ఆంధ్రప్రదేశ్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం, మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ ను, కొద్ది సేపటి క్రితం, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 5 వ తేదీ నిర్వహిస్తామని చెప్పారు. మొత్తం 13 జిల్లాల్లో, ఒక్కో డివిజన్ చొప్పున, ఆ డివిజన్ లో ఉన్న మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే సోమవారం సుప్రీం కోర్టులో పిటీషన్ విచారణకు వస్తుందని, అప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వవద్దు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని రమేష్ కుమార్ తిరస్కరించారు. ప్రభుత్వ విజ్ఞప్తి సహేతుకంగా లేవని అన్నారు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళు అంతా వ్రుత్తి పరంగా, వ్యక్తిగతంగా తనతో సన్నిహితంగా ఉన్నారని, ఎన్నికల విధులను నిర్వహించటానికి, అందరికీ కులుపుకుని వెళ్తానని తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు, 2020 కు సంబందించిన ఎన్నికల జాబితా ఈ రోజు వరకు జిల్లాల్లో ప్రకటించలేదని, రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు కూడా దిక్కరించారని, దీని వల్ల రాష్ట్రంలో మూడు లక్షల మంది కొత్త ఓటర్లు, ఎన్నికల్లో పాల్గునే అవకాసం లేకుండా పోయిందని అన్నారు. దీంతో తాపు 2019 ఎన్నికల జబితీ పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టులో కూడా, ఎన్నికల కమిషన్ తరుపున వాదన వినిపిస్తామని తెలిపారు.

ec 23012021 2

రాష్ట్ర ప్రభుత్వంలో కొంత మంది అధికారులు కానీ, కొంత మంది ఉద్యోగులు కానీ మిశ్రమంగా స్పందిస్తున్నారని, ఎక్కడైతే సహాయ నిరాకరణ ఉందో, ఆ విషయాలు అన్నీ గవర్నర్ వద్దకు తీసుకుని వెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ఇది రాజ్యంగ హక్కు అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలని, ఆయన తెలిపారు. ఇక ఉద్యోగ సంఘాలు ఏదైతే తాము ఎన్నికలు నిర్వహణలో ఉండలేం అని చెప్తున్నారో, దానికి సంబంధించి కూడా ఆయన స్పందించారు. దేశంలో ఇప్పటికే అనేక ఎన్నికలు జరిగాయని, ఆ లిస్టు అంతా చదివారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేం అంటూ ఉద్యోగులు చెప్తున్న కారణం సహేతుకంగా లేదని, వారి విజ్ఞప్తి తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఇక ఇది ఎన్నికల షెడ్యుల్, 25: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ, 27: నామినేషన్ల దాఖలుకు తుది గడువు, 28: నామినేషన్ల పరిశీలన, 29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన, 30: ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం, 31: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు, ఫిబ్రవరి 5: పోలింగ్‌ తేదీ, పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2019 ఎన్నికలు అయిన తరువాత, ఒక కొత్త రాజకీయ పొత్తు పొడిచింది. 2014లో బీజేపీ, తెలుగుదేశంతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన, 2018 నుంచి కమ్యూనిస్ట్ లతో కలిసింది. ఎన్నికలు అవ్వగానే, మళ్ళీ బీజేపీ వద్దకు పవన్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, ఢిల్లీ వెళ్లి చర్చించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసి పని చేసేలా ప్రణాళికలు రచించారు. అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో, పొత్తు బాగానే నడిచింది. అమరావతిలో కలిసి ఉద్యమం చేసే దాకా వెళ్ళారు, అయితే తరువాత సోము వీర్రాజు బీజేపీ ఏపి అధ్యక్ష్యుడు అవ్వటం, విష్ణు వర్ధన్ రెడ్డికి కూడా కీలక పదవి రావటంతో, ఏపి బీజేపీ, వైసీపీ బ్రాంచ్ అన్నట్టు తయారు అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం, అన్నీ ఓర్చుకుంటూ, తన పని తాను చేసుకుంటూ, అవసరం అయిన ప్రతి సారి బీజేపీకి గౌరవం ఇస్తూనే వస్తున్నారు. అయితే బీజేపీ వైపు నుంచి మాత్రం, జనసేన పార్టీ పై అంత గౌరవం లేదా అనే సంకేతాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసి ఎన్నికల్లో, బీజేపీ తమను అసలు లెక్క చేయక పోవటంతో, జనసేన సొంతగా జాబితా ప్రకటించింది. అయితే బీజేపీ కేంద్ర పెద్దలు రంగంలోకి దిగి, పవన్ ను బుజ్జగించటం, అలాగే తిరుపతి సీటు పై హామీ ఇవ్వటంతో, పవన్ విరమించుకున్నారు. అయినా తెలంగాణా బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ ను అవమానించారు. అయినా పవన్ ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. ఇక తిరుపతి ఉప ఎన్నిక పై, వేడి మొదలైంది. మరో రెండు నెలల్లో ఎన్నిక వచ్చే అవకాసం ఉంది.

pk23012021 2

దీంతో పవన్ కళ్యాణ్, తిరుపతి సీటు పొత్తులో భాగంగా తమకే వస్తుందని భావిస్తున్నారు. నిన్న తిరుపతిలో పర్యటించిన పవన్, తిరుపతి ఎన్నిక పై మాట్లాడుతూ, ఏపి బీజేపీ నేతల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఉప ఎన్నిక, తమ పార్టీనే పోటీ చేయాలని, తమ పార్టీకే ఇక్కడ బలం ఉందని, జనసేన కార్యకర్తలు అంటున్నారని పవన్ అన్నారు. కేంద్రంలో బీజేపీ నాయకులు, తమకు ఇస్తున్న గౌరవం, రాష్ట్రంలో బీజేపీ నేతలు తమకు ఇవ్వటం లేదు అనే అభిప్రాయం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీని పై తమకు అసంతృప్తి ఉన్నా, ఒక ప్రయాణంలో ఉన్నాం కాబట్టి, ఇలాంటి చిన్న చిన్నవి పట్టించుకోవటం లేదని, దీని పై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయగా, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతల్లో మార్పు కనిపిస్తుందని అన్నారు. అలాగే తిరుపతి ఉప ఎన్నిక, తమకు టిక్కెట్ ఇస్తే, తాను స్వయంగా ప్రచారానికి తిరుగుతా అని, బీజేపీ ఏ మేరకు సపోర్ట్ ఇస్తుందో వారు చెప్తారని అన్నారు. అలాగే ఒక వేళ బీజేపీ సీటు తీసుకుంటే, జీహెచ్ఏంసి ఎంత సీరియస్ గా చేసారో, అంత సీరియస్ గా బీజేపీ తీసుకుని, కేంద్ర నాయకులను రప్పించి, అంత గట్టిగా చేస్తాను అంటే, తాము కూడా మద్దతు ఇస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సీటు ఎవరు పోటీ చేయాలి అనే దాని పై, మరో వారం రోజుల్లో నిర్ణయం చెప్తాం అని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల వేడి, ఆంధ్రప్రదేశ్ లో తారా స్థాయికి చేరింది. గంట గంటకు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్ రమేష్ కుమార్ ,ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. మరో పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు బ్రేక్ వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సమయంలో, ఈ రోజు ఎలా అయినా ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయంత్నం చేసింది. ఉదయం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ లో తప్పులు తడకలు ఉండటంతో, ఈ రోజు పిటీషన్ విచారణకు రాకుండా పోయింది. మళ్ళీ సోమవారం వరకు కుదరదు అని తెలియటంతో, ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు కలిసి హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసాయి. ఈ పిటీషన్ వెంటనే విచారణ చేయాలి, సుప్రీం కోర్టుని కోరాయి. అయితే సుప్రీం కోర్టు మాత్రం, హౌస్ మోషన్ పిటీషన్ ను తిరస్కరించింది. సోమవారం ఈ పిటీషన్ పై విచారణ చేస్తామని చెప్పింది. అయితే ఇప్పటికే ఎన్నికల కమీషనర్ ఈ విషయంలో కేవియట్ పిటీషన్ దాఖలు చేసారు కాబట్టి, సోమవారం విచారణ సందర్భంగా, ఎన్నికల కమిషన్ కు నోటీస్ ఇచ్చి, మళ్ళీ వాయిదా వేస్తారు. ఆ రోజు ఎలాంటి స్టే కానీ, ఏమి ప్రకటించే అవకాసం ఉంది. మళ్ళీ ఒక రోజో, రెండో రోజు కానీ పుర్తిగా విచారణ చేయరు.

sc 220120021 2

ఇక ఈ లోపు రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్న నేపధ్యంలో, ఎన్నికల ప్రక్రియ మొదలు అయిపోతుంది. సుప్రీం కోర్టు గత తీర్పులు కానీ, ఇతర రాజ్యాంగ పరమైన విషయాలు కానీ చూస్తే, ఇప్పటి వరకు కోర్టులు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. దీంతో, ప్రభుత్వానికి ఉన్న చిట్ట చివరి అవకాసం అయిన హౌస్ మోషన్ పిటీషన్ కూడా , ఈ రోజు దారులు మూసుకుపోయాయి. ప్రభుత్వం మాత్రం, ఇప్పటికీ మేము సిద్దంగా లేము అంటూ ఎన్నికల కమిషన్ కు ఉత్తరాలు రాస్తుంది. ఒక పక్క హైకోర్టు చెప్పిన తరువాత కూడా, మేము ఎన్నికలకు సిద్ధంగా లేమని, తేల్చి చెప్తున్నారు. ఉద్యోగుల చేత కూడా ఇదే చెప్పిస్తున్నారు. మరి రాష్ట్ర ఎన్నికల కమీషనర్, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. హైకోర్టు చెప్పినా, రాజ్యాంగంలో ఉన్న, ప్రభుత్వం మాత్రం, ఏ మాత్రం లెక్క చేయటం లేదు. రేపు సుప్రీం కోర్టు చెప్పినా, ఎన్నికల విషయంలో భయపడుతున్న ప్రభుత్వం, ముందుకు వెళ్ళేలా లేదు. ఇక తరువాత అడుగుగా గవర్నర్ జోక్యం చేసుకోవాలి, తరువాత రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి. పరిస్థితి అక్కడి దాకా వెళ్తుందా ? ఏమి అవుతుంది ? చూడాలి మరి.

ఒక విజన్ తో రాజకీయ నాయకులు పని చేస్తే, తరతరాలు ఆ ఫలాలు ఎలా పని చేస్తాయి అని చెప్పటానికి ఉదాహరణ, నారా చంద్రబాబు నాయుడు. కాకపొతే మన తెలుగు రాష్ట్రాల్లో, ఆయన్ను ఒక ప్రాంతం వాడిగా, ఒక కులం వాడిగా ముద్ర వేయటంలో, ప్రత్యర్ధులు విజయం సాధించటం, ఆ విష ప్రచారం చంద్రబాబు సమర్ధవంతంగా తిప్పి కొట్టక పోవటంతో, ఆయన ఎన్నికల సంగ్రామంలో పలు మార్లు ఓడిపోయారు. అయినా ఒక దార్శనికుడుగా ఆయన చేసిన పనులు తరతరాలు అనుభవిస్తూనే ఉన్నాయి. "What Chandrababu Naidu thinks today, India Thinks Tomorrow" అంటూ గతంలో ఇండియా టుడే, టైం నౌ లాంటి జాతీయ చానల్స్ లో చంద్రబాబు గురించి చెప్తూ ఉండేవారు. అది ప్రత్యర్ధులకు అతి అనిపించినా, అదే నిజం. దానికి వంద ఉదాహరణలు చెప్పవచ్చు. తాజాగా 20 ఏళ్ళ నాడు చంద్రబాబు విజన్ తో మొదలు పెట్టిన ఇంటర్నేషన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ), నేడు 20 వసంతాలు పూర్తి చేసుకోవటంతో, చంద్రబాబు ఉన్న ఫోటోని గుర్తు చేస్తూ, ఒక ట్వీట్ వేసారు. అందులో వాళ్ళు రాసింది, "Business visionaries who thought ahead of their time and piloted the ISB project.". ఆ ఫోటోలో హేమాహేమీలు ఉన్నారు. చంద్రబాబు, అప్పటి ప్రధాని వాజ్‌పేయి, అప్పటి రాష్ట్ర గవర్నర్ సీ రంగరాజన్ ఉన్నారు.

isb 22012021 2

వీరితో పాటు, ఆనంద్ మహీంద్రా, అనిల్ అంబానీ లాంటి పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. 20 ఏళ్ళ నాడు తాము ఎలా మొదలైంది, ఇంటర్నేషన్ బిజినెస్ స్కూల్ ట్వీట్ చేసింది. ఐఎస్‌బీ లాంటి అత్యున్నతమైన సంస్థ హైదరాబాద్ లో రావటానికి, నాడు చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఇండియాలోని దిగ్గజ బిజినెస్ సంస్థలు అంతా కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేయాలని, ఆనాడు ఢిల్లీ, ముంబై, బెంగళూర్ లాంటి మెట్రో నగరాలను పరిగణనలోకి తీసుకుంటున్న పారిశ్రామిక కోర్ కమిటీ వారిని, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అప్రోచ్ అయ్యి, వారిని కాఫీకి పిలిచి మెప్పించి, ఇలాంటి దిగ్గజ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేలా చేయగలిగినారు. ఈ ఫోటో ఐఎస్‌బీ ట్వీట్ చేయగానే, చంద్రబాబు దాన్ని రీట్వీట్ చేస్తూ, గతాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో అత్యున్నత సంస్థ ఏర్పాటు చేయాలని అనుకున్న ఫలితమే ఐఎస్‌బీ అని గుర్తు చేసారు. అయితే ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చంద్రబాబు ఏమి చేసారో తెలియని బొడ్డూడని పిల్లకాయలు కూడా ఆయన్ను కుల ద్వేషంతో విమర్శిస్తారు కానీ, అయన చేసిన పనులు మాత్రం, వీళ్ళను వెక్కిరిస్తూనే ఉంటాయి. ఎందుకంటే అవి చరిత్రపుటల్లో శాస్వతంగా చెరిపేయలేని గుర్తులుగా నిలిచేవుంటాయి.

Advertisements

Latest Articles

Most Read