మన హక్కులు మనకు రాకపోతే, నిగ్గదీసి అడగాలి. రాజకీయలు పక్కన పెట్టి, మన హక్కుల కోసం పోరాడాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎప్పుడైతే కేంద్రం మోసం చేసిందని భావించారో, వెంటనే వారి పై యుద్ధం ప్రకటించారు. హోదా దగ్గర నుంచి, వివిధ విభజన హామీల పై నిలదీశారు. అయితే ఈ పోరాటంలో రాజకీయంగా నష్టపోయారు. పొతే పోయారు, రాష్ట్రం కోసం, మోడీ, అమిత్ షా లాంటి వారి పై పోరాటం చేసి, దేశ వ్యాప్తంగా వారికి వ్యతిరేకంగా పని చేసారు అనే పేరు వచ్చింది. రాష్ట్ర ఆత్మగౌరవం నిలబడింది. అయితే ఇప్పుడు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు, కేంద్రం మెడలు వంచేస్తానని అన్నారు. వంచింది లేదు , చివరకు గట్టిగా అడుగుతుంది కూడా లేదు. హోదా విషయం ఎప్పుడో మర్చిపోయారు, అమరావతిని మూడు ముక్కలు చేసాం కాబట్టి, ఇది కూడా కేంద్రాన్ని అడిగే పని లేదు. విభజన హామీలు ఏమి అయ్యయో కూడా తెలియదు. చివరకు ప్రకటించిన రైల్వే జోన్ కూడా అడ్రస్ లేదు. ఇలా అన్ని రకాలుగా కేంద్రం పై ఒత్తిడి లేదు. అయితే ఇవన్నీ పొతే పోయాయి, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ఉంటే చాలని అందరూ అనుకున్నారు. అది ఒక్కటి సాధించినా జగన్ మోహన్ రెడ్డి చిరస్థాయిలో నిలిచి పోతారని అనుకున్నారు. ముఖ్యంగా చంద్రబ్బు ఇప్పటికే 70 శాతం పై గా పూర్తి చేసారు కాబట్టి, మిగతాది కేంద్రం సాయంతో పూర్తి చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ చివరకు పోలవరం విషయంలో కూడా కేంద్రం అన్యాయం చేసేసింది. అయితే, చివరకు ఈ విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి వైపు నుంచి మౌనమే.

center 09112020 12

కేవలం ఒక ఉత్తరం రాసి ఊరుకున్నారు. బుగ్గన గారిని రెండు సార్లు ఢిల్లీ పంపించారు. ఇక అంతే , మిగతాది అంతా చంద్రబాబు నామ స్మరణే. చంద్రబాబు వల్లే కేంద్రం పోలవరం విషయంలో అన్యాయం చేసింది అంటూ పాట మార్చేసారు. చంద్రబాబు తప్పు చేసారే అనుకుందాం, అందుకేగా ఆయన్ను పక్కన పెట్టి, మీరు మెడలు వంచుతారని గెలిపించింది అంటే సౌండ్ లేదు. అయితే ఈ రోజు ఎట్టకేలకు పోలవరం విషయం పై జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అయితే ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదు, కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కు చేస్తున్న అన్యాయం గురించి కనీసం ప్రస్తావించలేదు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం అని అంటున్నారు. ఒక పక్క 18 నెలల నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో పక్క కేంద్రం నిధులు ఇవ్వకపోగా, అంచనాలను 50 శాతానికి తగ్గించి. మరి ఈ తరుణంలో, 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ఎలా పూర్తి చేస్తారు ? దాదాపుగా 30 వేల కోట్లు రాష్ట్రం పెట్టుకోగలదా ? అయినా మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనేది హక్కు, ఆ హక్కు గురించి ప్రతి వేదిక పైన కేంద్రాన్ని నిలదీయాలి కానీ, ఇలా వారిని ఒక్క మాట కూడా అనకుండా ఉంటే, కేంద్రం పై ఏమి ఒత్తిడి ఉంటుంది ? చూద్దాం, నిజంగా 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తారేమో.

ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో పాలక మండలి నియామకాల తీరు పై, హైకోర్టు తీవ్రంగా స్పందించింది. యూనివర్సిటీ పాలకమండలి నియామకాలు, రాజకీయా ప్రయోజనల కోసం, రాజకీయ సిఫారసులతో మాత్రమే నియామకాలు జరుగుతున్నాయని, హైకోర్టులో మాజీ జడ్జి జాడ శ్రవణ్ కుమార్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ నేపధ్యంలో, ఈ పిటీషన్ పై నేడు ధర్మాసనం, విచారణ చేసింది. జస్టిస్‌ రాకేష్‌కుమార్‌, జిస్టిస్‌ ఉమాదేవి దర్మసానం ఈ కేసు విచారణ చేసింది. శ్రవణ్ కుమార్ తరుపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, యూనివర్సిటీ పాలకమండలి నియామకాలు మొత్తం, రాజకీయ సిఫారుసలతో నియమించారని, దానికి సంబందించిన ఫైల్స్, ఆధారాలు అన్నీ కోర్టు ముందు ఉంచారు. అయితే దీని పై కోర్టు తీవ్రంగా స్పందించింది. రాజకీయ జోక్యం, సిఫారుసు ఎక్కువ అయ్యింది అంటూ స్పందించింది. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నత విద్యా మండలికి పంపిన ఫైల్, సిఫారుసు వివరాలు కూడా కోర్టు ముందు ఉంచారు. ఎవరు సిఫారుసులు చేసింది, లాంటి పూర్తి వివరాలు అందులో ఉన్నాయి. మాములుగా యూనివర్సిటీ పాలకమండలి నియామకాల్లో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని కోర్టుకు తెలిపారు.

hc 09112020

అయితే దీని పై స్పందించిన కోర్టు, అసలు పాలకమండలి సభ్యులను ఏ అర్హతలతో నియమిస్తారు, వివిధ మార్గదర్శకాల వివరాలు ఇవ్వాలని, ధర్మాసనం కోరటంతో, ఈ కేసు విచారణ ఈనెల 23కు వాయిదా పడింది. ఇక మరో అంశం పై కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. చిత్తూరు జిల్లాలో శ్మశానంలో నిర్మిస్తున్న అనధికార నిర్మాణాల విషయమై హైకోర్టు సీరియస్ అయ్యింది. చిత్తూరు జిల్లా తిరుమలాయపల్లిలో ప్రభుత్వమే అనధికార నిర్మాణాలు చేయటం పై కోర్టు సీరియస్ అయ్యింది. శ్మశానం దాని చుట్టూ పక్కలా, అనుమతులు లేకపోయినా సరే, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను నిర్మాణం చేస్తున్నారు. అయితే గతంలో దీని పై హైకోర్ట్ ఆదేశాలు ఉన్నా, వాటిని పాటించక్పోవటంతో హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీని పై ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఇక మరో పక్క అమరావతి రాజధాని పిటీషన్ రోజు వారీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అమరావతి అంశంపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. ప్రధాన పిటిషన్ల పై విచారణను హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

నంద్యాలలోని సలాం కుటుంబంపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని, తనపై, తన కుటుంబంపై పోలీసులు చేస్తున్న దౌ-ర్జ-న్యా-లు చూడలేకనే తాను ఆ-త్మ-హ-త్య చేసుకుంటున్నట్లు సలాం సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మరీన విషయం తెలిసిందే. సలాం కుటుంబాన్ని వే-ధిం-చి, ఇబ్బందులకు గురిచేసిన సీఐ సోమశేఖర్ రెడ్డిపై క్రి-మి-న-ల్ కేసుపెట్టాలని, సీఐని ఆదిశగా ప్రోత్సహించిన వైసీపీ నేతలపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఈప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీ, వివిధ పార్టీలు, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారటంతో, ప్రభుత్వం స్పందించి, ఘటన పై ఎంక్వయిరీ వేసారు. ఈ విచారణలో షాకింగ్ వెలుగులోకి వచ్చాయి. అందురూ అనుకుంటున్నట్టే సీఐ సోమశేఖర్‌రెడ్డి ఒత్తిడి మేరకే కుటుంబం ఆ-త్మ-హ-త్య చేసుకున్నట్టు విచారణలో తేలింది. సిఐకి , హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌ కూడా సహకరించారు, ఇద్దరూ ఆ కుటుంబాన్ని వేధించినట్టు విచారణలో తేలింది. దీంతో ఇద్దరినీ పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేసారు. మరో పక్క, నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత పరిశితి నెలకొంది. స్టేషన్ బయట పెద్ద ఎత్తున వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.

abdul 08112020 2

ఈ ఈ ఘటన పై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మండి పడింది. రాష్ట్రంలో ముస్లిం-మైనారిటీలకు రక్షణ లేకుండాపోయిందని, ప్రభుత్వ అసమర్థత, ముఖ్యమంత్రి నియంత్రత్వ ధోరణికి తోడు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థమొత్తం, వైసీపీనేతల అక్రమదందాలకోసమే పనిచేస్తున్నాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి మొహమ్మద్ నజీర్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ పనితీరుని కోర్టులు సైతం తప్పుపట్టాయని, ఖాకీలకు న్యాయస్థానాలు చీవాట్లు పెట్టిన సందర్భాలను చూశామన్నారు. కర్నూలుజిల్లాలోని నంద్యాలలో ముస్లిం వర్గానికిచెందిన సలాం కుటుంబాన్ని, స్థానిక సీఐ సోమశేఖర్ రెడ్డి భ-య-భ్రాం-తు-ల-కు గురిచేశాడని, పోలీస్ వే-ధిం-పు-ల-కు భయపడిన సలాంకుటుంబం మొత్తం ఆ-త్మ-హ-త్య-కు పాల్పడిందని, జరిగిన దారుణాన్ని ప్రభుత్వ హ-త్య గానే తాము భావిస్తున్నామని నజీర్ తేల్చిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలపై అనేక రకాల దా-డు-లు జరుగుతున్నాకూడా, జగన్మోహన్ రెడ్డి అవేమీ పట్టించుకోకుండా, కనీసం సమాధానంకూడా చెప్పకుండా వ్యవహరిస్తున్నాడన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎప్పుడూ లేని విధంగా, కష్టం చేసుకునే రైతుల చేతులకు బేడీలు వేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. గత శనివారం చేసిన చలో గుంటూరు జైలు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. మహిళల పై పోలీసులు ప్రవర్తించిన తీరు అందరూ చూసారు. అయితే ఇదంతా విధుల్లో భాగంగా చేసామని పోలీసులు అంటున్నారు. ఇది ఇలా ఉంచితే, మూడు రాజధానులకు మద్దతుగా అంటూ, కొంత మందిని ఆటోల్లో వేరే ప్రాంతం నుంచి తరలించి, అమరావతికి తీసుకుని వచ్చి ధర్నా చేపించే క్రమంలో, మీరు మా ఊరు ఎందుకు వచ్చి ధర్నా చేస్తున్నారు అంటూ, కొంత మంది రైతులు వారిని అడ్డుకున్నారు. అయితే దీని పై కేసు పెట్టటంతో, అమరావతి రైతుల పై ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసారు. దళితుల పైనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయటంతో అందరూ ఆశ్చర్య పోయారు. అయితే వీరిని నరసరావుపేట నుంచి గుంటూరు జైలుకు తీసుకుని వచ్చే సమయంలో రైతుల చేతులకు సంకెళ్ళు వేసి తీసుకువచ్చారు. దీంతో ఈ సంఘటన పెద్ద దుమారం రేపింది. అయితే దీని పై స్పందించిన జిల్లా ఎస్పీ కొంత మంది పోలీసుల్ని సస్పెండ్ చేసారు. అయితే రెండు రోజులకే వారి పై సస్పెన్షన్ ఎత్తి వేసారు. ఇక మరో పక్క, రైతులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ వారికీ బెయిల్ రాలేదు.

humanrights 09112020 2

దీంతో వారు హైకోర్టుకు వెళ్ళారు. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉంది. ఇది ఇలా ఉంటే, రైతులకు బేడీలు వేసిన సంఘటన మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అంటూ, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మొత్తం ఘటన పై స్పందించిన నతిఒన హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆ ఫిర్యాదుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి పంపి, ఈ పూర్తీ ఘటన పై చర్యలు తీసుకుని, 8 వారాల్లో తమకు నివేదిక ఇవ్వాలని, అలాగే ఏమి చర్యలు తీసుకున్నారో, పిటీషనర్ కు తెలపాలని ఆదేశాలు జారీ చేసారు. అక్రమ అరెస్ట్ లు చేసి, బేడీలు వేసి, ఉద్యమం చేస్తున్న వారిని భయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసారు. మొదటి ఐపిసి సెక్షన్ల కింద కేసులు పెట్టి, తరువాత దీన్ని ఎస్సీ ఎస్టీ కేసుగా మార్చారని, దీని వెనుక రాజకీయ నాయకులకు హస్తం ఉందని ఫిర్యాదులో తెలిపారు. అసలు ఎస్సీల పైనే, ఎస్సీ, ఎస్టీ ఆక్ట్ పెట్టటం ఎక్కడ ఉండదని అన్నారు. అలాగే రైతులకు బేడీలు వేయటం, సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం అని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. మరి డీజీపీ గారు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read