మన దేశంలో సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 20 రోజులు పై నుంచి, పరిస్థితి ఇలాగే ఉంది. అయితే అయుదు రాష్ట్రాల ఎన్నికలు అంటూ, వివిధ రాజకీయ పార్టీలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కూడా, పెద్ద పెద్ద మీటింగ్ లు, ర్యాలీలు పెట్టటం వివాదస్పదం అయ్యింది. ఎవరు ఎన్ని చెప్పినా , ఎవరూ వినిపించుకోలేదు. అయితే ఇప్పుడు ఇదే అంశం పై, మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పై, మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. దేశంలో ఈ రోజు ఉన్న పరిస్థితికి ఎలక్షన్ కమిషన్ దే బాధ్యత అంటూ నిప్పులు చెరిగింది. ఎలక్షన్ కమిషన్ పై హత్య కేసు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని ప్రాసిక్యూట్ చేయాలని ఆగహ్రం వ్యక్తంక్ చేసింది. కనీసం ఓట్ల లెక్కింపు రోజు అయినా, తగు జాగ్రత్తలు తీసుకోవలని, తీసుకొని పక్షం పై, ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఆపేస్తామని, తమకు పూర్తి ప్రణాళిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు, మాజీ మంత్రి నారా లోకేష్ లేఖ రాసారు. ప్రస్తుతం రాష్ట్రమున్న పరిస్థితిలో, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు కోసం, మీరైనా జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో గవర్నర్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఈ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో దాదాపుగా 16.3లక్షల మంది పిల్లలు హాజరు అవుతారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత మంది బయటకు రావటం, మూర్ఖపు చర్య అని లోకేష్ అన్నారు. ప్రస్తుతం దేశంలో, 20 వరకు రాష్ట్రాలు పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయటం,రద్దు చేయటం చేసాయని గవర్నర్ కు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో పరీక్షలు నిర్వహిస్తే, వైరస్ మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని లోకేష్ అన్నారు. ఇంత మంది బయటకు వస్తే, వారికి సురక్షిత వాతావరణం కల్పించటం సాధ్యం అయ్యే పని కాదని లోకేష్ తెలిపారు. అలాగే గత కొన్ని రోజులుగా పరీక్షలు నిర్వహణ పై, తెలుగుదేశం పార్టీ తీసుకున్న ప్రజాభిప్రాయాన్ని కూడా గవర్నర్ ముందు లోకేష్ ఉంచారు. దాదాపుగా రెండు లక్షలకు పైగా విద్యార్ధులు కాని, వారి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఈ సమయంలో పరీక్షలు వద్దు అంటూ, తాము నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో, తమ అభిప్రాయాలు తెలిపి, ఈ ఉద్యమానికి మద్దతు పలికారని అన్నారు.

viswabhushan 26042021 2

ప్రభుత్వం ఈ పరీక్షలు పెడితే, వైరస్ ని అదుపు చేసే చర్యలు తీసుకోక పోవటమే కాకుండా, వైరస్ ని మరింతగా విస్తరించే అవకాసం ఉంటుందని లోకేష్ అన్నారు. మీకు విశేష అధికారులు ఉన్నాయని, ఆ అధికారాలు ఉపయోగించి, పరీక్షలు రద్దు చేసే విధంగా జోక్యం చేసుకోవాలని గవర్నర్ ని కోరారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన ప్రజాభిప్రాయాలను, దాదాపుగా 1778 పేజీలను, ఈ లేఖకు లోకేష్ జతపరిచి, గవర్నర్ కు పంపించారు. మొత్తం మీద, 112466 ప్రజాభిప్రాయాలను లోకేష్ ఆ లేఖలో గవర్నర్ కు ఇచ్చారు. ప్రభుత్వం ఎలాగూ తమ వినతి పట్టించుకోవటం లేదని, మీకున్న అధికారులు ఉపయోగించి, పరీక్షలు రద్దు అయ్యేలా చూడాలని, ప్రభుత్వానికి సూచన చేయాలని, లోకేష్ ఆ లేఖలో తెలిపారు. ఇప్పటికే పరీక్షలు రద్దు విషయం పై, గత వారం రోజులుగా నారా లోకేష్ ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వానికి అన్ని వివరాలు ఇచ్చి, రద్దు చేయాలని కోరారు. పిల్లలు కూడా ఈ ఉద్యమంలో పాల్గున్నారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయం లేదు.

నిన్నటి దాక పక్క రాష్ట్రాల్లో వినిపించిన ఆక్సిజన్ కొరత, చావులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాకాయి. ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన పరిపాలన ఉంది, ఆక్సిజన్ పక్క రాష్ట్రాలకు ఇస్తున్నాం అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత పది రోజుల నుంచి ఆక్సిజన్ ఉండటం లేదు అనే వార్తలు వింటున్నా, ప్రభుత్వ అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తుంది. విజయనగరంలోని మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. అర్థరాత్రి రెండు గంటల సమయంలో, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటంతో, ఐసోలేషన్ వార్డులో ఐదుగురు రోగుల ఇప్పటి వరకు మృతి చెందారు. ఆసుపత్రి ఆవరణలో భయానక పరిస్థితితులు నెలకొన్నాయి. ఇంకా పలువురు పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.  అయితే ఇప్పటికీ ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. అక్కడ ఉన్న రోగులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ కు పరుగులు పెడుతున్నా, అక్కడ కూడా బెడ్స్ లేని పరిస్థితి. నిన్నటి నుంచి ఆక్సిజన్ రాష్ట్ర వ్యాప్తంగా లేదు అనే వార్తలు వస్తున్నా, నిన్నటి నుంచి ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని అంటున్నారు. వైద్యులు, అధికారులు సకాలంలో స్పందించలేదని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. మరో పక్క కలెక్టర్ రాత్రి నుంచి అక్కడే ఉండి పరిస్థితి అదుపులోకి వచ్చే దాకా సమీక్ష చేస్తున్నారు.

ఏపీని క-రో-నా వైరస్ వెంటాడుతోంది. నిత్యం 11 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన పెంచుతోంది. మరోవైపు మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి బయటకు వెళ్లాలి అనుకునే ప్రయాణికులకు ఆంక్షలు తప్పడం లేదు. ఇప్పటివరకు బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారి విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకున్నా.. ఇతర రాష్ట్రాలు మాత్రం బాబోయ్ ఏపీ నుంచి రానే రావొద్దు అంటు న్నాయి. ముఖ్యంగా చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఊహించని స్థాయిలో ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా క-రో-నా-తో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల బోర్డర్ లలో పరిస్థితి దారుణంగా ఉంది. చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్లాలి అనుకునే వారికి.. శ్రీకాకుళంలో నుంచి ఒడిశా వెళ్లాలి అనుకునే వారికి కష్టాలు తప్పడం లేదు. ఆంధ్ర నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారు ఎవరైనా తప్పక ఈ పాస్ తీసుకోవాలని పక్క రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడులో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటి వరకు వెసులుబాటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్ పొందాలని స్పష్టం చేసింది.

tn 26042021 2

దీంతో సరిహద్దు దాటి వెళ్లాలి అనుకునే వారు చాలా కష్టపడాల్సి వస్తోంది. అంతరాష్ట్ర ప్రయాణలపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో అత్యవసరం, తప్పని సరి అనుకున్నవాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బోర్డర్ దాటి తమ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అంటే తప్పక థర్మల్ స్క్రీనింగ్ కు ఒప్పుకోవాలని కండిషన్ పెడుతున్నాయి. కరోనా లేదనే నెగిటివ్ రిపోర్ట్ కూడా చూపెట్టాలని బోర్డర్ దగ్గర పోలీసులు నిలదీస్తున్నా రని ఏపీ బోర్డర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ ఆంక్షలు మరింత కఠినం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల బోర్డర్ దగ్గర మాత్రమే అడ్డంకులు ఎదురవుతున్నాయి. లాక్ డౌన్ నాటి పరిస్థితి తలెత్తి.. జిల్లాల సరిహద్దుల్లోనూ చెక్ పోస్టులు వెలిసే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఒడిశాలో చాలా అసవరాలు ఉంటాయని కానీ బోర్డర్‌ వద్దే పోలీసులు నిలిపివేస్తున్నారని శ్రీకాకుళం జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read