తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఈ నెల 17న జరిగిన ఉప ఎన్నిక ఫలితాలను నిలుపుదల చేయాలని కోరుతూ బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించారు. ఉప ఎన్నిక ఫలితాలను ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మంగళవారం దాఖలు చేసిన పిటిషన్లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఎన్నికలో అక్ర మాలపై విచారణ జరపాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషను అందజేసిన వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తిరుపతి ఉప ఎన్నిక స్వేచ్చగా, నిష్పాక్షిక వాతావరణంలో జరగలేదని, అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటిషన్లో వివరించారు. ప్రజాస్వా మ్యయుతంగా జరగాల్సిన ఎన్నిక అందుకు విరుద్ధంగా జరిగిందని, అనేక చోట్ల అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో నకిలీ ఓట్లు వేయడం, బూత్ క్యాప్పు రింగ్ కు పాల్పడటం వంటివి చేశారని వివరిం చారు. అధికార పార్టీ నేతల చర్యలపై ఎన్నికల కమిషన్‌ కూడా ఏమీ చేయలేకమౌనంగా చూస్తూ ఉండిపోయిందన్నారు. ఇతర ప్రాంతాలకు చెంది న వారు నకిలీ ఓటర్ కార్డులతో పెద్ద సంఖ్యలో వచ్చారని, వారిని గుర్తిం చిన ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లు ప్రశ్నిస్తే జవాబి వ్వకుండా వెనక్కు మళ్లారని వివరించారు.

hc 21042021 2

చెకపోస్టుల ద్వారా ఇతర ప్రాంతాల వాళ్లు పెద్ద సంఖ్యలో ప్రవేశించ కుండా చూడాల్సిన రాష్ట్ర ప్ర భుత్వ యంత్రాంగం అవేమీ చేయలేదని ఆరోపించారు. ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాసినా చర్యలు తీసుకోవడంలో విఫల మైందని స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారించే అవకాశం ఉంది.అయితే ఇదే అంశం పై తెలుగుదేశం పార్టీ కూడా, హైకోర్టులో కేసు దాఖలు చేసే పనిలో ఉంది. అంతకంటే ముందు, ఎలక్షన్ కమిషన్ కి మొత్తం వివరాలు ఇచ్చారు. టిడిపి ఎంపీలు వెళ్లి ఫిర్యాదు చేసారు. చంద్రబాబు స్వయంగా 22 పేజీల లేఖ రాసారు. అలాగే దానికి సంబంధించి మొత్తం ఆధారాలు కూడా సమర్పించారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో, తెలుగుదేశం పార్టీ కూడా, హైకోర్టులో కేసు వేయనుంది.

దేశంలో పెరిగిపోతున్న క-రో-నా తీవ్రత పై ప్రధాని మోడి జాతినుద్దేశించి ప్రసంగించారు. క-రో-నా పై జాతి మొత్తం, కఠినంగా పోరాటం చేస్తున్నాం అని అన్నారు. సెకండ్ వేవ్ అనేది తుఫానులా దూసుకుని వచ్చిందని మోడీ అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడి అన్నారు. మన దేశంలో ఆక్సిజన్ కు డిమాండ్ బాగా పెరిగిపోయిందని, ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోడీ అన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిన పెంచే ప్రయత్నం చేస్తున్నాం అని, డిమాండ్ కు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు. ప్రజలు ఎక్కడా ధైర్యాన్ని కోల్పోవద్దని అన్నారు. అలాగే వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచాలని, అన్ని ఫర్మా కంపెనీలను ఆదేశాలు ఇచ్చామని అన్నారు. దేశం మొత్తం, భారీగా క-రో-నా ఆసుపత్రులు ప్రారంభం చేస్తున్నాం అని అన్నారు. మనం వ్యాక్సినేషన్ లో ముందు ఉన్నాం అని, ఇంకా ఇంకా వ్యాక్సిన్ డోస్ లు పెంచటానికి చూస్తున్నాం అని, ఇప్పటి వరకు 12 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసాం అని అన్నారు. 18 ఏళ్ళు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ అందిస్తామని అన్నారు. మరోసారి లాక్ డౌన్ విధించే పరిస్థితి రాకుండా, మనమే జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, చివరి అస్త్రంగానే లాక్ డౌన్ విధించాలని అన్నారు. అయితే అనేక మౌళిక సమస్యలు ఉన్నా, ప్రధాని వాటి గురించి ప్రస్తావించకుండా, కేవలం ప్రజలకు నాలుగు మంచి మాటలతో ధైర్యం చెప్పే పనే చేసారని, పలువురు విమర్శిస్తున్నారు.

జడ్జి రామకృష్ణ, జగన్ మోహన్ రెడ్డిని, కంసుడితో పోల్చారు అంటూ, ఆయన పై పోలీసులు దేశ ద్రోహం కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో ఆయనకు కో-వి-డ్ నెగటివ్ ఉందని చెప్పి, ఇప్పుడు పోజిటివ్ ఉందని చెప్పటం పై, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను పీలేరు నుంచి తిరుపతి తీసుకురావటం వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందని, తన తండ్రికి ఏమైనా జరిగితే పెద్దిరెడ్డి దే బాధ్యత అని ఆయన కుమారుడు వాపోయారు. ఇక, ప్రభుత్వం తనకు గిట్టనివారిపై కక్షసాధింపుధోరణితో వెళుతోందని, పగ,ప్రతీకారం, కక్ష,కార్పణ్యాలతో ప్రభుత్వం ముందుకుసాగడం దురదృష్టకరమని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య వాపోయారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "కొన్నికారణాలవల్ల సస్పెన్షన్ లో ఉన్న జడ్జిరామకృష్ణపై ఈ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షబూనాడు. అసలు రామకృష్ణ అనేవ్యక్తి ఈ భూమ్మీద ఉండనేకూడదన్నట్లుగా మంత్రిపెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నాడు. రామకృష్ణ ఫిర్యాదుచేస్తే పట్టించుకోని ప్రభుత్వం, ఆయనేదైనా చిన్నతప్పుచేసి నా భూతద్దంలో చూస్తోంది. దళితజడ్జీ రామకృష్ణ ఎక్కడున్నాడో చెప్పాలని నేను జగన్మోహన్ రెడ్డిని, మంత్రిపెద్దిరెడ్డిని ప్రశ్నిస్తున్నా. రామకృష్ణ అరెస్ట్ అయ్యా డు...జైల్లో ఉన్నాడని మీరంటారు.. అతనికి కో-వి-డ్ వచ్చిందని చెబుతున్నారు. క-రో-నా వస్తే ఆయనకు టెస్ట్ చేశారు.. టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ఆయన్ని చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకొచ్చారు. రామకృష్ణ ప్రాణానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో హని ఉంది. అతను చనిపోయే ప్రమాదముంది. కరోనా పేరిట రామ కృష్ణను మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చనిపోయేలా చేసినా కూడాఆశ్చర్యం లేదని నేనంటాను.

ఈ ప్రభు త్వం, ముఖ్యమంత్రి ఒకదళితుడు అనవసరంగా మర ణించకుండా రక్షణకల్పిస్తుందో లేదో సమాధానంచెప్పా లి. రామకృష్ణకు పూర్తిరక్షణ కల్పించి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేతిలో అతనికి ప్రా-ణ-హా-ని లేకుండా చూడాలని తోటి దళితుడిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నా. దళితసంఘాలు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాయి. తిరుపతిలో రామకృష్ణను ఎప్పుడైతే కరోనా ఆసుపత్రిలో చేర్చారో, అప్పుడే అతని ప్రా-ణా-లు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేతికి చిక్కాయని నేనంటున్నా. రామకృష్ణను పీలేరు సబ్ జైలు నుంచి చిత్తూరుకు, అక్కడినుంచి తిరుపతికి తరలించారో, ఎక్కడైతే అతను క-రో-నా చికిత్స పొందు తున్నాడో, అప్పుడే అతని ప్రాణం పెద్దిరెడ్డి చేతికి వచ్చిం ది. పెద్దిరెడ్డి బతుకు అంటే రామకృష్ణ బతుకుతాడు... చావు అంటే చ-చ్చి-పో-తా-డు. అటువంటి రామకృష్ణకు ఎవరు రక్షణకల్పిస్తారు? ఈ వ్యవహారంపై మేం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు లేఖరాయబోతున్నాం. వారికి లేఖ రాసినాకూడా, వారు తిరిగి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తెలి యచేస్తారు. మరలా అటూఇటూ తిరిగి రామకృష్ణకు రక్షణ కల్పించాలని డీజీనే కోరతారు. ఈ డీజీపీ ఎవరు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనే వ్యక్తి. ఇక అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? ఈ డీజీపీ ఉండగా పోలీస్ వ్యవస్థలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటకు వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందా? అందుకే ముఖ్యమంత్రినే అడుగుతు న్నా. ఒక దళితుడు చనిపోతే, అది ముఖ్యమంత్రికి ప్రభుత్వానికే అరిష్టము. దళితుడిప్రాణాన్ని కాపాడండి అని కోరుతున్నా." అని రామయ్య అన్నారు.

తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తీరు, భారత దేశ ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేసింది. అధికార పార్టీ తీరుతో ప్రజలు షాక్ అయ్యారు. ఎవరు ఏమి అనుకుంటే మాకేం, మా మాటే శాసనం, మా చేతలు ఎవరూ ఆపలేరు అనే విధంగా, వారు వ్యవహరించిన తీరు, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడైనా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయాలి అంటే, ఒకటి అరా ఓట్లు వేయటానికి కూడా, అభ్యర్ధులు హడలి పోతారు. ఎక్కడ దొరికిపోతామో, ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అని, షాక్ అవుతారు. అయితే ఇక్కడ మాత్రం, ఒకటి , పది, వంద కాదు, వేలల్లో జనాలను దింపారు. ఏదో ర్యాలికి వస్తున్నట్టు, ఏదో సభకు వెళ్తున్నట్టు, బస్సుల్లో తరలించారు, కళ్యాణమండపాలు, అపార్ట్ మెంట్లలో బస ఏర్పాటు చేసారు, భోజనాలు వండించారు, ప్లాన్ ప్రకారం దొంగ ఓట్లు వేయించారు. వాళ్ళు బస ఏర్పాటు చేసింది కూడా మంత్రి, ఎమ్మెల్యేలకు సంబందించిన కళ్యాణమండపాల్లోనే. ఇంత ధైర్యంగా వ్యవహారం నడిపించారు. ఇవన్నీ ప్రతిపక్షాలు, మీడియా ప్రజలు ముందు ఉంచాయి. దాదాపుగా ఒక 50 వరకు వీడియోలు, బయటకు వచ్చయి. లైన్ లలో ఉన్న వారిని అడిగితే, తమ ఇల్లు ఎక్కడో తెలియదు, తమ తండ్రి ఎవరో తెలియదు, తమ భర్త ఎవరో తెలియదు, ఇలా అనేకం మనం మన కళ్ళతో చూసాం.

అయితే ఇదే విధంగా నిన్న ఉదయం నుంచి , వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ ఆడియోలో, అవతల వైపు ఉన్న వైసీపీ నేత, దొంగ ఓట్ల కోసం, జనాలని తరలించే విషయం పై మాట్లాడారు. ఇటు వైపు ఉన్న చెవిరెడ్డి, అంత ఉదయమే అన్ని బస్సుల్లో వారిని తరలించటం కరెక్ట్ కాదని, 400 ఓట్లేగా మేము ఇక్కడ మ్యానేజ్ చేస్తాం అంటూ, ఆయన మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. అయితే ఈ విషయం పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసాయి. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఇప్పటి వరకు, అంటే రెండు రోజులు అవుతున్నా, చెవిరెడ్డి ఆ ఆడియో విషయం పై ఖండించలేదు. ఆయన మౌనం దేనికి సంకేతమో అర్ధం కావటం లేదు. సహజంగా రాజకీయ నాయకులు వెంటనే ఇలాంటివి ఖండిస్తారు. అయితే ఇక్కడ చెవిరెడ్డి మాత్రం ఖండించలేదు. ఇక్కడ మరో ప్రచారం ఏమిటి అంటే, ఆ ఆడియో లీక్ చేసింది వైసీపీ వారే అని. అయితే చెవిరెడ్డి, లేకపోతే అవతల మాట్లాడిన వైసీపీ నేత , ఇది బయటకు వదలాలి. మరి ఇది ఎవరు బయటకు వదిలారో తెలియదు కానీ, దీని పై ఇప్పటి వరకు చెవిరెడ్డి స్పందించక పోవటం, దేనికి సంకేతమో మరి.

Advertisements

Latest Articles

Most Read