నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు పై, సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొద్ది సేపటి క్రితం బహిర్గతం అయ్యింది. రఘురామకృష్ణం రాజు పై, నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇందులో 124ఏ, 153ఏ, 505 r/w 120 బి కింద ఈ కేసులు నమోదు చేసారు. అయితే ఈ కేసులో ఆశ్చర్యకరంగా రఘురామకృష్ణం రాజుతో పాటు, టీవీ5, అలాగే ఏబిఎన్ చానెల్స్ పేర్లు కూడా కలిపారు. వీరందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు అని చెప్పి, ముగ్గురి పై కూడా కేసు నమోదు చేసినట్టు, ఎఫ్ఐఆర్ లో ఉంది. ఇక అదే విధంగా రాష్ట్రంలో రెండు వర్గాలకు వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టే విధంగా, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేసి, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చటానికి, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, టీవీ5, అలాగే ఏబిఎన్ చానెల్స్ లో, స్లాట్లను ముందుగానే తీసుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళకి చెడు భావన కలిగించే విధంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేసారు. ఇదంతా కూడా ఒక పధకం ప్రకారం న్యూస్ చానల్స్ హెడ్స్ తో కలిసి, వీళ్ళు కుట్ర పన్నారని చెప్పి, ఈ కుట్రలు ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక రకమైన దురభిప్రాయం కలిగే విధంగా వ్యవహరించారని చెప్పి పేర్కొన్నారు.

rrr 15052021 2

కులం, మతం ఆధారంగా ప్రజల్లోకి విధ్వేష భావాన్ని తీసుకుని వెళ్లి, ప్రజల్లో అభిప్రాయాన్ని కలిగించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయటానికి, ఒక పధకం ప్రకారం, నర్సాపురం ఎంపీ రఘురామ రాజు, ఏబిఎన్, టీవీ5తో కలిపి ఈ కుట్ర పన్నారని, ఆ ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ముఖ్యంగా రెడ్డి కులం, అలాగే క్రీస్టియన్ మతాన్ని కించపరుస్తూ, వారిని రెచ్చగొడుతూ, విద్వేషపూర్వక వ్యాఖ్యలు చేయటం ద్వారా, ప్రభుత్వం పై కుట్ర పన్నారని, అందులో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే రఘురామకృష్ణం రాజు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు కాబట్టే ఈ కేసుని సుమోటోగా తీసుకుని, కేసు నమోదు చేసామని అన్నారు. దీనికి సంబంధించి వీడియో ఫూటేజ్ కూడా తమ దగ్గర ఉందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అందుకే రఘురామరాజు ని ఏ1గా, టీవీ5ని ఏ2గా, ఏబీఎన్ ని ఏ3గా చేర్చామని ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ప్రాధమిన విచారణ, లభించిన ప్రధమిక సాక్ష్యధారాలతో, ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఏకంగా టీవీ చానల్స్ ని కూడా ఈ కేసులో చేర్చటం, ఆసక్తికర అంశం.

ఒక పక్క క-రో-నా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తూ, కనీసం వైద్యం అందక, బెడ్లు దొరక్క, ఆక్సిజన్ సమయానికి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా క-రో-నా రోగుల కోసం అనేక కార్యకలాపాలు చేస్తూ, అధికారం లేకపోయినా, ప్రజలకు చేతనైన సాయం చేస్తుంది. బెడ్లు, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజక్షన్లు, మందులు, ఆర్ధిక సాయం, ఆహరం ఇలా ఏది వీలు అయితే, ప్రజలకు సహాయం చేస్తూ టిడిపి ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు, తన నియోజకవర్గం అయిన కుప్పంలో ఉన్న పరిస్థితి పై ఈ రోజు సమీక్ష చేసారు. కుప్పంలో ఉన్న వంద పడకల హాస్పిటల్ లో, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం కోసం పూనుకున్నారు. ఇందు కోసం 35 లక్షలతో తన సొంత నిధులు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైద్య సిబ్బంది కొరత ఉందని తెలుసుకుని, వెంటనే ఎంత మంది కావాలో అంత మందిని నియమించాలని, వారి ఖర్చు కూడా తానే భరిస్తానని చెప్పారు. అలాగే ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో, ఆక్సిజన్ సరఫరా చేసే పరికరాలు కేవలం మొదటి అంతస్తులో ఉన్నాయని, ఆక్సిజన్ సరఫరా చేసే పరికరాలు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే మరింత వెసులుబాటు ఉంటుందని చెప్పటం, ఆ పనులు కూడా చేయాలని చంద్రబాబు చెప్పారు.

cbn 14052021 2

అలాగే ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కుప్పం ప్రజలకు టెలి మెడిసిన్ తో పాటు, అవసరం అయిన వారిని జరుగుతున్న ఆహార పంపిణీని, మరింతగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కుప్పం ప్రభుత్వ హాస్పిటల్ లో, 25 పల్స్ ఆక్సీమీటర్లు అవసరం అని చెప్పగా, రేపే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ కు పంపిస్తామని చంద్రబాబు అన్నారు. ఇక కుప్పం నియోజవర్గంలోని అన్ని మండలాల్లో ఎన్ని మందులు అవసరం అవుతాయో, అన్ని మందులు తానే పంపిస్తానని చెప్పారు. ఇక మరో పక్క ప్రభుత్వం డిగ్రీ కాలీజీలో 200 పడకలతో, ఓకేషనల్ జూనియర్ కాలేజిలో మరో 200 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, దీని పై కలెక్టర్ కు లేఖ రాస్తానని చంద్రబాబు తెలిపారు. ఈ మొత్తం ఖర్చు ఎంత అయితే అంత, తన సొంత ఖర్చులతో చేస్తామని, పనులను స్పీడ్ గా జరగాలని, ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ తనకు చెప్తే, తగిన చర్యలు తీసుకుంటానని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, స్థానిక నాయకులకు చెప్పారు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత ప్రభుత్వం పైనే ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన్ను లోక్ సభ సభ్యుడిగా అనర్హత వేటు వేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేసారు. అయితే ఈ లోపు ఎంపీ రఘురామకృష్ణరాజు తనకు భద్రత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా, ప్రభుత్వం స్పందించక పోవటంతో, ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసి, కేంద్రం ప్రభుత్వం ద్వారా, వై క్యాటగిరీ భద్రత తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్న కొన్ని అవినీతి కార్యక్రమాల పై, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. ఈ నేపధ్యంలోనే ఆయన ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు అంటూ, నాలుగు సెక్షన్ల కింద ఆయన పై కేసులు నమోదు చేసారు. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని, మరి కొందరితో కలిసి ఆయన కుట్ర పన్నుతూరు అంటూ, 124ఏ, 153బి, 505 ఐపీసీ, 120బి సెక్తిఒనల కింద కేసు నమోదు చేసారు. ఇవి నాన్ బయిలబుల్ సెక్షన్లు కావటంతో, ఆయనకు బెయిల్ రావటం కష్టం అనే చెప్తున్నారు. ఈ రోజు మధ్యానం 3.30 గంటల సమయంలో ఆయన్ను అరెస్ట్ చేసారు.

rrrr 14052021 2

ఈ క్రమంలోనే ఆయనను బలవంతంగా లిఫ్ట్ చేయటం మీడియాలో కనిపించింది. ఆయన్ను విజయవాడ తీసుకుని వస్తున్నారు. ఈ రోజు రాత్రికి విజయవాడ తీసుకుని వచ్చే అవకాసం ఉంది. రఘురామకృష్ణం రాజుకి నోటీసులు ఇచ్చినా తీసుకోలేదని, నోటీసుల్లో రాసారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అంటూ, ఆయన కుటుంబానికి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే రఘురామకృష్ణరాజు న్యాయవాదులు వెంటనే హైకోర్ట్ లో పిటీషన్ మూవ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మూడు రోజులు వరుస సెలవులు కావటం, హైకోర్టు వెకేషన్ లో ఉండటం, ఇప్పటి వరకు అరెస్ట్ చూపించకపోవటంతో, వాళ్ళు 24 గంటల్లో అరెస్ట్ చూపించే దాకా, వీళ్ళు కోర్టులో పిటీషన్ వేయటం కుదరదు. సోమవారమే ఈ పిటీషన్ విచారణకు వచ్చే అవకాసం ఉంది. మరో పక్క ముందు సిఐడి కోర్టులో పిటీషన్ వేసి, ఆ తరువాత హైకోర్టుకు వస్తారా లేదా, డైరెక్ట్ గా హైకోర్టులో పిటీషన్ వేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఈ కేసులో బెయిల్ వచ్చిన, మరో కేసులో అరెస్ట్ చూపిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ పై, సిఐడి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన్ను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారా, అసలు 30 మంది మఫ్తీలో వచ్చి అరెస్ట్ చేసారు, వాళ్ళు అసలు పోలీసులేనా అని వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నేపధ్యంలో, రఘురామకృష్ణం రాజు అరెస్ట్ పై, సిఐడి అధికారిక ప్రకటన విడుదల చేసింది. నర్సాపురం పార్లమెంట్ సభ్యడు అని రఘురామకృష్ణం రాజుని, ఆయన హైదరాబాద్ నివాసంలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. రఘరామకృష్ణం రాజు కొన్ని వర్గాలను కించపరిచేలా హేట్ స్పీచ్ లు ఇస్తున్నారని తమకు సమాచారం అందింది అని, అది కాకుండా ప్రభుత్వం పై కుట్రలు పన్నుతున్నారని సమాచారం వచ్చిందని తమ అధికారిక ప్రకటనలో సిఐడి తెలిపింది. దీని పై సిఐడి చీఫ్ పీవి సునీల్ కుమార్, ప్రాధమిక విచారణ చేసారని తెలిపారు. ఈ ఎంక్వయిరీలో వచ్చిన సమాచారం కరెక్ట్ అని తేలింది అని, రఘురామకృష్ణం రాజు, రెగ్యులర్ గా, ఒక పధ్ధతి ప్రకారం కొన్ని వర్గాలలో టెన్షన్ వాతవరణం సృష్టిస్తున్నారని, అలాగే ప్రభుత్వ పెద్దల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇది ప్రభుత్వం పై ప్రజల్లో నమ్మకం పోయేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో ప్రభుత్వం, పై నమ్మకం పోయేలా ఉన్నాయని అన్నారు.

cid 14052021 2

ఆయన స్పీచ్లు కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని అన్నారు. ఆయన ఇలాంటివి ఒక సిరీస్ ప్రకారం చేసారని తెలిపారు. కొన్ని మీడియా చానల్స్ లో కూడా, ఆయన కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసారని తెలిపారు. వీటి అన్నిటి నేపధ్యంలో, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆదేశాలు ప్రకారం, ఆయన పై, 124ఎ, 153ఎ, 505, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్టు సిఐడి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిఫర్ అయ్యిందే, ప్రభుత్వం సరిగ్గా పని చేయటం లేదని, ఇప్పుడు ఆ పనులు అన్నీ బయట పెడుతున్నారని, ఆయన్ను అరెస్ట్ చేయటం పై, సామాన్య ప్రజలతో పాటు, విపక్షాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కులాల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం, అలాగే బూతులు గురించి, ఎదుటి వాళ్ళ గురించి వైఎస్ఆర్ పార్టీ నేతలు మాట్లాడటం విడ్డురంగా ఉందని, ఇవే కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మీద పెడితే, 90 శాతం జైల్లోనే ఉంటారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read