర్వీసెస్ వర్సెస్ క్రిప్టో ఇన్ఫ్రా స్ట్రక్చర్ కేసులో వాట్సప్ సందేశాలను చట్టపరమైన ఆధారాలుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేయొచ్చు, అవసరమైతే డిలీట్ చేయవచ్చు. అలాంటి వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫోర్జరీల్లో పీహెచ్డీ చేసిన 420 విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు పట్టించుకునేదెవరు.? ఎంపీ రఘురామరాజు, బి.ఆర్.నాయుడు మధ్య మనీలాండరింగ్ జరిగిందంటూ కేంద్రానికి ఇచ్చిన లేఖలో.. అవినీతి కేసుల్లో తేలుతున్న విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి కూడా సంతకాలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. దొంగే దొంగ అని అరిచినట్లు.. నిన్నటికి నిన్న అయోధ్యరామిరెడ్డి కంపెనీల్లో ఐటీ శాఖ నిర్వహించిన తనిఖీల్లో రూ.1200 కోట్ల కృత్రిమ నష్టాలు చూపినట్లు తేలింది. రూ.300 కోట్ల లెక్కల్లో లేని నగదు దొరికింది. వందల కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన దొంగను వెంటబెట్టుకుని, మరో దొంగ కేంద్ర మంత్రులకు లేఖలిచ్చేందుకు విజయసాయిరెడ్డి సిగ్గుపడాలి. ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే కక్షతో లేనిపోని పత్రాలు సృష్టించి మీడియాపై నిందలు వేస్తున్నారు. రెండేళ్లలో ప్రభుత్వం ఎన్నిసార్లు దాడులు చేసినా టీవీ 5 నిజాలు ప్రజలకు చేరవేయడమే నేరమా.? అదిరించినా, బెదిరించినా తగ్గని ఛానళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు. లేని పోని ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇతరులపై నిందలు మోపే ముందు విజయసాయి రెడ్డి తనపై ఉన్న మనీలాండరింగ్ కేసుల గురించి మాట్లాడాలి. మారిషస్ కోర్టులో మీపై విచారణ జరిగిన మాట వాస్తవం కాదా.?

అంతర్జాతీయ స్థాయిలో మీ అవినీతి గురించి ప్రస్తావించడం వాస్తవం కాదా.? మీ అవినీతి కారణంగా అంతర్జాతీయ కోర్టులో దేశ ప్రధానిపై కేసు నమోదు చేయడం నిజం కాదా.? క్విడ్ ప్రో కో, షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన మీడియా ద్వారా ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరూ మీ ఫిర్యాదు లేఖలు చూసి నవ్వుకుంటున్నారు. వాట్సాప్ మెసేజీల గురించి మాట్లాడుతున్న వైసీపీ ఎంపీలు జగన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసుల గురించి, మనీ లాండరింగ్ కేసుల గురించి మాట్లాడాలి. అంతటి ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ నేతలు ఇచ్చే ఫిర్యాదు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కొద్ది రోజులుగా ప్రభుత్వ అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నందు వలనే, ఆయా మీడియా సంస్థలపై దా-డు-ల-కు పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా టీవీ-5 యాజమాన్యానికి నోటీసులిచ్చారు. అయినా బెదరకుండా ప్రభుత్వ దుర్మార్గాలను బయటపెడుతున్నందుకే తప్పుడు పత్రాలు సృష్టించి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో శునకానందం పొందడం, అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన పకోడీ పేపర్ లో తప్పుడు రాతలతో నింపుకున్నా.. అదిరేవారు బెదిరే వారు ఎవరూ లేరని ఏ-2 గుర్తెరగాలి. 2430 వంటి జీవోలు తెచ్చినా, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టినా మీ అవినీతిని బయట పెడుతూనే ఉంటారు. అవినీతి కుంభకోణాలు బయటపెడుతుతూ.. ప్రజా పక్షాన నిలుస్తున్న మీడియా సంస్థలపై ప్రత్యక్ష దా-డు-ల-కు పాల్పుడుతున్నారు. తప్పు చేశామనే భావన ఉంటే ఎవరూ పోరాటానికి ముందుకు రారు. బి.ఆర్.నాయుడు ఏ చిన్న తప్పూ చేయలేదు కాబట్టే.. రెండేళ్లుగా పోరాడి నిలబడ్డారు. విజయసాయిరెడ్డీ.. నీకు సిగ్గుంటే ముందు తనపై ఉన్న మనీలాండరింగ్ కేసుల నుండి బయటపడాలి. ఇన్ని 420 కేసులు పెట్టుకుని ఇతరుల గురించి మాట్లాడేందుకు సిగ్గుపడాలి. అవినీతి బురదలో దొర్లుతూ.. దాన్ని ఇతరులకు అంటించాలనుకోవడం సిగ్గుచేటు. మీ తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు ఆరోపణలకు త్వరలోనే కోర్టుల్లో మొట్టికాయలు పడడం తప్పదని గుర్తుంచుకోండి."

Advertisements

Latest Articles

Most Read