కో-వి-డ్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని, ప్రభుత్వయంత్రాంగం కూడా ముఖ్యమంత్రి గతంలోచెప్పిన పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ ఫార్మాలా ప్రకారమే పనిచేస్తోంది తప్ప, ప్రజల ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యు లు నిమ్మలరామానాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "రాష్ట్రం ఇప్పటికే క-రో-నా ప్రదేశ్ గా మారింది. దేశంలో కేసుల సంఖ్య తగ్గుతుంటే, ఏపీలో మాత్రం ఆజాడలు ఎక్కడా కనిపించడంలేదు. క-రో-నా-ను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమ నే వాస్తవాన్ని ప్రభుత్వం త్వరగా గ్రహించాలి. అనేక దేశాలు క-రో-నా రెండో దశ నుంచి విజయవంతంగా బయటపడటానికి కారణం ప్రజలకు సకాలంలో వ్యాక్సిన్లు అందించడమే. ఏపీ ముఖ్యమంత్రి అసమర్థత, చేతగానితనం కారణంగా రాష్ట్రం వ్యాక్సిన్లు కొనుగోలుచేయలేని దుస్థితికి చేరింది. కేంద్రం ఉచితంగా సరఫరాచేసే వ్యాక్సిన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడితే ప్రజలు ప్రాణాలు నిలుస్తాయా? అందుకే ప్రజలంతా వ్యాక్సిన్ కు దూరమై, కో-వి-డ్ కు దగ్గరవుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ లో జగన్ ప్రభుత్వ వైఫ్యలం అడుగడుగునా కనిపిస్తోంది. వ్యాక్సిన్లు కొనకుండా మొద్దు నిద్ర పోయిన ప్రభుత్వం, కేంద్రానికి లేఖలు రాస్తూ కూర్చుంది. కేంద్రానికి లేఖలు రాస్తే వ్యాక్సిన్లు వస్తాయా లేక వ్యాక్సిన్ తయారీ సంస్థలతో మాట్లాడి, వారికి అడ్వాన్స్ లు చెల్లిస్తే, వ్యాక్సిన్లు అందుతాయా అనేది కూడా ముఖ్యమంత్రికి తెలియడంలేదా? లేఖలతో వ్యాక్సిన్లు రావని తెలిసి కూడా ముఖ్యమంత్రి ఎందుకు ప్రజలను మోసగిస్తున్నాడో వారికి సమాధానం చెప్పాలి. నిన్నకూడా ముఖ్యమంత్రి కేంద్రానికి ఒక లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డిపై, ప్రభుత్వంపై వచ్చే ప్రజా వ్యతిరేకతను ప్రైవేట్ ఆసుపత్రులపైకి మరల్చాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నిన్న ప్రధానికి లేఖరాసినట్టుగా ఉంది. తన అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ లేఖ రాశాడని దాన్నిచూస్తేనే అర్థమవుతోంది.

ప్రైవేట్ ఆసుపత్రులు వారు వ్యాక్సిన్లకు అధిక ధరలు వసూలు చేస్తాడని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. నిన్నటివరకు వ్యాక్సిన్ పంపిణీ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలోనేఉంది..తామేమీచేయలేమని చెప్పుకున్న ముఖ్యమంత్రి, నేడు తన చేతగానితనాన్ని కేంద్రానికి లేఖ రాయడం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులపై నెట్టే ప్రయత్నం చేశాడు. ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి లేఖరాయడం నిజంగా ఆయన అసమర్థతకు సంకేతం. గతంలో కేంద్రమిచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి 5శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ల కొనుగోలులో కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలకు ఇచ్చిన 45శాతం కోటా ప్రకారం జగన్ ప్రభుత్వం తయారీదారుల నుంచి సకాలంలో ఎందుకు వ్యాక్సిన్లు కొనలేకపోయింది? వ్యాక్సిన్ తయారీ కంపెనీలైన సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు ఏప్రియల్ లో విడుదల చేసిన మీడియా సమాచారంలో చాలా స్పష్టంగా తాము తయారుచేసే వ్యాక్సిన్లలో 50శాతం కేంద్రానికి కేటాయిస్తున్నామని చెప్పడం జరిగింది. మిగిలిన 50శాతంలో 5శాతం ప్రైవేట్ ఆసుపత్రులకు, 45శాతం వాటాను రాష్ట్రాలకు ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. తయారీసంస్థలు ఆ విషయం చెప్పగానే మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కేరళ, కర్ణాటక వంటి అనేకరాష్ట్రాలు వెంటనే స్పందించి, వ్యాక్సిన్ల కొనుగోలు కు తయారీ కంపెనీలకు ఆర్డర్లుపెట్టడం జరిగింది. 45శాతం వాటాను అందుకోవడానికి పోటీపడిన మహారాష్ట్ర 12 కోట్లకు, తమిళనాడు కోటి 50లక్షలు, కేరళ 70లక్షల వ్యాక్సిన్లకు, కర్ణాటక కోటి వ్యాక్సిన్లకు ఆర్డర్లు పెట్టడం జరిగింది. అనేక రాష్ట్రా లు కోటినుంచి పది కోట్ల వరకు వ్యాక్సిన్లకు ఆర్డర్లు పెట్టి, అడ్వాన్సులుచెల్లిస్తే, ఏపీ మాత్రం, ఎక్కడా ఒక్కరూపాయి కూడా వ్యాక్సిన్ సంస్థలకు చెల్లించడంగానీ, ఆర్డర్లు పెట్టడం గానీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వ్యాక్సిన్ తయారీసంస్థలతో మాట్లాడకుండా, వాటికి డబ్బులుచె ల్లించకుండా కేంద్రానికి లేఖలురాస్తూ కాలయాపనచేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామకృష్ణం రాజు పై, ఏపి ప్రభుత్వం పెట్టిన కేసు, అనేక మలుపులు తిరుగుతూ, చివరకు అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితికి చేరుకుంది. మొదట్లో రఘురామరాజుని అరెస్ట్ చేసామని హడవిడి చేసిన వైసీపీ నేతలు, మొదట్లో తమదే పై చేయి అని హడావిడి చేసారు. మా జోలికి వస్తే, ఎవరినైనా ఇలాగే చేస్తాం అనే విధంగా, సంకేతాలు ఇచ్చారు. విమర్శలు కూడా తట్టుకోలేకుండా, ఈ మధ్య ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదం అవుతుంది. రఘురామరాజు ఒక ఎంపీ. ఆయనను సిఐడి కస్టడీలోకి తీసుకున్న తీరు, తరువాత ఆయన పై దా-డి చేసారనే వార్తా బయటకు రావటం, గా-యా-లు నిజమే అని ఆర్మీ హాస్పిటల్ చెప్పటం, చివరకు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వటం ఇవన్నీ జరిగిపోయాయి. ఇదే క్రమంలో, రఘురామరాజు ప్రెస్ కాన్ఫరెన్స్ ని, ఏబిఎన్, టీవీ5 ప్రచారం చేస్తున్నాయి అంటూ, చివరకు వారి పై కూడా రాజద్రోహం కేసు పెట్టారు. ఇప్పటికే ఏబిఎన్, టీవీ5, ఈ రాజద్రోహం కేసు పై, సుప్రీం కోర్టుకు వెళ్ళాయి కూడా. ఈ కేసు త్వరలోనే సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాసం ఉంది. ఇది ఇలా ఉంటే, ఏబిఎన్ ఛానల్ ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేయటం పై, ఏబియెన్ ఎండీ రాధాకృష్ణ కూడా, అదే స్థాయిలో స్పందిస్తూ, జగన్ ప్రభుత్వానికి చాలెంజ్ విసిరారు.

rk 23052021 2

రఘురామరాజు కేసులో, సిఐడి కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, ఆయనకు తగిలిన గా-యా-ల పై గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చూసి, ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. అయితే గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ రిపోర్ట్ లో, ఎక్కడా రఘురామరాజు గా-యా-లు అయినట్టు చెప్పలేదు. వాళ్ళ పై అనేక ఒత్తిడులు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇది ఇలా ఉంటే, ఇదే విషయం పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు, ఆర్కే, జగన్ ప్రభుత్వానికి చాలెంజ్ చేసారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యుల పై ఒత్తిడి తెచ్చి, మీకు ఇష్టమైన రిపోర్ట్ తెప్పించుకున్నారని, నిజాన్ని దాచేసరని, తప్పుడు రిపోర్ట్ పై, తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, అవి నిజం కాకపొతే, తమ పైన కేసు పెట్టుకోవచ్చు అంటూ, ఆంధ్రజ్యోతితో పాటుగా, ఆర్కే కూడా ప్రభుత్వానికి చాలెంజ్ చేసారు. కేవలం తమ ఛానల్ లో, రఘురామరాజు వీడియోలు వేసినందుకే, రాజద్రోహం కేసు పెడితే, మరి ఇప్పుడు ఇంత పెద్ద ఆరోపణ చేసిన ఆంధ్రజ్యోతి పై, జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ? ఆధారాలు చూపిస్తాం అంటున్నారు, చూపించండి అని వైసీపీ నేతలు ప్రెస్ ముందుకు వచ్చి అడగగలరా ?

ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బోర్డర్ లో మళ్ళీ రచ్చ మొదలైంది. దీని పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగహ్రం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ "ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తున్న వాహనాలపై మళ్లీ తెలంగాణా సరిహద్దుల్లో అడ్డగిస్తున్నారు, ప్రతిసారీ ఈ పంచాయితీలు ఏమిటి? రాష్ట్రంలో ప్రజల బాగోగులు ముఖ్యమంత్రి జగన్ కు పట్టవా? రాష్ట్రప్రజల ఆవేదన చెవిటివాని ముందు శంఖంలా తయారైంది. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం లేదు. వేలమంది హైవేలపై ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణా అధికారులు అడ్డగిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అధికారులు మాట్లాడరు. సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలిచ్చినా పట్టించుకోవడం లేదు. పొందుగుల చెక్ పోస్టు వద్ద వాహనదారులపై తెలంగాణా పోలీసులు లా-ఠీ-చార్జి చేస్తున్నారు, అటువైపు రావద్దని బెదిరింపులకు దిగుతున్నారు. తెలంగాణా భారతదేశంలో అంతర్భాగం కాదా? అక్కడ ప్రత్యేక చట్టాలేమైనా అమలు చేస్తున్నారా? కనీసం మానవతా దృక్పథంతో కూడా వ్యవహరించడం లేదు. ప్రభుత్వాలకు ఒకవిధానం అంటూ లేకుండా పోతోంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ కనీసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడే చొరవ చూపడం లేదు. వైద్యం కోసం వెళ్లే వారి ప్రాణాలతో ఇద్దరు సిఎంలు చెలగాటమాడుతున్నారు. అత్యవసరంగా వైద్యం కోసం వెళ్లే మంత్రినో, ఎమ్మెల్యేనో సరిహద్దుల్లో ఆపితే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. రాష్ట్రంలో గవర్నెన్స్ లేదు...గవర్నమెంటు ఉన్నట్లుగా కన్పించడంలేదు, కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా సమస్యపై దృష్టిసారించాలి. తెలంగాణా అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలు ఇబ్బందిపడకుండా చూసేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుచేయాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోబోదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
"

నెల్లూరులోని కృ-ష్ణ-ప-ట్నం-లో, ఆ-నం-ద-య్య అనే వ్యక్తి ఇస్తున్న ఆ-యు-ర్వే-ద వైద్యం, క-రో-నా కు బాగా పని చేస్తుందని, ఆ నోట ఈ నోట పాకి, వేలాల్లో ప్రజలు ఆ మందు కోసం ఎగబడటం చూసాం. అయితే ఉన్నట్టు ఉండి, రెండు రోజులు క్రిందట ఆ-నం-ద-య్య మాయం అయ్యారు. ఆయన్ను అరెస్ట్ చేసారనే ప్రచారం జరిగింది. అయితే జిల్లా ఎప్సీ మాత్రం, అయన్ను అరెస్ట్ చేయలేదని, అదనపు భద్రత ఇచ్చామని చెప్పారు. అయినా రెండు రోజులు ఆ-నం-ద-య్య కనిపించపోవటంతో, ఏదో జరిగింది అనే ప్రచారం మొదలైంది. ఆయన పై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా, లేదా అసలు ఏమి జరిగింది అనే దాని పై ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఇన్ని ఊహాగానాల మధ్య, ఆ-నం-ద-య్య ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. అయితే అది కేవలం ఒక వీడియో సందేశం మాత్రమే. ఆయన ఆ వీడియోలో మాట్లాడింది ఇది. "అందరికీ నమస్కారం, నా పేరు ఆ-నం-ద-య్య. నా మం-దు పంపిణీకి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ప్రభుత్వం కూడా సుపోర్ట్ చేస్తుంది, వారి అందరికీ ధన్యవాదాలు. అతి త్వరలోనే మం-దు తయారు చేసి, మొత్తానికి పంచుతానని నేను తెలియ చేసుకుంటున్నాను. నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు. హోం క్వా-రం-టై-న్ లో ఉన్నాను." కేవలం ఈ నాలుగు ముక్కలు వీడియో బయటకు వచ్చింది.

anandayya 23052021 2

అయితే ఈ వీడియో అంతా, ఎవరో పక్క నుంచి అందిస్తున్నారు. ప్రతి మాట వెనక నుంచి ఎవరో చెప్తున్నారు. చివర్లో కూడా ఆయన వీడియో ముగిస్తే, "నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు. హోం క్వా-రం-టై-న్ లో ఉన్నాను." అని చెప్పండి అని చెప్పటంతో, ఆయన ఆ మాట చెప్పారు. ఏది ఏమైనా, ఆయన సేఫ్ గా ఉండాలని కోరుకుందాం. మరో పక్క నిన్న ఆ-యు-ష్ కమిషనర్ సమక్షంలో ఆ-నం-ద-య్య మందు తయారు చేసారని తెలుస్తుంది. ఆ-నం-ద-య్య మం-దు హానికరం కాదని ప్రాధమికంగా ఆ-యు-ష్ విభాగం చెప్పిందని సమకాహారం వసుతుంది. అయితే ఆ-నం-ద-య్య తయారు చేస్తున్న మందుని ఆ-యు-ర్వే-దం-గా గుర్తించలేమని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఆ-నం-ద-య్య మందుపై ప్రభుత్వానికి ఆ-యూ-ష్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. రేపు నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం వచ్చి, మళ్ళీ వాళ్ళ సమక్షంలో ఆ-నం-ద-య్య మరోసారి మందు తయారు చేస్తారని సమాచారం. దీంతో ఆ-నం-ద-య్య మందు పంపిణీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మరి ప్రభుత్వం, ఈ విషయం తొందరగా తేల్చేస్తే బాగుండు.

Advertisements

Latest Articles

Most Read