ఇళ్లపట్టాల పంపిణీపై గొప్పలుచెప్పుకుంటున్న ముఖ్యమంత్రి పీజీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా నిన్నటికి నిన్న పిడుగులాంటి జీవో ఇచ్చాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రే, నేడు ఆరెండుపథకాలను రద్దుచేసేందుకు సిద్ధమయ్యాడన్నారు. గతంలో తనతండ్రి ప్రారంభించిన ఫీజురీయింబర్స్ మెంట్ పథకానికి మెరుగులుదిద్ది రూ.లక్షా50వేలవరకు చెల్లిస్తానని ఎన్నికలముందు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. ఆనాడు అలాచెప్పిన జగన్, నేడు పీజీకోర్సులు చదువుతున్న సుమారు 70వేలమంది విద్యార్థులపాలిట యముడిలా తయార య్యాడని రఫీ మండిపడ్డారు. నిన్నటికి నిన్న జగన్ ప్రభుత్వం విడుదలచేసిన జీవోనెం-77, పీజీవిద్యార్థుల పాలిట నిజంగా మరణశాసనమే అవుతుందన్నారు. జగన్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 637 కాలేజీల్లో చదువుతున్న 70వేల మంది విద్యార్థుల జీవితాలు చీకట్ల పాలయ్యాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ప్రతిఒక్క పీజీ విద్యార్థి ప్రభుత్వ కళాశాలల్లోనే చదవాలనే నిబంధన విధించారని, అదెంతవరకు సాధ్యమో పాలకులే సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉండే పీజీ సీట్లు ఎన్నిఉంటాయో, ఎందరు విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందో, ఆ తర్వాత ఉత్తమఉపాధి అవకాశాలు లభిస్తాయో జీవో ఇచ్చిన ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని రఫీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏదైనాపథకాన్ని ప్రారంభించేముందు, దాని విధివిధానాలు, అదెంతవరకు ప్రజలకు మేలుచేస్తుందనే ఆలోచన కూడా చేయకుండా రెండేళ్లు గడవకముందే రెండుపథకాలను వైసీపీప్రభుత్వం రద్దుచేసిందన్నారు. తాను అమల్లోకి తీసుకొచ్చిన రెండుపథకాలను రద్దుచేయడంద్వారా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేశాడని రఫీ మండిపడ్డారు.

కేంద్రంనుంచి నిధులొచ్చేపథకాలను మాత్రమే తనపేరుతో జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్నాడని, అలా నిధులు రావడం లేదనే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు మంగళం పాడేశాడన్నారు. జగన్ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు అన్యాయం చేసేలా ఇచ్చిన జీవోనుతక్షణమే వెనక్కు తీసుకోవాలని రఫీ డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో విదేశాల్లోచదువుకునే విద్యార్థులకుకూడా ఏటా నిధులు అందించడం జరిగిందని, జగన్ అధికారంలోకి రాగానే విదేశాల్లో విద్యనభ్యసించే దాదాపు 4వేలమంది విద్యార్థులకు తీరని అన్యాయం చేశాడన్నారు. అమ్మఒడి పథకాన్ని ప్రతివిద్యార్థికి అందిస్తానన్న జగన్, నేడు విద్యార్థులసంఖ్యను కాదని తల్లుల సంఖ్యతో పథకాన్ని ముడిపెట్టి, సగానికిపైగా విద్యార్థులకు పథకాన్ని దూరంచేశాడన్నారు. ఒకచేత్తోఇస్తూ, మరోచేత్తో లాగేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాగుగా మారిందని, ఆయనఅమలుచేస్తున్న పథకాలు ప్రకటనల్లో తప్ప వాస్తవంలోఅమలు కావడం లేదన్నారు. మాటతప్పను, మడమతిప్పను అనిచెప్పుకునే ముఖ్యమంత్రి, తాను తీసుకొచ్చిన పథకాలను తానే రద్దుచేయడమేంటన్నారు. పీజీ విద్యార్థుల భవిష్యత్ కు గొడ్డలిపెట్టులాంటి జీవో నెం-77ను జగన్ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని రఫీ డిమాండ్ చేశారు. పేదవిద్యార్థులకు ఉచితంగా విద్యను, వసతిని కల్పిస్తానని చెప్పిన, ఇప్పుడు ప్రభుత్వకాలేజీల్లో చదివేవారికి మాత్రమే అనే నిబంధనతో వారి భవిష్యత్ ను నాశనంచేయడమేంటన్నారు. నిరుద్యోగులకు నిరుధ్యోగభృతిని, విదేశాల్లోని విద్యార్థులకు నిధులను, ఉద్యోగార్థులకు జాబ్ క్యాలెండర్ ను ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి తాజాగా పీజీ విద్యార్థులమెడపై కత్తిపెట్టడం భావ్యం కాదని రఫీ తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా నాశనమైందని, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, హ-త్య-లు ఏపీలో తాండవ మాడుతున్నాయని, ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కొరవడిందని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి దీపక్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఆయన తననివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పొలిటికల్ టెర్రరిజం అనే అజెండాతో ముందుకు సాగుతూ, ప్రతిపక్ష తెలుగుదేశాన్ని దెబ్బతీయాలి, రాష్ట్రాన్ని పాలెగాళ్ల రాజ్యంగామార్చాలనే ఏకైకలక్ష్యంతోనే పాలకులు పనిచేస్తున్నారన్నారు. టీడీపీ అడ్డులేకుంటే విచ్చలవిడిగా దోపీడీ చేయొచ్చనే ఆలోచనలో పాలకులు ఉన్నారన్నారు. జరుగుతున్న దారుణాలపై ప్రజలు మౌనంగా ఉంటే, భవిష్యత్ లో అందరూ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని దీపక్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ వారికి భజనచేయకపోయినా, ఎదురుతిరిగినా, ఎటువంటి గతి పడుతుందో రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలేప్రత్యక్ష నిదర్శనాల న్నారు. తాడిపత్రిలో 40ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్న జే.సీ. కుటుంబం హాయాంలో అక్కడిప్రజలు ప్రశాంతంగా బతికారని, కానీ నేడు అక్కడ జరుగుతున్న సంఘటనలు స్థానికులను భయభ్రాం తులకు గురిచేస్తున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే సతీమణి ఎద్దులబండిఇసుకకు రూ.10వేలువసూలుచేస్తున్నారంటూ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న మాటలు బయటకు వచ్చాయన్నారు. ఆ సంభాషణలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయని, అంతమా త్రానికే సదరు అధికారపార్టీ ఎమ్మెల్యే ఇసుక వసూళ్లపై వివరణ ఇచ్చుకోకుండా వీరంగం వేశాడన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అలా ప్రవర్తిస్తే, టీడీపీ వారినినోటికొచ్చినట్టల్లా దూషిస్తున్నందుకు వైసీపీ వారిని ఏం చేయాలో చెప్పాలన్నారు. ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ వాహనం, పోలీసుల భద్రత ఉంటుందని, వారందరికీ తెలిసే, వారి సహకారంతోనే సదరు వైసీపీఎమ్మెల్యే అనుచరులతో జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వచ్చాడని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. దానికి సంబంధించిన సిసి టివి ఫూటేజ్ ప్రసారం చేసారు.

వాహనాల్లో కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో వచ్చిన వ్యక్తులు శాంతికోసం, చర్చలకోసం వచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడిచేసి, ఎమ్మెల్యే అతని అనుచరులు వెళ్లిపోయాక, ప్రభాకర్ రెడ్డి తనఇంటికి వచ్చాక, తిరిగిఎమ్మెల్యే కారు విపరీతమైన వేగంతో జే.సీ ఇంటిముందునుంచి ఆయనఅనుచరులపైకి దూసుకొచ్చిం దన్నారు. పోలీసుల సాయంతో ఎమ్మెల్యే, అతని అనుచరులు జే.సీ ప్రభాకర్ రెడ్డిపైకి రాళ్లురువ్వారని, అక్కడి పోలీసులు నిజంగా 144 సెక్షన్ అమలుచేస్తే, ఎమ్మెల్యే, అతనికొడుకు, వారి అనుచరులు జే.సీ. ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి ఎలావచ్చిందో సమాధానం చెప్పాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు రాళ్లు వేస్తున్నప్పుడు చూస్తూకూర్చున్న పోలీసులు, తమను తాము రక్షించుకోవడంకోసం జే.సీ.మనుషులు రాళ్లువేయగానే ఖాకీలు వారిపైపడి వారిని కొట్టుకుంటూ తీసుకెళ్లారన్నారు. పోలీసుల అండ దండలతోనే ఎమ్మెల్యే, అతనికొడుకు, వారి అనుచరులు జే.సీ.ప్రభా కర్ రెడ్డి ఇంటిపైకి దాడికి వచ్చారన్నారు. జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే, అతని అనుచరులపై, ప్రభాకర్ రెడ్డి మనుషులు దాడిచేశారంటూ వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, 307కేసు పెట్టడం జరిగిందన్నారు. ప్రభాకర్ రెడ్డి ఇంటిలోకి ఆయుధాలు తీసుకెళ్లడం, ఆయన ఇంటిపైకి రాళ్లేయడం చేసినవారిని వదిలేసి, ప్రభాకర్ రెడ్డిపై, అతని మనుషులపై తప్పుడుకేసులు పెట్టడంచూస్తేనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. ఇంత జరిగితే రాష్ట్ర హోం మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ. ఇంటికి శాంతిచర్చలకు వెళ్లారని చెప్పడం సిగ్గుచేటుకాక ఏమవతుందన్నారు.

గతంలో స్థానికఎన్నికల నోటిఫికేషన్ వెలుబడిన సమయంలో భాస్కర్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్తను వీరాపురంలో హత్యచేశారని, భాస్కర్ రెడ్డి భార్యపై, అతని కుటుంబంపై తప్పుడుకేసులుపెట్టి, ఊరువదిలిపోయేవరకు పోలీసులు వేధించారన్నారు. ఆనాడు జరిగిన దారుణంపై టీడీపీఅధినేత చంద్రబాబు స్పందించినా, పోలీసులు తప్పుడుకేసులను వెనక్కు తీసుకోలేదన్నారు. మరోఘటనలో టీడీపీకిచెందిన సర్పంచ్ అభ్యర్థిని వైసీపీలో చేరాలనిబెదిరించారని, ఆయన అందుకు నిరాకరించాడన్న అక్కసుతో బట్టలూడదీసి పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టడం జరిగింద న్నారు. ఆ విధంగా పోలీసులు వ్యవహరించినా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నదాఖలాలు లేవన్నారు. సోమినాయుడు అనే మరోటీడీపీకార్యకర్త ఇంటిలో లేని సమయంలో అతని ఇంటిని కూల్చడానికి ప్రయత్నించారన్నారు. పోలీసులే దగ్గరుండి గూండా ల్లా ప్రవర్తిస్తున్న దాఖలాలు అనేకం ఉన్నాయన్నారు. కడపజిల్లా లో రషీద్అనే టీడీపీకార్యకర్త ఇంటిలోకి సివిల్ డ్రస్ లో ఉన్న పోలీస్అధికారి వెళ్లి వీరంగం వేశాడన్నారు. సినిమాల్లో చూడని విధంగా అనేకసంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నా, పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నా పాలకులు పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను ప్రజలు గమనించాలన్నారు.

రాష్ట్రంలో ఒక మతాన్ని కించపరిచే చర్యలు సరికావని, హిందూ ఆచారాలపై కుట్రపూరితంగా దాడి జరుగుతోంది అని, తిరుమల వైకుంఠ ద్వార దర్శనం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం అంటూ, టిడిపి నేత, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుచ్చి రాంప్రసాద్ ఫైర్ అయ్యారు. ఆయన మాటల్లో "జగన్ రెడ్డి 18 నెలల పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయి. తిరుపతి దగ్గర నుంచి శ్రీశైలం వరకు పెద్ద పెద్ద దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతోంది. టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి తిరుమల కొండపై, ద్వారకా తిరుమలలోనూ వైకాపా నేతలు, మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జగన్ రెడ్డి విధానాలకు నిదర్శనం. తిరుమలకు వెళ్లే బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత కీర్తనలు పెట్టారు. నేడు తిరుమల వైకుంఠ దర్శనం విషయంలో మూడు రోజులు కొనసాగించే దర్శనాన్ని 10 రోజులు పాటు పెట్టారు. హిందూ గౌరవాలపై పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వం దాడి చేస్తోందని దీనిని బట్టి అర్థమవుతోంది. ప్రతి రోజూ హిందూ దేవాలయాలపై ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. తిరుమలలో వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి 5,6 వందల మందితో దర్శనానికి వెళ్లారు. డ్రోన్ లు ఎగురవేసి తిరుమల నిబంధనలు ఉల్లంఘించారు. ఇది శాంతిభద్రతలకు విఘాతం కాదా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కనీసం మాస్క్ లు కూడా వేసుకోకుండా ర్యాలీగా వెళ్లారు. ప్రకాశం జిల్లా దర్శిలో కృష్ణుడి ఆలయంలో రక్తం, మాంసపు ముక్కలు పడేసి వెళ్లారు."

"ద్వారకా తిరుమలలో పందిమాంసం అమ్మే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవన్నీ దేనికి సంకేతం? ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. అంతర్వేది రథం దగ్ధం చేసినా చర్యలు లేవు. చర్చిలో దాడి జరిగిందని చెప్పి 24 గంటల్లో అరెస్ట్ చేశారు. సంఘటనలు చూసేందుకు వెళ్లే వారిని కూడా అనుమతించడం లేదు. కనకదుర్గ గుడిలో వెండి సింహాలు మాయం అయ్యాయి. హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. రోడ్లపైకి రాకపోయినా సరైన సమయంలో బుద్ధి చెబుతారు. ఓ మతంపై పథకం ప్రకారం దాడి చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. మత మార్పిడులు, దాడుల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ పోరాటం చేస్తుంది. త్వరలోనే కార్యాచరణ వెల్లడిస్తాం. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, అంతర్వేది రథం దగ్ధంపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు, దేవాదాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు మనం చూశాం. జగన్ రెడ్డి ఏనాడూ స్పందించలేదు. బ్రాహ్మణులపై దాడులు జరుగుతున్నాయి. అన్ని వర్గాలను, మతాలను గౌరవించే సంప్రదాయం నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒక మతాన్ని కించపరిచే చర్యలు సరికావు. ఇది అంతర్యుద్ధానికి దారి తీస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్లు తెరిచి సమస్యలు పరిష్కరించాలి. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవు." అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇళ్లపట్టాల పంపిణీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడానికి ఒకరోజు ముందు టీడీపీకేంద్రకార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంద్వారా జగన్మోహన్ రెడ్డి, ఎలాంటి పనికిరాని స్థలాలను ఇళ్లపట్టాలుగా ఇస్తున్నాడో ప్రత్యక్షంగా ఆధారాలతో సహా చెప్పడం జరిగిందని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! దిక్కుమాలిన ఇళ్లప్లాట్లను ప్రజలకుఇవ్వడంకోసం భారీ బహిరంగ సభను ఏర్పాటుచేయడం, ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పడం అందరం చూశాం. అంతే కాదు ఇందులో 41 మంది ఎమ్మెల్యేలు అతి పెద్ద కుంభకోణం చేసారు. వారిని వదిలిపెట్టె సమస్యే లేదు. పేదలకుఇళ్లపట్టాలిచ్చే నెపంతో రూ.6,500కోట్ల భారీ అవినీతికి జగన్ ప్రభుత్వం పాల్పడిన విషయాన్నికూడా తాము బయటపెట్టాము. వైసీపీప్రభుత్వం ఇళ్లప్లాట్లు ఇచ్చేప్రదేశంలో మీడియావారి వాహనమే మట్టిలో కూరుకుపోయింది. అటువంటి ప్రదేశంలో పేదలు ఇళ్లెలా కడతారో చూడాలి. చంద్రబాబునాయుడి ప్రభుత్వం వివిధపథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల90వేల గృహాల నిర్మాణానికి శ్రీకారంచుట్టి 2019 మార్చినాటికి దాదాపు 8లక్షల గృహాలను పంపిణీకి సిద్ధంచేసింది. టీడీపీప్రభుత్వహయాంలో పట్టణప్రాంతాల్లోని పేదలకోసం 300, 365, 430 చదరపు అడుగుల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. ఆ విధంగా నిర్మించిన వాటినిపేదలకుఇవ్వకుండా తొక్కిపెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలప్రచారంలో రూపాయిఖర్చుకూడా లేకుండానే పేదలకు టిడ్కో గృహాలను అందిస్తానని చెప్పాడు. బ్యాంకురుణాలు కూడా తమప్రభుత్వమే భరిస్తుందని ఆనాడు జగన్ చెప్పడం జరిగింది. ఎన్నికలకు ముందు, పేదలఓట్లు కొట్టేయడంకోసం అలా చెప్పిన వ్యక్తి నేడు, అన్నిహామీల్లానే ఇళ్లకేటాయింపుహామీలో కూడా మాటతప్పి, మడమతిప్పాడు. నేడు మొదటిదఫా 2లక్షల62వేల టిడ్కోఇళ్ల పంపిణీలో 365, 430 చదరపు అడుగుల్లో నిర్మించిన గృహాలకు సంబంధించి లబ్దిదారులకు చెందిన 50శాతంవాటాను, అందుకు అవుతున్న రూ.482కోట్ల ఖర్చుని కూడా తనప్రభుత్వమే భరిస్తున్నట్లు ప్రకటనల్లో చెప్పుకుంటున్నాడు. గృహనిర్మాణానికి సంబంధించి అబద్ధాలతో మోసంచేయాలని చూస్తున్నాడు.

ఏపీ టిడ్కోఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన 300చదరపు అడుగుల్లో నిర్మితమైన ఎన్టీఆర్ గృహాలు లక్షా43వేలవరకు ఉన్నాయి. 365 చదరపు అడుగులవి 74వేల312ఉంటే, 430 చదరపు అడుగులవి 44వేల304 వరకుఉన్నాయి. ఆయా ఇళ్లన్నింటినీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం మొదటిదశలో లబ్ధిదా రులకు కేటాయించడానికి సిద్ధమైంది. ఆయా ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారుడివాటా కలిపిబ్యాంకులకు చెల్లించాల్సిన సొమ్ము కలిపితే, 365చదరపు అడుగులఇంటికి రూ.3లక్షల50 వేలు ఉంది. ఆమొత్తాన్ని లబ్దిదారుడే చెల్లించాలి. అందులో బ్యాంకురుణం రూ.3లక్షలైతే, లబ్దిదారుడి వాటా రూ.50వేలు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడుచెబుతున్నది ఏమిటంటే ఆ మొత్తం సొమ్ములో కేవలంరూ.25వేలు మాత్రమే చెల్లిస్తాననడం. తద్వారా ఆయన ఎన్నికల్లో చెప్పినట్లుగా మొత్తంసొమ్ము చెల్లించకుండా కేవలం రూ.25వేలతో సరిపెట్టి, లబ్దిదారుడికి రూ.3లక్షల25వేల వరకు ఎగ్గొడుతున్నాడు. ఒక్కో లబ్దిదారుడికి రూ.3లక్షల25వేల చొప్పున మొత్తమ్మీద 365చదరపు అడుగులకు సంబంధించే, రూ.2,405కోట్లవరకు జగన్ పేదలకు ఎగనామం పెడుతున్నాడు. అదలా ఉంటే, 430చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి చూస్తే, 44వేలమంది లబ్ధిదారులుంటే, ఒక్కో లబ్ధిదారు రూ.4లక్షలవరకు కట్టాల్సిఉందని, దానిలో లబ్దిదారు వాటా రూ.లక్ష అయితే, బ్యాంకు రుణం రూ3లక్షలుగా ఉంది. ఆ మొత్తం సొమ్ములో జగన్మోహన్ రెడ్డి కేవలం రూ.50వేలు మాత్రమే చెల్లిస్తాననిచెప్పి, మిగిలిన రూ.3లక్షల50వేలను పేదలకు ఎగ్గొట్టడానికి సిద్ధమయ్యాడు. 44వేలమందికిగాను, ఒక్కొక్కరికి రూ.3లక్షల50వేలచొప్పున ఎగ్గొడితే, రూ.1540కోట్లవరకు జగన్ ప్రభుత్వం పేదలకు ఇవ్వకుం డా కాజేస్తోంది. అంటే మొదటిధపా ఇళ్లపంపిణీలోనే 365, 430చదరపు అడుగులకుసంబంధించే దాదాపుగా రూ.3,924కోట్లు (రూ.4వేలకోట్లు) పేదలకు ఎగనామం పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు.

ఆ విధంగా పేదలకు ఇస్తానన్నది ఇవ్వకుండా, ఇళ్లపట్టాల ప్రచారం కార్యక్రమంలో రూ480కోట్లు మేలుచేస్తున్నట్లు సిగ్గులేకుండా ముఖ్య మంత్రి ఎలా చెప్పుకుంటున్నాడు. రూ4వేలకోట్లు పేదలకు ఇస్తాననిచెప్పి, ఇవ్వకుండా ఎగనామంపెట్టిన ముఖ్యమంత్రి, వారిని మోసగించి, పేదలకు రూ.482కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇళ్లపట్టాల ముసుగులో రూ.6,500కోట్లు కాజేసిన జగన్ ప్రభుత్వం, టీడీపీప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా బ్యాంకురుణాలు తనప్రభుత్వమే చెల్లిస్తుందని మోసపు మాటలుచెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రూ.4వేలకోట్లవరకు పేదలకు ఎగ్గొట్టాడు. మొత్తంగా చూస్తే, ఇళ్లస్థలాలు, ఇళ్ల విషయంలో జగన్ ప్రభుత్వం రూ.10,500కోట్లవరకు కాజేసింది. పట్టణప్రాంతాల్లోని అర్హులైనపేదలకు ఇళ్లనిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు తమప్రభుత్వమే భరించి ఉచితంగా గృహాలను అందిస్తుందని, పట్టణప్రాంతాల్లోని పేదలు ఇళ్లకోసం తీసుకున్న బ్యాంకురుణాలను మాఫీ చేసి, పూర్తిఉచితంగా పేదలకు ఇళ్లను అందిస్తామని టీడీపీ 2019ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే నిజంగా పేదలకు రూ.4వేలకోట్ల వరకు మేలుజరిగేది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారమే టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సంఖ్యప్రకారం చూస్తే, నేడుఆయన పేదలకు రూ.4వేలకోట్ల వరకు ఎగ్గొట్టాడని స్పష్టమవుతోంది. చేయాల్సిందం తాచేసి, బహిరంగసభలు పెట్టి, అంతా మేలుచేస్తున్నట్లు చెప్పుకుం టున్నాడు. చెప్పినట్టుగా రూ.4వేలకోట్లను పేదలకు జగన్ అందించాల్సిందే. అందులో మరో సందేహమేలేదు.

30లక్షల76వేల ఇళ్లప్లాట్లలో కేవలం 90శాతం ఇళ్లస్థలాలు మాత్రమే తాను ఇస్తున్నట్లు నిన్నటిసభలో ముఖ్యమంత్రి చెప్పా డు. 28లక్షల30వేల ప్లాట్లను మాత్రమే తాను ఇస్తున్నానని, మిగిలినవాటిపై కోర్టుకేసులున్నాయని అందుకే ఇవ్వలేకపోతున్నా నని చెప్పడం ద్వారా జగన్ తొలిసారి నిజం చెప్పాడు. నిన్నటివరకు చేతిలోఉన్న దొంగపత్రికను అడ్డంపెట్టుకొని ఇళ్లపట్టాల పంపిణీపై టీడీపీ కోర్టులకు వెళ్లిందని తప్పుడుప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు 90శాతం పట్టాలుఇస్తున్నట్లు ఎలా చెప్పాడు? కేవలం పదిశాతం ప్లాట్లకుసంబంధించి మాత్రమే కోర్టుల్లో కేసులున్నాయని ముఖ్యమంత్రే ఒప్పుకున్నాడు. మరి అలాంటప్పుడు సంక్రాంతికి, ఉగాదికి, మానాన్న జయంతికి ఇళ్లప్లాట్లు ఇస్తానని ముఖ్యమంత్రి ఎందుకప్రజలను మోసగించాలని చూశాడు. పేదలకు స్థలాలివ్వకుండా ఇన్నాళ్లు ఎందుకు తొక్కిపెట్టారు? అందుకే ముఖ్యమంత్రిని ఫేక్ సీఎం అనేది. తాడేపల్లి ప్యాలెస్ కు అందాల్సినముడుపులు అందలేదని ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఇళ్లపట్టాలివ్వలేదా? తాడేపల్లి ప్యాలెస్ లోజగన్ అవినీతి లెక్కలుచూసే చిత్రగుప్తుడు సజ్జలకు, జిల్లాలవారీగా ఇళ్లపట్టాల సొమ్ముతాలూకా లెక్కలు అందలేదని ఇన్నాళ్లూ పట్టాల పంపిణీని నిలిపివేశారు. పేదలకు చెందిన అసైన్డ్ భూములను లాక్కొని, పేదలకు ఇళ్లపట్టాల రూపంలో అందించాలని జగన్ ప్రభుత్వం చూడబట్టే, భూములు కోల్పోయిన అనేకమంది చనిపోయారు. భూసేకరణ భయంతో, అధికారుల వేధింపులతో అనేకమంది అసైన్డ్ రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. (జిల్లాలవారీగా మరణించిన రైతుల వివరాలను పట్టాభి ఈసందర్భంగా విలేకరులకు చదివి వినిపించా రు) తమ భూములుకోల్పోయిన వారు ప్రభుత్వ తీరుకి నిరసనగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ విషయం తెలిసికూడా ముఖ్యమంత్రి కేవలం తనఅవినీతి వాటాలకోసమే ఇన్నాళ్లుగా ఇళ్లపట్టాల పంపిణీని తొక్కిపెట్టి, కావాలనే టీడీపీపై బురదజల్లారు.

ఇళ్లపట్టాల పంపిణీలో అవినీతిసొమ్ము లెక్కలు తేలక, తనకు అందాల్సిన సొమ్ము అందకనే ఏడాదినుంచి ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వలేదని నిన్నఆయన మాటలతోనే తేలిపోయింది. మరోపక్క టిడ్కోగృహాలకు సంబంధించి రూ.482కోట్లు అదనంగా ఇస్తున్నాననిచెప్పుకుంటూ, 365, 430 చదరపు అడుగులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రూ.4వేలకోట్ల వరకు పేదలకు ఎగ్గొట్టాడని తేలిపోయింది. నేడు నేనుచెప్పిన లెక్కలే అందుకు ఉదాహరణ. 365 చదరపు అడుగులకేటగిరిలో 74వేల312మంది లబ్దిదారులకు, రూ.2045కోట్లు, 430 చదరపు అడుగుల గృహాల్లో దాదాపు 44వేలమందికి రూ.1540కోట్లు వరకు టోకరా వేశాడు. ఆ విధంగా పేదలకు దక్కాల్సిన రూ.4వేలకోట్లను ఫేక్ ముఖ్యమం త్రి కాజేశాడని స్పష్టమైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే, ఇచ్చినమాటప్రకారం పేదలకు రూ.4వేలకోట్ల వరకు లబ్ది చేకూరిఉండేది. జగన్అనే మోసగాడిని నమ్మబట్టే పేదలు ఆమొత్తం కోల్పోయారు. ఇళ్లపట్టాల పంపిణీలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. దోషులెవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఇళ్లపట్టాల పంపిణీలో రూ.6,500కోట్లు కాజేయడం ద్వారా 13లక్షలమంది పేదలకు అదనంగా వచ్చే సెంటుభూమిని రాకుండా చేసిన ఘనతకూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఈ విధంగా భూసేకరణ, మెరకతోలడం, టిడ్కోఇళ్ల కేటాయింపులో ముఖ్యమంత్రి ఏవిధంగా పేదలను దగాచేశాడో తేలిపోయింది. దీనిపై ప్రజలంతా వాస్తవాలు తెలుసుకొని, ముఖ్యమంత్రిని, మంత్రులను నిలదీయాలని విజ్ఞప్తిచేస్తున్నాను. శ్మశానాల పక్కన ఇళ్లపట్టాలిస్తే, అక్కడే రోడ్లు వేసి, విద్యుత్ స్థంభాలు వేస్తారా? ఇంటి నిర్మాణాల పేరుతో రూ.50వేలకోట్లు ఖర్చుచేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ రేపు, మరో స్కామ్ కు పథకరచన చేస్తున్నాడు. పేదలకు నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్లపట్టాలుఇవ్వకపోతే, టీడీపీ తరుపున కాలర్ పట్టుకొని నిలదీస్తాము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన ఫేక్ మాటలు కట్టిపెట్టి ప్రజలకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాను.

Advertisements

Latest Articles

Most Read