సాక్షిలో తమకు క-రో-నా వచ్చిందని, తాము హైదరాబాద్ వెళ్ళిపోయాం అంటూ, వచ్చిన కధనం పై, తెలుగుదేశం నేతలు అనిత, సంధ్యారాణి, జవహర్ తీవ్రంగా స్పందించారు. శాసన మండలి సభ్యులు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, "తప్పుడు ప్రచారం చేయడం, నీతి లేని రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి, ఆయన మీడియాకు అలవాటుగా మారింది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సాక్షి ఛానల్ లో ప్రచారం చేయడం సిగ్గుచేటు. కరోనా రాకున్నా.. కరోనా వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వారి వ్యక్తిత్వాన్ని అవమాన పరచడం జగన్ మీడియాకు తగదు. సాక్షి మీడియాకు నిజాలు రాసే దమ్ము, ధైర్యం లేదని ప్రజలందరికీ ఎప్పుడో తెలుసు. ఇప్పుడు ఈ తప్పుడు కరోనా వార్తలతో జగన్ మీడియా మరింత దిగజారిపోయింది. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో.. చివరికి ఇంత నీచానికి దిగజారడం జగన్ రెడ్డికి, వారి మీడియాకు మాత్రమే చెల్లింది." అంటూ ఘాటుగా విమర్శలు చేసారు.
ఇక మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ, "నాకు కరోనా పాసిటివ్ వచ్చి వారం రోజులైంది . తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మీడియా వార్తను వెనక్కి తీసుకోవాలి. అబద్ధాలను ప్రసారం చేసి పబ్బం గడుపు కోవటం సరికాదు. నా సహచరులను,అభిమానులను ఆందోళనకు గురి చేయడం సరికాదు." అంటూ క-రో-నా రిపోర్ట్ చూపించి మరీ కౌంటర్ ఇచ్చారు. ఇక మాజీ ఎమ్మెల్యే అనిత, కూడా కౌంటర్ ఇచ్చారు. నేను ఒక పక్క తిరుపతి ఉప ఎన్నికలో, మా తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తుంటే, సాక్షిలో నాకు క-రో-నా వచ్చింది అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. నాకు ఏమి రాలేదు. నేను బాగున్నాను. సాక్షిలో వచ్చినవి అన్నీ తప్పుడు కధనాలు, ఈ వార్తలు ఖండిస్తున్నా, ఎన్నాళ్ళు ఇలా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారు, సాక్షి ఇవి మానుకోవాలి అంటూ అనిత కూడా కౌంటర్ ఇచ్చారు. మైండ్ గేమ్ లో భాగంగానే, సాక్షి ఇలాంటి కధనాలు ప్రచారం చేసి, తెలుగుదేశం చేస్తున్న ఎన్నికల ప్రచారం చెడగొట్టాలని ప్లాన్ వేసింది అంటూ టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.