ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో కొ-ట్ట-టం- పై, దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ పరిణామం పై అన్ని వైపుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇది ఇలా ఉంటే, ఈ రోజు మధ్యానం హైకోర్టు కేసు డిస్మిస్ చేసి, సిఐడి కోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పటంతో, అందరూ ఇక రఘురామరాజుకి రిమాండ్ వేస్తారని అనుకున్నారు. సరిగ్గా 5 గంటలకు ఆయన సిఐడి కోర్టుకు రాగానే, అసలు విషయం బయట పడింది. అక్కడ ఉన్న తన న్యాయవాదులకు, తనని కొ-ట్టి-న దెబ్బలు చూపించారు. దీంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. వెంటనే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు లాయర్లు. ప్రాధమిక సాక్ష్యాలుగా ఆయనకు తగిలిన గాయాలు చూపించి, కేసు తీవ్రతను తెలియ చేయటంతో, డివిజినల్ బెంచ్ ఏర్పాటు అయ్యింది. దీంతో స్పెషల్ మోషన్ మూవ్ చేసారు రఘురామ రాజు తరుపు న్యాయవాదులు. దీని పై విచారణ కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ సందర్భంగా రఘరామరాజుకి తగిలిన మరికొన్ని గాయాలను, డివిజనల్ బెంచ్ ముందు పెట్టారు. ఆ ఫోటోలు చూసిన న్యాయస్థానం షాక్ తిండి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అంటూ ప్రశ్నించింది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొ-డ-తా-రు అంటూ, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది.
కొట్టిన దెబ్బలు నిజం అయితే కనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. బాధ్యులు అందరి పై చర్యలు ఉంటాయాని హెచ్చరించింది. రఘురామరాజు కోసం ముగ్గురు డాక్టర్లతో ఒక మెడికల్ బృందాన్ని ఏర్పాటు చేసింది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో ఈ బృందం ఏర్పాటు అయ్యింది. ఆ బృందం ఇచ్చిన రిపోర్ట్ తరువాతే తదుపరి ఆదేశాలు ఇస్తామని కోర్టు చెప్పింది. వైద్య పరీక్షలు మొత్తం వీడియోగ్రఫీ చేసి తమకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆ గాయాలు తాజా గాయాలు అని తేలితే మాత్రం, అందరి పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మరో పక్క సిఐడి కేసులో కూడా పోలీసులకు అక్షింతలు పడ్డాయి. రిమాండ్ రిపోర్ట్ తప్పులు తడకగా ఉండటంతో, దాన్ని జడ్జి తిరస్కరించారు. ఆయన తనకు గా-యా-లు అయ్యాయి అంటూ ఇచ్చిన ఫిర్యాదు పై, రికార్డు నమోదు చేసి, ఆయన్ను హాస్పిటల్ కు పమించారు. ఆయన రిమాండ్ రిపోర్ట్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు మెడికల్ బృందం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా తదుపరి ఆదేశాలు ఉంటాయి.