పెరిగినధరలతో పేద, మధ్యతరగతి వారు నానాఇబ్బందులు పడుతున్నారని, క-రో-నాప్రభావం, ప్రభుత్వనిర్లక్ష్యంతో పేదలు పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ వాపోయారు. శనివారం ఆయన మంగళగిరిలోనిపార్టీజాతీయ కార్యాలయంలో విలేకర్ల తో మాట్లాడారు. పండించిన పంటఉత్పత్తులకు రైతులకు గిట్టుబాటుధర అందడంలేదని, మరోవైపు ప్రజలకేమో ధరల పరంగా నిత్యావసరాలు అందుబాటులో లేకుండా పోయాయ న్నారు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివన్నట్లుగా పరిస్థితి తయారైందని, ముఖ్యమంత్రి వాస్తవాలకు దూరంగా వ్యవహ రిస్తూ కాలక్షేపంచేస్తున్నాడన్నారు. జగన్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక ఒక్కరోజుకూడా పెరిగినధరలపై సమీక్షచేయ లేదన్నారు. అప్పులు ఎలా తేవాలి.... ప్రతిపక్షాలను ఎలా బెదిరించాలనే వాటిపై మాత్రమే ముఖ్యమంత్రి సమీక్షలుచేస్తా డు తప్ప, పేదలకడుపునింపడం, సంపదసృష్టించి ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధిచేయాలనేదానిపై ఆయనఆలోచించడని రఫీ ఎద్దేవాచేశారు. ఒక్కరోజుకూడా ముఖ్యమంత్రి బహిరంగ మార్కెట్లను సందర్శించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న పాపానపోలేదన్నారు. చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన రైతుబజార్లను జగన్ తొలగించాడన్నారు. ముఖ్యమంత్రే ప్రజ లగురించి పట్టించుకోకుంటే, ఇకమంత్రులుకూడా తమతమ జిల్లాల్లో ఏనాడూ ప్రజలస్థితిగతులు, పెరిగినధరలపై ఆలోచన చేయడంలేదన్నారు. జగన్ ముఖ్యమంత్రయ్యాక నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, ఒక్కటంటేఒక్క పరిశ్రమకూడా రాష్ట్రానికి రాలేదన్నారు. దానికితోడు, ధరలుపెరగడంతో సామాన్యుల పరిస్థితి ముందునుయ్యి, వెనుకగొయ్యి చందం గా మారిందని రఫీ ఆవేదనవ్యక్తంచేశారు. రూ.5వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధిని ఏర్పాటుచేశానని, ధరలుపెరిగినప్పు డు, ఆసొమ్ముతో వాటిని నియంత్రిస్తానని అసెంబ్లీలో ముఖ్య మంత్రిచెప్పిన మాటలు ఏమయ్యాయని టీడీపీనేత ప్రశ్నించా రు.

review 20032021 2

రూ.5వేలకోట్లు ఏమయ్యాయో, అధికారులంతా బ్లాక్ మార్కెటింగ్ పై దృష్టిపెట్టి, ధరలను తగ్గించేచర్యలపై ఎందుకు దృష్టిపెట్టడంలేదన్నారు. రాష్ట్రమార్కెటింగ్ శాఖామంత్రి పేకాట ఆడించడంపై, ఇసుకతరలింపుపై, చంద్రబాబునాయుడిని దూషించడంపైనే శ్రద్ధపెట్టాడుతప్ప, తనశాఖపరిధిలో జరిగే విషయాలను పట్టించుకోవడంలేదన్నారు. సదరు మంత్రి ధ్యాసంతా అక్రమసంపాదనపైనేఉందన్నారు. ఎన్నికలప్రచార వేళ పెట్రోల్ సీసాలుచేతబట్టి, మనరాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలుఎక్కువగా ఉన్నాయని గగ్గలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాటిధర సెంచరీకిచేరువైనా ఎందుకుస్పందించడం లేదన్నారు? ఆనాడు పెట్రోల్ సీసాలు పట్టుకొని చంద్రబాబు ప్రభుత్వాన్నివిమర్శించిన వ్యక్తి, అధికారంలోకివచ్చాక ధరలు పెంచేసి ప్రజలను దారుణంగా దోచుకుంటున్నా డన్నారు. ఇసుక, మద్యంపై వచ్చేఆదాయమంతా ఎటు పోతుందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలన్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలుపెంచిన ముఖ్యమం త్రి, తాజాగాఇంటిపన్నును ఆస్తిపన్నుగా మార్చేసి, పేదలను పీల్చుకుతినడానికి సిద్ధమయ్యాడన్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే, దానిపై కేంద్రంతో ఒక్కరోజుకూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదన్నారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రం వేసే ట్యాక్స్ ను జగన్మోహన్ రెడ్డిఎందుకు తగ్గించడన్నారు.

ధరల కట్టడి లో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతా నికి పస్తులుంటే పండక్కి పరమాన్నంపెడతామన్నట్లుగా జగన్ ప్రభుత్వం పేదలవిషయంలో వ్యవహరిస్తోందని రఫీ మండిపడ్డారు. ప్రభుత్వవైఖరిని ప్రశ్నించేవారిని సెక్షన్లు, తప్పుడుకేసులతో అణగదొక్కుతున్న ముఖ్యమంత్రి పేదలు, మద్యతరగతి వారిగురించి కనీసమాత్రం కూడాఆలోచించడం లేదన్నారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యమే ధరలపెరుగుదలకు కారణమని టీడీపీనేత తేల్చిచెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో కేజీబియ్యం రూ.40 ఉంటే, ఇప్పుడు రూ.50కు పెరిగిందని, కేజీకందిపప్పు రూ.74నుంచి రూ.120కు, పెసరపప్పు రూ. 75 నుంచి రూ.107కు, మినపప్పు రూ.65నుంచి రూ.125 కు, వేరుశనగపప్పు రూ.80నుంచి రూ.140కు పెరిగాయ న్నారు. ప్రతిదానిధర వైసీపీప్రభుత్వంలో రెట్టింపు అయ్యిందని, ఆఖరికి వంటనూనెలు కూడా రెండింతలు పెరిగాయన్నారు. పెరిగినధరలతో ప్రతికుటుంబం నిత్యావస రాలనుకొనలేక అరకొరగాకొంటూ, అర్థాకలితోతింటూ బతుకు తోందన్నారు. పేదలకు కడుపునిండా తిండికూడా పెట్టలేని ప్రభుత్వం ఉంటేఎంత, పోతేఎంతని రఫీ ప్రశ్నించారు. మద్యం ధరలను విపరీతంగాపెంచిన వైసీపీప్రభుత్వం చీప్ లిక్కర్ కంటే దారుణమైనకల్తీమద్యాన్ని రూ.200లకు అమ్ముతోంద న్నారు. ఐరన్, సిమెంట్ ధరలను కూడా జగన్ రెడ్డి అమాంతం పెంచేశాడన్నారు. ఎవరుపెంచినా, ఏమి పెరిగినా పట్టించుకోకుండా ఉన్నది ఈప్రభుత్వం, ముఖ్యమంత్రేనని రఫీ తెలిపారు. ధరల పెరుగుదలపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకుంటే, ఆడవాళ్లంతారోడ్లపైకొచ్చి జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

బూతులమంత్రి, కళావర్ రాణి అయిన కొడాలినానీ ప్రెస్ మీట్ పెట్టేదే ప్రజలదృష్టి మళ్లించడానికని, విశాఖస్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా ముందుకెళుతున్న సమయంలో వారిసంకల్పాన్ని నిర్వీర్యంచేయడానికే బూతులమంత్రి మీడియాతో పిచ్చిపిచ్చిగా మాట్లాడాడని టీడీపీ అధికారప్రతినిధి పిల్లిమాణిక్యరావు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే " ముఖ్యమంత్రి, ఇతరమంత్రుల ఆలోచనలు చూస్తుంటే, జులాయి చిత్రంలో బిట్టూఅనేవిలన్ని తలపిస్తున్నాయి. ఆ సినిమాలో బిట్టూఅతనిగ్యాంగ్ లానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల ఆలోచనలు నేరపూరితంగా కొనసాగుతున్నాయి. కళావర్ రాణి అయిన కొడాలినానీ వింతజంతువు. దాన్ని కొట్టినా, తిట్టినా అది వినేజంతువుకాదు. దానిఖర్మన అది పోవాల్సిందే. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతంగా ముందుకెళు తున్నసమయంలో చంద్రబాబునాయుడిపై సీఐడీతో తప్పుడు కేసులుపెట్టారు. సీఐడీవిభాగం గతంలో ప్రభుత్వం చేతిలో ఎలా అభాసుపాలైందో తెలుసు. కమలాసన్ రెడ్డి, అలియాస్ పిచ్చిరెడ్డితో తప్పుడుకేసుపెట్టించి, సీఐడీతో నోటిసులిచ్చా రు. దానిపైకోర్టు పిచ్చిపిచ్చిప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. విశాఖ ఉద్యమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కార్మికులునిర్ణయించా రు. ఆసభ విజయవంతం కాకూడదనే, బూతులమంత్రి కొడా లినానీతో ప్రభుత్వం బూతులు తిట్టించింది. పనికిమాలిన, వెధవభాష మాట్లాడే కొడాలిని తిరిగిమాటనడం ఎంతోసేపు పట్టదు. అతనికంటే వెధవ, పోరంబోకు, అక్షరజ్ఞానంలేని వాడు మరొకడు ఉండడు. లోకేశ్ ను పప్పు అనే పిరికివెధవ, ఆయన విజ్ఞానం గురించి తెలుసుకుంటే మంచిది. విదేశాలకువెళ్లి చదువుకున్న వ్యక్తి గురించి, ఏబీసీడీలుకూడా రాని వెధవ మాట్లాడుతున్నాడు. అజ్ఞాని, పనికిమాలినవెధవైన కొడాలినానీకి స్టాన్ ఫోర్డ్ యూ నివర్శిటీకి లేఖరాసేజ్ఞానముందా? ఏమని లేఖ రాస్తాడు. లెటర్ రాయడానికి కూడా నానీకి మరొకరు కావాలి. ఇంగ్లీష్ లో తనపేరు రాయలేని నానీ, స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖరాస్తాడా? లోకేశ్ అనేవ్యక్తి ఎవరికీ ప్రమాదంలేదు. నిరం తరం రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించడం తప్ప, మీకుమాది రి దోపిడీఆలోచనలు, దుర్మార్గపు కుట్రలు చేయడం ఆయన కు తెలియదు.

నిజమైన గన్నేరుపప్పు మీరు. మీవిష పూరి తఆలోచనలు రాష్ట్రాన్ని నాశనంచేస్తున్నాయి. గన్నేరుపప్పు సీఎంవల్ల ఇప్పటికే రాష్ట్రం చంకనాకిపోయింది. మంత్రులు, అధికారపార్టీఎమ్మెల్యేలు ఆగన్నేరు పప్పు కొంచెంకొంచెం తిని వారుకూడా విషపూరితంగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడా? తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచేలా ఏనాడైనా ఆయన వ్యవహరించాడా? తల్లిదండ్రుల ప్రతిష్టను పెంచేలా ఆలోచించేది లోకేశ్ ఒక్కడే. రాజశేఖర్ రెడ్డి 30ఏళ్లపాటు ఒకేపార్టీని నమ్ముకున్నాడు. తనపార్టీకోసం సైనికుడిలా పనిచేశాడు. ముఖ్యమంత్రయ్యాక ప్రజలకోసం కొన్ని పథకాలు అమలుచేశాడు. అలాంటి తండ్రి పోగానే ముఖ్యమంత్రి పీఠంపై జగన్ కు ఆశకలిగింది. వెంటనే తండ్రి రక్తపుముద్దలతో బేరాలుసాగించాడు. వైఎస్సార్ సీపీ అనే పార్టీని జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? అసలు ఆపార్టీ వ్యవస్థాపకు లు ఎవరు? ఆపార్టీ సిద్ధాంతాలేమిటో జగన్ కు తెలుసా? వరంగల్ కు చెందిన శివకుమార్ అనేవ్యక్తి వైఎస్ మీదున్న అభిమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపెడితే, దాన్ని అతని నుంచి దొంగిలించలేదా? ఎవరికో పుట్టిన బిడ్డను, మాబిడ్డ. ..మాబిడ్డ అని ముద్దాడేది ఇప్పుడున్న వైసీపీనేతలు కారా? చంద్రబాబునాయుడుగారు ఎన్టీఆర్ కు నిజమైన వారసులు. అత్యంతపవిత్రురాలు, పతివ్రత అయిన లక్ష్మీపార్వతి ఇప్పు డు మీదగ్గరే ఉంది. ఆమెనుంచి తెలుగుదేశం పార్టీనికాపాడుకోవడానికి ఆనాడు చంద్రబాబు ధైర్యంగా ముం దడుగువేశారు. అటువంటి ధీశాలిని, దిక్కుమాలిన జగన్మో హన్ రెడ్డితో పోలుస్తారా? ఆయన కొడాలినానీకి పదవి ఇచ్చా డు. అందుకే మితిమీరిన కృతజ్ఞతచూపుతున్నాడు. దాన్ని మేం తప్పుపట్టం. రాజధానిలో పంటలు తగలబెట్టినవారికి, తనకు ఫిజియోథెరపీచేసినవారికి పదవులివ్వడం అనేది జగన్ కు అలవాటేకదా? అదేగా మీనాయకుడి వారసత్వం.

జగన్ తల్లి విజయమ్మ విశాఖపట్నంలో ఎందుకు ఓడిపోయిదో చెప్పండి, తరువాత లోకేశ్ ఓటమిగురించి మా ట్లాడుదురుగానీ. తల్లిని, చెల్లినీ చెల్లనిచీటీలుగా మార్చేసిన జగన్ రెడ్డి గొప్పలగురించి కళావర్ రాణి నానీ చెప్పడం విచిత్రం. ఆయనకు అంత అభిమానముంటే జగన్ రెడ్డికి చిడ తలుకొట్టుకోమనండి. అంతేగానీ విశాఖ ఉక్కుఉద్యమాన్ని ఎందుకు తెరపైకి తెస్తాడు? షర్మిల హైదరాబాద్ కు వెళ్లి, తనకు అవకాశం ఇవ్వమని అడగడానికి జగన్మోహన్ రెడ్డి కారకుడుకాడా? అటువంటి వ్యక్తి ఎదుటివారి గురించి మాట్లా డతాడా? జగన్ జైలుకెళ్లాడు కాబట్టే, వైసీపీవారికి జైలు ఆలోచనలు వస్తున్నాయి. ఆయన చిప్పకూడు తిన్నాడు కాబట్టే, అందరూ తినాలనుకుంటున్నాడు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, సీఐడీ ఉన్నాయా? ఉంటే దళితులకు శిరోముండ నాలుజరిగినప్పుడు, వారిపై హత్యలు, అత్యాచారాలు జరిగి నప్పుడు ఏంచేశారు? వైసీపీవారిని ఎందుకు జైల్లో పెట్టలేదు ? దళిత జడ్జీని, లాయర్ ని పిచ్చివాళ్లనుచేసినప్పుడు పోలీ సులంతా ఏమయ్యారు? ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు కొడాలినానీ దగ్గాడు. అతని ప్రెస్ మీట్ కు వెళ్లినవారంతా కరోనా టెస్ట్ లు చేయించుకోండి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటున్నారు. ఎలా గెలిచారో చెప్పండి. నేరస్తులు, గాలివాళ్లతో మాకెందుకని ప్రజలు భయ పడి ఓట్లేశారు. దానికే ఓపూనకం వచ్చినట్లు ఊగిపోకండి. ఎమ్మెల్యేలు, మంత్రులు, వాలంటీర్లు అందరూ పింఛన్లు తీసేస్తామని, రేషన్ కార్డులు తొలగిస్తామని బెదిరించింది నిజంకాదా? అరాచకత్వానికి ప్రజాస్వామ్యమనే ముసుగేసి గెలిచిన గెలుపుకూడా ఒకగెలుపేనా? 2019 ఎన్నికలకు ముందు ప్రజలను జగన్మోహన్ రెడ్డి బతిమాలాడాడు. ఇప్పుడు స్థానికఎన్నికల్లో బెదిరించాడు. భవిష్యత్ లో చూడా లి జనం సంగతి ... ఎలా ఉంటుందో.

తండ్రిని అవమానపరిచి, ఆ తండ్రికి వారసుడినని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. తిరుప తి ఉపఎన్నికలో ఏంచేస్తారో చూడాలి. ఇప్పుడున్న వైసీపీ ఎంపీలు ఏంచేస్తున్నారో చెప్పండి. కొడాలినానీ తనతల్లిపై ప్రమాణంచేసి చెప్పాలి. 25కు 25మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా, రైల్వేజోన్ తెస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నాడో లేదో చెప్పాలి. అసలు వింతజంతువు ఎలా ప్రమాణంచేస్తుంది? అరాచకాన్ని అడ్డుపెట్టుకొని, బెదిరింపులు, దౌర్జన్యంతో గెలవ గలరు తప్ప, ప్రజలను మెప్పించి, వారిఓట్లతో మీరు గెలవలే రు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. బూతులు తిట్టడం మాకువచ్చు. మేం కొడాలినానీ లాగా బూతులకు పుట్టలేదు. అతనికి తల్లిదండ్రులు ఉండేఉంటారు. కానీ కొడాలినానీ తల్లి దండ్రులగురించి ఎవరూ చెప్పుకోవడం లేదు. వారుకూడా తలదించుకునేలా నానీ భాషఉంటుంది. ఇకనుంచి నానీ మాట్లాడేటప్పుడు అతని తల్లిదండ్రులను తలుచుకొని మాట్లా డితే మంచిది. నానీ తల్లి బూతులు కాదు, తండ్రి బూతులు కాడు. కానీ అతను మాత్రం బూతులకు ప్రతినిధిలా మారాడు . విశాఖపట్నంలో జరుగుతున్న బహిరంగ సభ పూర్తయ్యే లోగా, వైసీపీఎంపీలు ప్రధానిమోదీతో విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవే టీకరణనువెనక్కుతీసుకున్నామని చెప్పించగలరా? వారంతా నిజంగా మగాళ్లయితే, ఆపనిచేసిచూపాలి. అలాంటి పనిచేస్తే, అదీ మగతనం. అంతేగానీ బూతులు మాట్లాడటం మగతనం కాదని నానీ తెలుసుకోవాలి. వైసీపీప్రభుత్వానికి, ఆపార్టీఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకునిజంగా మగతనం ఉంటే, ప్రజలకోసం రాష్ట్రంకోసం పనిచేయండి. టీడీపీఎంపీలు ఎలా మాట్లాడుతున్నారో చూసి నేర్చుకోండి. వైసీపీఎంపీల కు బూతులు, తప్పుడుకేసులు పెట్టడంతప్పఏమైనా తెలుసా ? విశాఖ బహిరంగసభనుంచి ప్రజలదృష్టిని మళ్లించడానికే బూతులమంత్రి చంద్రబాబునాయుడిని, లోకేశ్ ని లక్ష్యంగా చేసుకున్నాడు.

తిరుపతిలో జడ్జి రామకృష్ణ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గతంలో జడ్జి రామకృష్ణ హైకోర్టులో ఒక కీలక పిటీషన్ వేసారు. ఒక మాజీ హైకోర్టు జడ్జి, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కాబోయే మరో జడ్జి పై కుట్ర పన్నారని, దీని వెనుక ప్రభుత్వం హస్తం ఉంది అంటూ, ఆయన హైకోర్టులో పిటీషన్ వేసారు. దీని పై సిబిఐ ఎంక్వయిరీ కూడా ఆదేశించారు. అయితే ఈ కేసు ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో, ఇప్పుడు ఈ కేసులో అదిరిపోయే ట్విస్ట్ నెలకొంది. ఈ దెబ్బతో, ప్రభుత్వానికి భవిష్యత్తులో, కోర్టు చేతిలో చీవాట్లు తప్పవని కూడా విశ్లేషిస్తున్నారు. జడ్జి రామకృష్ణను ఒక కేసులో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసారు. అయితే అరెస్ట్ చేసిన సమయంలో, ఆయన ఐ ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ వ్యవహారం పై, పోలీసులు జడ్జి రామకృష్ణ కు షాకింగ్ న్యూస్ చెప్పారు. తమ పరిధిలో ఉన్న ఫోన్, చోరీకి గురయ్యింది అంటూ, షాకింగ్ న్యూస్ చెప్పారు. స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫోన్ దొంగలించారని, చెప్పారు. అయితే పోలీసులు చేసిన వ్యాఖ్యల పై, రామకృష్ణ షాక్ తిన్నారు. ఇదంతా పోలీసులు ఆడుతున్న కట్టు కధ అని తేల్చి చెప్పారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటూ, తనను అన్ని రకాలుగా వేధిస్తున్న మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసారు. ప్రభుత్వం, పోలీసులను వాడుకుని, ఎలా అడ్డగోలుగా ప్రవర్తిస్తుందో ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన వాపోయారు. తన ఫోన్ లో అతి విలువైన సమాచారం ఉందని అన్నారు.

rk 20032021 2

అందులో ఆధారాలు ఉన్నాయని, పోలీసులు దాన్ని కోర్టులో డిపాజిట్ చేయకుండా, ఆ ఫోన్ ని మంత్రి పెద్దిరెడ్డికి ఇచ్చారని, తద్వారా అది సజ్జల వద్దకు వచ్చిందని అన్నారు. తన ఫోన్ ని ఇవ్వాలని కోర్టులో పిటీషన్ వేస్తే, ఫోన్ ఇచ్చేయాలని కోర్టు పోలీసులకు నోటీసులు ఇవ్వగా, 90 రోజులు అయినా ఇంకా ఫోన్ ని కోర్టులో డిపాజిట్ చేయలేదని. మూడు రోజులు క్రితం పోలీసులు ఈ విషయం పై కోర్టులో మేమో దాఖలు చేస్తూ, తమ కస్టడీలో ఉన్న ఫోన్ ని, ఎవరో దొంగలు దొంగతనం చేసారని ఆ మేమోలో పేర్కొన్నారని తెలిపారు. కేసుకు సంబందించిన అతి ముఖ్యమైన సమాచారం అందులో ఉందని, న్యాయమూర్తులను ప్రభావితం చేసే అంశం పై, అనేక అధారాలు అందులో ఉన్నాయని, కుట్ర పూరితంగా ఫోన్ లాక్కుని, ఇప్పుడు ఫోన్ పోయిందని చెప్పటం, తీవ్ర అంశం అని అంటున్నారు. ఇందులోనే ఈశ్వరయ్య ఫోన్ సంభాషణలు ఉన్నాయని, ఇంత పెద్ద కేసుని తప్పుదోవ పట్టించటానికి, ఈ డ్రామాలు అన్నీ ఆడుతున్నారని, దీని పై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.

సహజంగా పార్లమెంట్ లో వేసే ప్రశ్నలు, తమ పార్టీకి లాభం చేకురేలా, లేదా తమ ప్రభుత్వానికి లాభం చేకురేలా , సభ్యులు ప్రశ్నకు వేస్తూ ఉంటారు. కేంద్రం చెప్పే జవాబుని, తమ గోప్పతనంగా చెప్పుకోవాటానికి, తద్వారా ప్రజలకు గోప్పాగా చెప్పుకుంటారు. ఈ ప్రశ్నలు వేసే క్రమం కూడా, తమ అధినేత ద్రుష్టిలో పడటానికి, మార్కులు కొట్టేయటానికి కూడా వేస్తూ ఉంటారు. దీనికి వైసిపీ ఎంపీలు ముందు ఉంటారు. అయితే వారికి మాత్రం, ఇది రివర్స్ అవుతుంది. ఏదైనా ప్రశ్న వేస్తె, కేంద్రం చెప్పే జవాబు డబ్బా కొట్టుకుందాం అంటే, అక్కడ నుంచి వచ్చే జవాబు మొత్తం రివర్స్ లో వస్తుంది. ఒకటి రెండు కాదు, ఈ మధ్య తరుచూ ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు వైసీపీ ఎంపీలు. సరిగ్గా మునిసిపల్ ఎన్నికలు ఒక్కరోజు ముందు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై వాళ్ళు వేసిన ప్రశ్నకి, మొత్తం వైసీపీ ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నాం, వారికి అంతా తెలుసు అంటూ, కేంద్రం చెప్పిన సమాధానంతో బొక్క బోర్లా పడ్డారు. విశాఖ మునిసిపల్ ఎన్నికల్లో చాలా తేలికగా గెలిచేస్తాం అని చెప్పిన వైసీపీ వర్గాలు, ఆ ప్రశ్నతో, మొత్తం తారు మారు అయ్యిందని, చాలా అతి కష్టం మీద బయట పడినట్టు చెప్తూ ఉంటారు. దీంతో చీవాట్లు తిన్నారు. అలాగే నిన్న కూడా, ఇలాంటి ప్రశ్నలతోనే వైసీపీ ఎంపీలు బొక్క బోర్లా పడి, తమ అసమర్ధత గురించి తామే అడిగారు.

piyush 20032021 2

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్ ల గురించి, విజయసాయి రెడ్డి ప్రశ్న వేసారు. ఇది కూడా జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలేలా కేంద్ర మంత్రి నుంచి సమాధానం వచ్చింది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్ లు ఎలా నడుస్తున్నాయి, ఎప్పటికి పూర్తవుతాయి అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్న వేసారు. దీనికి కేంద్ర రైల్వే శాఖా మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చే నిధులు ఇవ్వటం లేదని, కనీసం భూసేకరణ కూడా చేపట్టటం లేదు అంటూ, కేంద్ర రైల్వే శాఖా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 వేల కోట్లు విలువైన పనులు నిలిచిపోయాయని చెప్పారు. నిధులు కొరతతోనే కడపలోనే రైల్వే పనులు ఆగిపోయాయని చెప్పారు. సాక్షాత్తు జగన్ సొంత జిల్లాలో కూడా, ఏపి ప్రభుత్వం సహకరించటం లేదు అంటూ, మెసేజ్ ఇచ్చారు. అయితే దీని పై విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్రం ఇంత స్పష్టంగా చెప్తుంటే, రాష్ట్ర వాటా ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నాయి. అడిగి తిట్టించుకోవటం అంటే ఇదే అని వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read