ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు కృష్ణా జిల్లా పరిటాలలో ప్రజల మధ్య భోగి వేడుకులు జరుపుకున్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు, ఇప్పటికీ ధాన్యం డబ్బులు ప్రభుత్వం జమ చేయకపోవటం, రైతులకు చేస్తున్న అనేక మోసాలకు వ్యతిరేకంగా, ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిన రైతు వ్యతిరేక జీవోలను చంద్రబాబు భోగి మంటల్లో వేసి తగలుబెట్టారు. ఉదయం 5 గంటలకే చంద్రబాబు భోగి వేడుకల్లో పాల్గున్నారు. తరువాత ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్బంగా చంద్రబాబు కొంత భావోద్వేగానికి గురయ్యారు. "నాకంటే గొప్పగా చేస్తాడని, ఒక్క చాన్స్ ఒక్క చాన్స్ అన్నాడని, పూనకం వచ్చినట్టు అతనికి ఓట్లు వేసి, ఇబ్బందులు పడుతున్నారు. నేనేమి తప్పు చేసానో, ఎందుకు ఓడిపోయానో ఇప్పటికీ తెలియటం లేదు. ప్రజలు సంతోషంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేయాలని అనుక్షణం తపించాను. అదే నేను చేసిన తప్పు అయితే, క్షమించండి" అంటూ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. తాను ప్రజలు జీవితాలు మారాలని, అనుక్షణం అనుకుని పని చేసి, అన్నీ చేసి పెడుతూ వెళ్లానని, నేను చేసిన తప్పు అదేనేమో అని చంద్రబాబు అన్నారు.
news
క్రిస్టియన్ సెల్ అంటూ ఉదయం నుంచి చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టిన టిడిపి...
ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రాజీనామా చేసారు అంటూ, బులుగు మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ తిప్పి కొట్టింది. తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని నేనే అంటూ, యలమంచలి ప్రవీణ్ అనే వ్యక్తి ఉదయం నుంచి టీవీల్లో చేస్తున్న హడావిడి పై స్పందిస్తూ, ప్రవీణ్ అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు , మద్దిరాల మ్యానీ ప్రకటన విడుదల చేసారు. ప్రవీణ్ అనే వ్యక్తికి అసలు పార్టీతో సంబంధమే లేదని, పరోక్షంగా కూడా పార్టీకి అతనికి లింక్ లేదని తేల్చి చెప్పారు. అసలు ప్రవీణ్ అనే వ్యక్తికీ సభ్యత్వం కూడా లేదని అన్నారు. దీని వెనుక వైసీపీ పార్టీ కుట్ర ఉందని, కావాలని ఇలా చేస్తున్నారని అన్నారు. మరోసారి ప్రవీణ్ ఇలా ప్రచారం చేసినా, టిడిపి ఫోటోలు వాడినా, అతని పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక పోతే, అసలు చంద్రబాబు ఎక్కడా క్రీస్టియన్ లను ఒక్క మాట అనలేదని, జగన్ మోహన్ రెడ్డి వైఖరిని మాత్రమే ప్రశ్నించారని గుర్తు చేసారు. ప్రవీణ్ అనే వ్యక్తి జూపూడికి దగ్గర వారని, జూపూడితో పాటే అతను వెళ్లిపోయాడని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అతనికి పార్టీకి సంబంధం లేదని, ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు.
మరో సంచలన నిర్ణయం తీసుకున్న నిమ్మగడ్డ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న జాయింట్ డైరెక్టర్ ను ఎన్నికల కమిషన్ తొలగించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్ సెక్రటరీగా ఉన్న వాణీమోహన్ ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగించారు. వాణీమోహన్ సేవలు ప్రస్తుతం ఎన్నికల కమిషన్ లో అవసరం లేదని, అందుకే ఆమెను తొలగిస్తున్నామని నిమ్మగడ్డ తెలిపారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్ కు వివరాలు తెలుపుతూ లేఖ రాసారు. వాణీమోహన్‌ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆమెను రిలీవ్ చేస్తూ ప్రభుత్వానికి కూడా తెలిపారు. నిన్న జాయింట్ డైరెక్టర్ ముందస్తు సమాచారం లేకుండా సెలవు పై వెళ్ళటం, మిగతా ఉద్యోగులను కూడా సెలవు పెట్టాలని ఒత్తిడి చేయటంతో, అయన్ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అయితే ఈ రోజు ఏకంగా ఎన్నికల కమిషన్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారిని కూడా తప్పించటం సంచలనంగా మారింది. అయితే ఆమెను కేవలం సేవలు అవసరం లేదనే రిలీవ్ చేసారని చెప్తున్నా, దీని వెనుక ఇంకా ఏదో ఉండే ఉంటుందని అంటున్నారు. మరికొద్ది సేపట్లోనే, హైకోర్టు డివిజిన్ బెంచ్ లో, నిన్న సింగల్ బెంచ్ ఎన్నికల్ షెడ్యుల్ సస్పెండ్ చేస్తూ ఇచ్చిన తీర్పు పై, వాదనలు విననున్నారు.
ఎన్నికల కమిషన్ పిటీషన్ పై, మరో 5 రోజులు కొనసాగనున్న సస్పెన్స్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్, నిన్న హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై, నిన్నే హైకోర్ట్ డివిజన్ బెంచ్ లో అపీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయమే ఈ పిటీషన్ పై విచారణ జరగాల్సి ఉండగా, పిటీషన్ ను ఈ రోజు మధ్యానానికి వాయిదా వేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్, అనేక డాక్యుమెంట్లు సబ్మిట్ చేయటంతో, అవన్నీ స్క్రూటినీ చేయటానికి టైం పట్టటంతో, విచారణ నాలుగు గంటల ప్రాంతంలో ప్రారంభం అయ్యింది. అయితే విచారణ ప్రారంభం అయిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం, ఈ పిటీషన్ అత్యవసరంగా విచారణ చెయ్యాల్సిన అవసరం ఏమి ఉంది, 23న షెడ్యుల్ ఉంది కాబట్టి, 18న రెగ్యులర్ కోర్టులో ఈ పిటీషన్ వినటానికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించగా, దీని పై స్పందించిన ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది, ఎలెక్టోరియల్ రోల్స్ తయారు చేయాలని, 18 అయితే సమయం సరిపోదు అని చెప్పగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం, 15వ తారిఖు ఎలెక్టోరియల్ రోల్స్ పంపిస్తాం అని చెప్పిందని, సమాధానం చెప్పారు. మొత్తానికి ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, ఈ కేసుని 18కి రెగ్యులర్ కోర్టులో మొదటి అంశంగా వాయిదా వేసింది. దీంతో మరో 5 రోజులు సస్పెన్స్ తప్పేలా లేదు.