ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లుదండుకొని, చట్టానికి చిక్కి సీబీఐతో అరెస్ట్ కాబడి, చంచల్ గూడా జైల్లో 16నెలలు రిమాండ్ ఖైదీగాఉన్నవిషయం 11కేసుల్లో సీబీఐ, 5కేసుల్లో ఈడీ ఆయనపై ఛార్జ్ షీట్లు వేసిన విషయం అందరికీ తెలిసిందేనని టీడీపీజాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయనపై ఉన్నకేసులవిచారణ జరక్కుండా చూస్తున్న వైనం, ఏదోవిధంగా వాయిదాలకు వెళ్లకుండా ఎగ్గొడుతు న్న విషయం, వాయిదాలకు హాజరై విచారణ పూర్తైతే తనభవిష్యత్ తనకు క్షుణ్ణంగా తెలుస్తుందన్న నేపథ్యం లో ఆయన తనలోతానే మధనపడిపోతున్నాడన్నారు. ఆళ్లరామకృష్ణారెడ్డి ఒక గమ్మత్తైనవ్యక్తని, అతనొక కోర్టు పక్షి అని, కోర్టు వివాదాలంటే ఆయనకు చాలాఇష్టమని రామయ్య ఎద్దేవాచేశారు. చంద్రబాబునాయుడిపై రామకృష్ణారెడ్డి సీఐడీవారికి ఒకఫిర్యాదుచేశాడని, కొంద రు ధళితులు తనకు చెప్పారంటూ, ఆళ్లఫిర్యాదుచేయ గానే, సందుదొరకనే దొరికిందంటూ సీఐడీవిభాగం మాజీ ముఖ్యమంత్రికి నోటీసులిచ్చిందన్నారు. రామకృష్ణారెడ్డి సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఐదుగురు రైతులు తనకు ఫిర్యాదుచేశారని, వారిపేర్లను ప్రస్తావిం చాడని, వారిలో ఒకరైన జూపూడి జాన్సన్ అనేవ్యక్తి రాజ ధానిపరిధిలోని 29గ్రామాల్లోని వాడు కాడని రామయ్య తెలిపారు. జూపూడి జాన్సన్ ఆళ్లరామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నాడని, అతను వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడని, అటువంటివ్యక్తిని, పనికి మాలిన ఎమ్మెల్యే రైతుగా చూపాడని రామయ్య మండి పడ్డారు. బుధ్దిఉన్నవాడెవడూ ఇలాంటిపనులు చేయడ న్నారు. ముఖ్యమంత్రికళ్లల్లో ఆనందంకోసం ఆళ్లరామ కృష్ణారెడ్డి ఇటువంటిపని చేయడమేంటన్నారు. వైసీపీ విద్యార్థివిభాగం నాయకుడైన జూపూడిజాన్సన్ కు ఎక్కడా ఎకరంభూమికూడాలేదని, అతనుభూమిని రాజధానికి ఇచ్చిందిలేదన్నారు.

మరొకరైన పచ్చలపల్లి చినలక్ష్మయ్యఅనేవ్యక్తి మంగళగిరిమండలం నవులూరు మక్కెవారిపేటకు చెందినవాడని, ఆ గ్రామంకూడా రాజ ధానిపరిధిలో లేదని రామయ్య తెలిపారు. అతనుకూడా రాజధానికి గజంపొలం ఇవ్వలేదని, అతనితల్లిపేరుతో ఉన్న70సెంట్లస్థలాన్ని అతనికిప్పించేలా రామకృష్ణారెడ్డి అతనితో సంతకంచేయించుకొని, చంద్రబాబుపై చేసే తప్పుడుఫిర్యాదుకు అతనిసంతకాన్ని వాడుకున్నా డన్నారు. నవులూరుకుచెందిన ఈపూరు సుబ్బమ్మకు 70 సెంట్ల భూమిఉందని, ఆమెకూడా తనభూమిని రాజ ధానికి ఇవ్వకుండా, కృష్ణాయపాలెంలోని తనబంధువు లకు అమ్మకానికి పెట్టిందన్నారు. అందుకోసం వారినుం చి రూ.3లక్షల అడ్వాన్స్ తీసుకొని, తనభూమి కాగితా లను వారివద్దనే ఉంచిందని రామయ్య పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని నడిపిన మధ్యవర్తి చనిపోవడంతో ఆమె భూమికిచెందిన వివాదం అలానే ఉండిపోయిందన్నా రు. ఆమెభూమిని తిరిగి ఆమెకుఅప్పగిస్తామంటూ అధికారులు సుబ్బమ్మను నమ్మించి, ఆమెతో సంతకం పెట్టించుకున్నారని రామయ్య తెలిపారు. అటువంటి ఆమె ల్యాండ్ పూలింగ్ లోభూమిఇచ్చిందని పనికిమాలి న ఎమ్మెల్యే ఎలా చెబుతాడని, అతను చెప్పగనే సీఐడీ వారు ఆలోచించకుండా, విచారణ చేయకుండా నోటీసు లివ్వడమేంటని వర్ల మండిపడ్డారు. ఎర్రబాలెంకు చెంది న కందాపావని వాలంటీర్ గా విధులు నిర్వహిస్తోందని, ఆమెకు చెందిన 75సెంట్ల భూమి కాలువకింద పోవడం తో, దాన్ని తిరిగి ఆమెకు దఖలుపరుస్తామనిచెప్పి, అధికారికంగా పట్టాఇప్పిస్తామని నమ్మబలికి ఆమెతో సంతకం చేయించుకున్నారన్నారు. ఈవిధంగా తప్పు డు సంతకాలతో చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని సీఐడీ, మాజీముఖ్యమంత్రికి నోటీసులివ్వడమేంటన్నా రు?

అద్దేపల్లిసాంబశివరావు విషయానికొస్తే, అతని తండ్రికి ఇద్దరుభార్యలున్నారని, అతనితండ్రి కొండవీడు పోరంబోకు ఆక్రమించుకొని, ఆభూమికోసం ఇద్దరు భార్య లకుమారులైన సాంబశివరావు, కృపానందం మధ్య గొడ వలు జరిగాయని, ఇద్దరూకూడా ఆభూమితనదంటే , తనదంటూ వేరేవారికి అమ్మేయడంకూడా జరిగిందని రామయ్య పేర్కొన్నారు. భూమి అమ్మినతర్వాత ప్రారం భమైన వివాదాల్లో కృపానందం ఆత్మహత్యచేసుకున్నా డని, ఈ నేపథ్యంలో అధికారులు సాంబశివరావుని కలి సి ఆభూమిని అతనికి ఇప్పిస్తామంటూ దొంగసంతకం చేయించుకున్నారన్నారు. ఆళ్లరామకృష్ణారెడ్డి జీవిత మంతా ఇటువంటి పనులే చేస్తుంటాడా అని రామయ్య ప్రశ్నించారు. రామకృష్ణారెడ్డి చెప్పిన ఐదుగురిలో మొద టివాడైన జాన్సన్ కిడ్నాప్ కేసుల్లో ముద్దాయిగా కూడా ఉన్నాడన్నారు. ఈవ్యవహారంపై సీఐడీ చీఫ్ ఏం సమా ధానం చెబుతారో చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు . డీజీపీని తామేమి అడగదలుచుకోలేదని, ఆయన టీడీపీకి డీజీపీగా పనిచేయడంలేదన్నారు. ఉత్తమ డీజీ పీగా ఆయనకు బహుమతులు రావొచ్చు, లేకఆయన తెచ్చుకోవచ్చునన్న రామయ్య, తమకుమాత్రం ఆయన డీజీపీకాడన్నారు. చంద్రబాబుపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్ కరెక్టో కాదో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సమాధానంచెప్పాలన్నారు. ఎమ్మెల్యే తప్పడు రిపోర్ట్ ఇచ్చాడని, ఆయన చెప్పిన ఐదుగురు రైతుల బాగోతం బట్టబయలైందని, ఇప్పటికైనా సరే దళితరైతులను విచారణ పేరుతో వేధించడం మానుకోవాలని రామయ్య సీఐడీకి విజ్ఞప్తిచేశారు. తప్పుడు కేసులుపెట్టిన ఎమ్మె ల్యేపై కూడా సునీల్ కుమార్ చర్యలు తీసుకోవాల న్నారు. రాష్ట్రంలోని ఇతర డీజీపీలకంటే కూడా ఏపీ డీజీపీనే ఉత్తమడీజీపీగా ఎంపికయ్యారని, ఆఎంపిక ఎలా జరిగిందో కూడా తమకుతెలుసునన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ వంటి సెక్షన్లు మోపి అరెస్ట్ చేయాలన్నారు.

నవ్యాంధ్ర ప్రయాణం 2014లో ఎలా మొదలైందో అందరికీ తెలుసు. రాజధాని కూడా లేని రాష్ట్రంగా మనలని రోడ్డున పడేసారు. హేళన చేసారు, తక్కువ చేసారు. ఆ కసిలో నుంచి నవ్యాంధ్ర ప్రయాణం మొదలైంది. రాజధాని కట్టుకోవటానికి చేతిలో పైసా లేదు. సంక్షోభాన్ని, అవకాశంగా మలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన, ఈ సమస్యను అధిగమించింది. రాష్ట్రానికి మధ్యలో, అన్ని వసతులు, వనరులు ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజాధానిగా ఎంపిక చేసారు. అక్కడ రైతులను ఒప్పించి, భూసేకరణ పధ్ధతిలో, రూపాయి ఖర్చు లేకుండా 33 వేల ఎకరాలు సమీకరించారు. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ఇది ఒక రికార్డు. ఒక్క సెంటు స్థలం కూడా ప్రభుత్వాలు, నిరసనలు లేకుండా ప్రజల నుంచి తీసుకోలేవు. అలాంటిది 33 వేల ఎకరాలు ప్రజల నుంచి చంద్రబాబు సమీకరించారు. అనుకున్నట్టే పనులు జరిగాయి. అక్కడ నుంచి పరిపాలన కూడా ప్రారంభం అయ్యింది. ఈ లోపు ప్రభుత్వం మారింది. చంద్రబాబు స్థానంలో, జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. మొదటి నుంచి అమరావతి పై ఉన్న ద్వేషం, అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువ అయ్యింది. నిర్మాణాలు ఆగిపోయాయి. ఏదో ఒక రోజు నిర్మాణాలు మొదలవుతాయి అనే ఆశలో ఉన్న రైతులకు, షాక్ ఇస్తూ, దేశంలో ఎక్కడ లేని, మూడు రాజధానుల ఫార్ములా తీసుకుని వచ్చారు.

hc 22032021 2

అమరావతిలో కేవలం అసెంబ్లీ ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి అమరావతి రైతులు, ప్రభుత్వం పై పోరాటం మొదలు పెట్టారు. ఇప్పటికే 450 రోజులకు పైగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదే విధంగా న్యాయ పోరాటం కూడా రైతులు చేస్తున్నారు. దాదాపుగా 60కు పైగా పిటీషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పడ్డాయి. అయితే అప్పటి చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలో, ఈ కేసులు చాలా వేగంగా ముందుకు వెళ్ళాయి. సంక్రాంతి తరువాత, తీర్పు వస్తుందని అందరూ భావించిన సమయంలో, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ నేపధ్యంలో, కొత్త చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి వచ్చిన తరువాత, అమరావతి కేసు పై ఎలా ముందుకు వెళ్తారు అనే సస్పెన్స్ నెలకొంది. ఈ నేపధ్యంలోనే, అమరావతి కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి కేసులకు సంబంధించి, ఈ కేసులు వాదించటానికి, కొత్త బెంచ్ ఏర్పాటు అయ్యింది. జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చీ, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు అయ్యింది. అమరావతి కేసులు మళ్ళీ ఈ నెల 26 నుంచి విచారణ ప్రారంభం అవుతాయి. అయితే విచారణ కొనసాగిస్తారా, లేదా మళ్ళీ మొదటి నుంచి వాదనలు వింటారా అనే టెన్షన్ నెలకొంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

రాజధాని అమరావతిలో దళితుల అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పి నారాయణ ప్రమేయం ఉన్నట్టు సిఐడి ఎలాంటి ఆధారాలు చూపకపోవటంతో, నాలుగు వారాల పాటు ప్రాసిక్యూట్ చేయరాదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం లేదా సుప్రీం కోర్టుకు అప్పీలకు వెళ్లే యోచనలో సీఐడీ అధికారులు ఉన్నారు. అసైన్ భూములకు సంబంధించి కేసు పెట్టిన సీఐడీ ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న ఆధారాలతో ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా చంద్రబాబుకు ఇటీవలే నోటీసులు అందజేసింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే మంజూరు చేయటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, సాక్షాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయనే వాదనతో హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీం కోర్టులో అప్పీల్ పిటిషన్ వేసేందుకు సీఐడీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అసైన్ భూములు కొనుగోళ్లు చేసిన కొందరు వ్యక్తులు అప్పటి ప్ర భుత్వ పెద్దలకు సన్నిహితులుగా ఉన్నారని అవే భూములను ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించి ప్రత్యామ్నాయంగా నివాస, వాణిజ్య స్థలాలను కేటాయించారనేది సీఐడీ ఆరోపణ. ఇందులో భాగంగానే జీవో 41 జారీ చేశారనేది ప్రభుత్వ వాదన. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కేసుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకూడా సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు.

CID 22032021 2

అయితే కోర్టు ఆధారాలు అడగగా, ఇప్పటిప్పుడు ఏమి ఆధారాలు లేవని, విచారణకు అనుమితి ఇస్తే, అప్పుడు ఇస్తాం అని సిఐడి చెప్పింది. వీటన్నింటిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. నాలుగు వారాల పాటు ప్రాసిక్యూషన్ తో పాటు అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకే వర్తిస్తుందని సింగిల్ జడ్జి స్పష్టం చేసిన నేపథ్యంలో రాజధాని తుళ్లూరు మండల గ్రామాల్లో సీఐడీ అధికారులు రైతులు, సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల నుంచి ఏమైనా ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దళిత రైతుల తరుపున ఫిర్యాదు చేసాను అంటున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారించిన సందర్భంగా అసైన్ భూముల వ్యవహారంలో కొన్ని వాస్తవాలు వెలుగు చూసినట్లు చెప్తున్నారు కానీ, కోర్టు అడిగితే మాత్రం చెప్పలేక పోయారు. ఇదిలా ఉండగా ప్రాసిక్యూషన్ చేసేందుకు సీఆర్ డీఏ చట్టం అనుమతించదని దీనిపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడిన నేపథ్యంలో సీఆర్‌డీఏ చట్టంతో పాటు ఇతర క్రిమినల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్‌లను సీఐడీ అధికారులు తిరగేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇందులో భాగంగా సీఐడీ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీకి రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమె రిటైర్డ్ అయిన తరువాత ఆమెకు, ఒక సలహాదారు పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. చీఫ్ అడ్వైజర్ హోదాను ఆమెకు జగన్ ఇచ్చారు. అయితే తాజాగా ఆమెకు , ఆ పదవికి ఎంత జీతం, ఇతర సౌకర్యాలు ఏమిటి అంటి చెప్తూ, ఒక జీవో విడుదల చేసారు. నీలం సాహనీకి ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇస్తూ, జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆమెకు ఇచ్చే జీతం కూడా నిర్ధారించారు. ఆమెకు రూ.2.5 లక్షల జీతం వస్తుందని, ఆ జీవోలో తెలిపారు. అంతే కాదు, ఆమెకు తొమ్మిది మంది సిబ్బందిని కూడా ప్రభుత్వ ఖర్చులతో పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక నీలం సాహనీ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా, ఆ పదవిలో రెండేళ్ళు కొనసాగనున్నారు. అయితే ఇప్పటికే సలహాదారులు, వాళ్లకు ఇచ్చే లక్షల లక్షల జీతాల పై, విమర్శలు వస్తున్నా, ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయటం లేదు. తమకు అనుకూలం అనుకుంటే చాలు, పదవులు ఏమి లేకపోయినా, కొత్త పదవులు సృష్టించి మరీ, పదవులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే, తనకు ఎంతో నమ్మకస్తురాలుగా పేరు తెచ్చుకున్న, నీలం సాహనీకి, రిటైర్డ్ అయిన తరువాత కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

neelam 22032021 2

ఆమెకు మంచి పదవి ఇవ్వటం, జీతం ఇవ్వటంతో పాటుగా, క్యాబినెట్ ర్యాంక్ హోదా కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఆమె పని తీరు నచ్చి, రిటైర్డ్ వయసు అయిపోయినా కూడా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంతో మాట్లాడి, ఆరు నెలలు చీఫ్ సెక్రటరీ పదవి పొడిగించారు. కరోనా కాలంలో, ఆమె సేవలు రాష్ట్రానికి అవసరం అని, కేంద్రాన్ని ఒప్పించి, రెండు సార్లు, మూడు మూడు నెలలు పాటు, పొడిగింపు తెచ్చుకున్నారు. గతంలో ఎల్వీ శుభ్రమణ్యం వైఖరి నచ్చక ఆయన్ను అకారణంగా బదిలీ చేయటం, తరువాత నీలం సహానీ రావటం, ఆమె రిటైర్మెంట్ తరువాత కూడా, అధిక ప్రాధాన్యత ఇవ్వటం, జరిగిపోయాయి. 1984 బ్యాచ్ కు చెందిన నీలం సాహ్నీ, పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆమెకు ముఖ్యపదవి ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత, ఉన్న అనేక అంశాల పై, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, కేంద్రంతో సంప్రదింపులు జరిపి, విభజన సమస్యలతో పాటుగా, పునర్విభజన చట్టంలో ఉన్న వివిధ అంశాలు పరిష్కరించే బాధ్యత ఇచ్చారు. అయితే ఆమె జీత భత్యాల పై విమర్శలు వస్తున్నా, విభజన సమస్యలు పరిష్కరిస్తే అంత కంటే ఏమి కావాలి. చూద్దాం.

Advertisements

Latest Articles

Most Read