జగన్ మోహన్ రెడ్డి నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ లోని జగన్ నివాసం అయిన లోటస్ పాండ్ ముందు, ఈ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిందూ దేవుళ్ళ పై, అలాగే వెంకటేశ్వర స్వామి పై విశ్వాసం ఉందని ఇచ్చే డిక్లరేషన్ అవసరం లేదు అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పై భజరంగ్‌దళ్‌ఆందోళన చేసింది. నిన్న సాయంత్రమే భజరంగ్‌దళ్ జగన్ ఇంటిని ముట్టడిస్తాం అని చెప్పినా, ఈ రోజు వాళ్ళు లోటస్ పాండ్ వద్ద ఆందోళన చెయ్యగలిగారు భజరంగ్‌దళ్ కార్యకర్తలు. జగన్ ఇంటిని ముట్టడించటంలో సక్సస్ అయ్యారు. దాదాపుగా 300 మంది పోలీసులు ఉన్నా, భజరంగ్‌దళ్ ఆందోళన చేసింది. జగన్ నివాసానికి 200 మీటర్ల దూరంలోనే బ్యారికేడ్ లు ఏర్పాటు చేసినా, భజరంగ్‌దళ్ కార్యకర్తలు దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి నాని రాజీనామా చెయ్యాలని, జగన్ ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అలాగే ఈ రోజు తిరుమల వెళ్తున్న జగన్, అక్కడ సంతకం పెట్టే వెళ్ళాలని నినాదాలు చేసారు.
దీంతో పోలీసులకు, భజరంగ్‌దళ్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారిని అరెస్ట్ చెస్ ప్రయత్నం చేస్తున్నారు. అయితే భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ లో కాకుండా, తెలంగాణాలో చేయటం పై కూడా విమర్శలు వస్తున్నాయి. జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో అయితే, అలాగే జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంటుంటే, వీరు మాత్రం, హైదరాబాద్ లో అందోళన చెయ్యటం పై పలు విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ఒత్తిడి తేవాలి అంటే ఇక్కడ చెయ్యాలి కానీ, అక్కడ ఏమిటి అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా, జగన్ మోహన్ రెడ్డి, ఆయన మంత్రి వర్గ సభ్యులు కొంత మంది, లేని వివాదం రేపి, చిన్న విషయంతో పోయే దాన్ని, ఇక్కడ వరకు తెచ్చుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరో పక్క ఇప్పటి వరకు జగన్ ఖండించటం కానీ, కొడాలి నాని క్షమాపణ చెప్పకుండా, నేను ఇలాగే మాట్లాడతా అని మరోసారి మీడియా ముందుకు రావటం, కావాలనే ఇలా చేస్తున్నారా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.