వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తోంది అని అంతా అనుకుంటున్నారు. ఇవి పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆత్మసాక్షి సర్వే ఇదే తేల్చేసింది. ఇవేవీ కాకుండా చాన్నాళ్లుగా మోగకుండా ఉన్న గంట ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలతో మోగింది. ఇదే తెలుగుదేశం విజయదుందుభికి అసలైన సంకేతం. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..ఏ పార్టీ అధికారంలో ఉంటుందంటే అందులో చేరతారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలితే అటువైపే ప్రయాణిస్తారు. టిడిపి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నుంచీ గంటా టిడిపికి దూరంగా ఉన్నారు. ఇటీవల గంటా శ్రీనివాసరావు సొంతంగా చేయించుకున్న సర్వేలలో టిడిపి విజయం ఖాయమని అని తేలింది. అప్పటి నుంచీ పుట్టలోంచి పాము బయటకొచ్చినట్టు వస్తున్నారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఓటింగ్ సరళి చూసిన తరువాత గంటా తన సర్వేలు ఇవి ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకుని తెలుగుదేశం విజయంలో పాలుపంచుకుంటున్నారు. మీడియాతో కూడా మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ అని చెప్పుకొచ్చారు గంటా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాష్ట్రం అంతా కనిపించిందన్నారు. మూడేళ్ల క్రితం 50శాతం పైగా ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందని వివరించారు. ఈ ఒరవడి చూస్తుంటే 2024లో టీడీపీదే విజయం అని, రాజధాని సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల విశ్వాసం లభించలేదు అని గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అంటే 2024లో టిడిపి అధికారంలోకి వస్తుందని గంటా శ్రీనివాసరావు ఫిక్స్ అయ్యారు. ఇక యాక్టివ్ గా పనిచేస్తానని సంకేతాలు పంపారు.
news
హైకోర్టులో అవినాష్ రెడ్డికి భారీ షాక్... ఇక అరెస్ట్ ఒక్కటే తరువాయి..
కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వివేక కేసులో తెలంగాణా హైకోర్టులో రెండు పిటీషన్లు వేసారో, వాటిని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అవినాష్ రెడ్డి ఇక తప్పక సిబిఐ విచారణకు వెళ్ళటమే కాదు, సిబిఐ కి అరెస్ట్ చేసుకునే అవకాసం కూడా ఉంది. తెలంగాణా హైకోర్టు గతంలో స్పందిస్తూ, దీని పై తీర్పు ఇచ్చే వరకు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అంటూ స్పష్టం చేసింది. దీంతో ఈ రోజు ఈ కేసు పై హైకోర్టు స్పష్టమైన తీరుప్ ఇచ్చింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ని గతంలో అనేక సార్లు సిబిఐ విచారణ చేసింది. అయితే ఇప్పటికే సిబిఐ, హైకోర్టుకి తెలుపుతూ, వీరిద్దరినీ అనుమానితులుగా కాదని, వీరిని అదుపులోకి కూడా తీసుకుంటాం అని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో జగన్ ఢిల్లీ పర్యటన కూడా ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి కొద్ది సేపట్లో ఆయన పార్లమెంట్ కి వెళ్లి, ప్రధాని మోడీ, అమిత్ షా ని కలవనున్నారు. ఈ నేపధ్యంలో, ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ రావటం, అలాగే సిబిఐ అవినాష్ రెడ్డిని పిలిచే అవకాసం ఉండటంతో, ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనే ప్రచారం జరుగుతుంది.
జగన్ విశాఖ రాజధాని ఓ స్త్రీ రేపురా మాదిరిగానేనా?
గతంలో తెలుగు రాష్ట్రాల్లో దెయ్యం తిరుగుతోందని వార్తలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. ఆ దెయ్యం కూడా స్త్రీ అని, ప్రతీ ఇంటి తలుపుపై ఓ స్త్రీ రేపురా అని రాసేస్తే, దెయ్యం వచ్చి రేపు రమ్మంటున్నారనుకుని వెళ్లిపోతుందని తెగ పుకార్లు పుట్టించారు. ఏ గోడ, ఏ తలుపు చూసినా `ఓ స్త్రీ రేపు రా` రాతలతో నిండిపోయాయి. సీఎం జగన్ రెడ్డి విశాఖ రాజధాని ప్రకటనలూ ఓ స్త్రీ రేపు రా పుకార్లనే తలపిస్తున్నాయి. సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటుంటారు జగన్ రెడ్డి. అంటే తాను విశాఖలో ఉంటానని, అదే రాజధాని అని చెప్పకనే చెబుతుంటారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ మార్చి నుంచి విశాఖ రాజధాని అని ప్రకటిస్తారు. ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి మార్చిలో సీఎం విశాఖ నుంచే పరిపాలన సాగిస్తారని చెబుతుంటే, మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో ప్రతీ నెలా విశాఖ రాజధాని ప్రకటనలు తనదైన భాషా పాండిత్యంలో చేస్తుంటారు. తాజాగా సీఎం కేబినెట్ మీటింగ్‌లో జూలై నుంచి విశాఖలోనే ఉంటానని చెప్పారట. దాదాపు రెండేళ్లుగా ఇదే గందరగోళం. మూడు రాజధానులు అని ఒకసారి, విశాఖే ఏకైన రాజధాని అని మరోసారి, ప్రతీ పండగకి విశాఖ నుంచే పరిపాలన అంటూ ప్రతీసారి ప్రకటించిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు బకరాలు అవ్వడం తప్పించి..మారిందీ లేదు. మార్చిందీ లేదు. గత ఏడాది ఉగాది అన్నారు. వినాయకచవితి, దీపావళి, దసరా పండగలకి విశాఖ నుంచే పరిపాలన స్టేట్మెంట్లు ఇచ్చారు. మళ్లీ ఈ ఏడాది సంక్రాంతి నుంచి రాజధాని విశాఖ పాట అందుకున్నారు. ఇది రోజూ విని, చూసి విసిగిపోయిన జనాలు ``ఓస్త్రీ రేపు రా`` టైపులోనే వచ్చేనెలలో విశాఖ రాజధాని అని రాసుకోవడమే అని సైటైర్లు వేస్తున్నారు.
పల్నాడులో వైసీపీ పగ..జూలకంటి బ్రహ్మారెడ్డిని ఆశీర్వదించిన పూజారిపై చర్యలు
పల్నాడులో వైసీపీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ నానాటికీ వికృతరూపం దాల్చాయి. ఇటీవల బాదుడే బాదుడు కార్యక్రమానికి వెళ్లిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి లక్ష్యంగా వైసీపీ ఎటాక్ చేసింది. టిడిపి నేతల ఇళ్లు, కార్లు, ఆస్తులు ధ్వంసం చేశారు. అయితే పోలీసులు బాధితులైన టిడిపి నేతలపైనే కేసులు కట్టారు. ఆధారాలతో ఫిర్యాదులు చేసినా వైసీపీ నేతలని వదిలేశారు. బ్రహ్మారెడ్డిని తన ట్రాక్టర్‌పై ఊరేగించాడనే కక్షతో ఆ రైతు ట్రాక్టర్ తగలబెట్టేయడం పల్నాడులో వైసీపీ అరాచకాలకు పరాకాష్ట. తాజాగా బ్రహ్మారెడ్డి వెల్లడించిన మరో అంశం వింటే..అసలు ఏపీలోనే ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం రాక మానదు. కొన్ని నెలల కిందట నిదానంపాడు అమ్మవారి గుడికి బ్రహ్మారెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పూజారి బ్రహ్మారెడ్డిని ఆశీర్వదిస్తూ పూజలు చేశారు. ఆ పూజారిని ఇప్పుడు సస్పెండ్ చేశారు. గుడికి వెళ్లిన ప్రతివాడికి ఆశీర్వాదం ఇవ్వడం పూజారి బాధ్యత అని, అటువంటిది తనని ఆశీర్వదించారని పూజారిని వైసీపీ నేతలు సస్పెండ్ చేయించారంటే ఎంత భయంకరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని జూలకంటి బ్రహ్మారెడ్డి వ్యాఖ్యానించారు.