రాజధాని రైతులు అనేక పిటీషన్ల రూపంలో, హైకోర్టు గడప తొక్కిన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి ప్రతి రోజు విచారణ జరుగుతుందని, అందరూ భావించారు. అయితే ఈ రోజు టెక్నికల్ సమస్యలు రావటంతో, విచారణను హైకోర్టు అక్టోబర్ 5 కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు విచారణలో వచ్చిన అంశాల పై హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు, మీడియాకు వివరించారు. ఈ రోజు నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభం అవుతుందని, న్యాయవాదులు అందరూ వచ్చాం అని కానీ, ఈ రోజు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కుదరలేదని అన్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కోర్టులోనే విచారణ చెయ్యటం సాధ్యం కాదని, ఆన్లైన్ లోనే విచారణ చెయ్యాలని, కొంత మంది న్యాయవాదులు కోరారు. అయితే ఈ అంశం పై, ఎక్కువ పిటీషన్లు ఉన్నాయి కాబట్టి, ప్రతి పిటీషన్ పై, కోర్టులో విచారణ చెయ్యాలంటే, ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం అని, చాలా సమస్యలు వస్తాయని, ఇంకా కోర్టులోనే విచారణ చెయ్యాలి అంటే, లోకల్ గా ఉండే వారిని కోర్టు కు పిలిచి, బయట నుంచి వచ్చే వారికి ఆన్లైన్ లోనే విచారణ చేసే హక్కు ఇవ్వాలని, కొంత మంది న్యాయవాదులు, కోర్టుని కోరారు.

అయితే ఈ అమరావతి పిటీషన్ల పై రకరకాల పిటీషన్లు ఉన్నాయని, అన్నీ ఒకే గాటిన కాకుండా, విభజన చేసి ఈ కేసులు విచారణ చెయ్యాలని కూడా కొంత మంది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక ఈ రోజు విచారణ గురించి మాట్లాడుతూ, స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చినా విశాఖలో గెస్ట్ హౌస్ కడుతున్నారు అనే అంశం పై, కంటెంప్ట్ అఫ్ కోర్ట్ వెయ్యటంతో, దాని పై కౌంటర్ దాఖలు చెయ్యమని గతంలో కోర్ట్ చెప్పింది. అయితే ఈ రోజు కౌంటర్ దాఖలు చెయ్యలేం అని, మరి కొంత సమయం కావాలని చీఫ్ సెక్రటరీ కోర్టుకు తెలిపారు. ఇదే సందర్భంలో అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, విశాఖలో గెస్ట్ హౌస్ కి రాజధానికి సంబంధం లేదని, అక్కడ రాజధానికి వెళ్ళినా వెళ్లకపోయినా, గెస్ట్ హౌస్ కడతామని తెలిపారు. అయితే ఇవన్నీ పరిశీలించిన న్యాయస్థానం, అక్టోబర్ 5 కు కేసుని వాయిదా వేసింది. అక్టోబర్ 5 వరకు స్టేటస్ కో ఉంటుందని, అక్టోబర్ 5 న పరిస్థితిని బట్టి, కోర్టులోనే విచారణ చేస్తామా లేదా అనేది, ఆ రోజు పరిస్థితిని బట్టి చెప్పే అవకాసం ఉంది. పరిస్థితి అనుకూలిస్తే, అక్టోబర్ 5 నుంచి రోజు వారీ విచారణ చేసే అవకాసం ఉంది.

కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళ పై మాట్లాడుతున్నారు అంటే, దాని వెనుక ఉన్న శక్తి మరొకటి ఉంది అంటూ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. కొడాలి నాని వెనుక ఒక శక్తి ఉందనే విషయం గ్రహించాలని అన్నారు. ఆ శక్తి ఎవరో తెలుసుకోవటానికి పెద్ద భీబత్సమైన తెలివి తేటలు అవసరం లేదని అన్నారు. గతంలో తనను తిట్టాలి అంటే, తన కులం వారిని ఎలా ఉసుగొలిపారో, అలాగే హిందువుల పై హిందువులతో దాడి చేస్తున్నారని అన్నారు. కొడాలి నాని మాట్లాడుతూ, ఏ విగ్రహం విరిగిపోతే ఏమవుతుంది ? ఎవరికి నష్టం అంటూ ఆయన మాట్లాడారు, ఆయనకు నేను చెప్తున్నా, దేవుడికి నష్టం ఉండదు కానీ, విశ్వసించే మాకు నష్టం, హిందువులకు నష్టం అని అన్నారు. దేవాలయాల పై దాడులు చేస్తూ, మా హిందువుల మనసులను గాయ పరుస్తున్నారని అన్నారు. మీరు కూడా ఆ గాయాలే చేస్తున్నారని, మతోన్మాదంతో చేస్తున్న ఈ గాయాలకు తగిన శిక్ష అనుభవిస్తారని అన్నారు. నేను పార్లమెంట్ లో మా ప్రభుత్వం ఏమైతే సిబిఐ ఎంక్వయిరీ అడిగిందో, అదే నేను అడిగితే, మీ సాటి మతస్తుడుతో నా పై దాడి చేసారని అన్నారు.

ప్రభుత్వాన్ని నడుపుతున్న వారు ఆలోచించాలని, ఒక కులం వారి పై బురద చల్లాలి అంటే, అదే కులం వారితో, అలాగే ఒక మతం పై దాడి చెయ్యాలి అంటే, అదే మతం వారితో దాడి చేపిస్తున్నారని, ఇది అత్యంత హేయమైన చర్య అని అన్నారు. మీ బంధువునే అక్కడ పెట్టి, స్వామి డబ్బు పై కన్ను వేసారని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఎండోమెంట్స్ శాఖలో, ఇద్దరు సీనియర్ అధికారులను ఎందుకు మార్చారు ? హిందువుల మనోభావాలను కించ పరిచే విధంగా, హేయమైన విధంగా, క్యాబినెట్ మంత్రితో మాట్లాడించటం హేయం అని అన్నారు. ప్రతి మాతానికి రూల్స్ ఉంటాయని, అవి పాటిస్తేనే వెళ్ళనిస్తారని అన్నారు. మక్కాకు వెళ్ళాలి అంటే, ముస్లింలు మాత్రమే వెళ్ళాలని, మీ ఇష్టం అంటే కుదరదు అని అన్నారు. కొడాలి నాని గారి మాటలు చాలా దారుణం అని, ఈ ధోరణి మార్చుకోవాలని, ఆ అదృశ్య శక్తి కూడా మారాలని అన్నారు.

ఈ రోజు పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. సహజంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసే ప్రసంగాన్ని వైసీపీ నేతలు అడ్డుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అందుకు భిన్నంగా సొంత పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారు. రఘురామ రాజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఒక పధ్ధతి ప్రకారం దాడి జరుగుతుంది అని అన్నారు. అలాగే కేవలం ఒక వ్యక్తి కోసం ఏకంగా హిందూ దేవాలయాల రూల్స్ మార్చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రఘురామరాజుకి వైసీపీ ఎంపీలు అడ్డు తగిలారు. ప్రస్తుతం జరుగుతున్న సభలో సభ్యులు కూర్చుని మాట్లాడుతున్నారు. అయితే, ఆయనకు అడ్డుగా వైసిపీ ఎంపీలు రావటంతో, రఘురామరాజు పైకి లెగిసి ప్రసంగించారు. అయినా ఎంపీలు అడ్డు తగలటంతో, రఘురామరాజు "ఏమి మాట్లాడాలి, మీరు నాకు చెప్తారా" అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దారుణాల పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని అన్నారు.

రఘురామరాజు మాట్లాడుతూ, "నేను ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జరుగుతున్న ఒక అతి ముఖ్యమైన విషయం పై పార్లమెంట్ దృష్టికి తేవాలని అనుకుంటున్నాను. హిందూ దేవాలయాల పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పద్దతి ప్రకారం దాడులు జరుగుతున్నాయి. అందుకే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులు గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పై జరుగుతున్న దాడులను రక్షించుకోవటానికి, ఒక హిందూ కమిషన్ లేదా ధార్మిక కమిషన్ ఉండాలి. ముస్లిం మైనారిటీ, లేదా క్రీస్టియన్ మైనారిటీలు ఎదుర్కుంటున్న సమస్యల కోసం, ఎలా అయితే కమిషన్ ఉందో, అలాగే హిందూ దేవాలయాలకు కూడా ఒక కమిషన్ ఉండాలి. హిందువులకు కూడా కమిషన్ ఉండాలి. ఎందుకంటే తిరుమలలో ఏకంగా కేవలం ఒక వ్యక్తి కోసం, రూల్స్ మార్చేస్తున్నారు. కేవలం ఒక్కడి కోసం, రూల్స్ మార్చేస్తున్నారు. హిందూ దేవాలయకు ఏది రక్షణ" అంటూ రఘురామరాజు పార్లమెంట్ లో తన వాణి వినిపించారు.

గత 280 రోజులుగా అమరావతి పరిరక్షణ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అమరావతిలో ఈ 280 రోజులుగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. నిర్బంధాలు, లాఠీ ఛార్జ్ లు, వేధింపులు, కేసులు, ఇలా అనేక కష్టాలు ఎదుర్కున్నారు. ఇన్ని చేసినా, ప్రభుత్వం మాత్రం, వీరితో ఇప్పటి వరకు ఎలాంటి చర్చలకు రాలేదు. ఒక వైపు ఉద్యమం కొనసాగిస్తూ, ప్రజా ఉద్యమం చేస్తూ ఉండగానే, మరో పక్క న్యాయ పోరాటం కూడా రైతులు చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి పై అనేక కేసులు కోర్టులో నమోదు అయ్యాయి. రైతుల తరుపున, అమరావతి పరిరక్షణ సమితి తరుపున, రాజకీయ పక్షాల తరుపున, ఇలా అనేక మంది తమ పిటీషన్లు హైకోర్టులో వేసారు. రైతులు అగ్రిమెంట్ ప్రకారం కోర్టుకు వెళ్తే, విభజన చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, అలాగే శాసనమండలిలో జరిగిన పరిణామాలు ప్రకారం, ఇలా రకరకాలుగా కేసులు హైకోర్టులో పడ్డాయి. గత నెలలో అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, బిల్ ని గవర్నర్ ఆమోదించటం పై, హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా హైకోర్టు స్టేటస్ కో ఇస్తూ, రెండు సార్లు వాయిదా వేసింది. రెండో సారి విచారణ వేసి, సెప్టెంబర్ 21కి వాయిదా వేసారు. అయితే ఈ రోజు నుంచి అమరావతి కేసులలో పురోగితి కనిపించే అవకాసం ఉంది. ఈ రోజు అమరావతి రైతులతో పాటుగా, వివిధ పక్షాలు వేసిన పిటీషన్ పై హైకోర్టులో రోజు వారీ విచారణ జరిగే అవకాసం ఉంది. ఈ రోజు హైకోర్టు ముందుకు 93 పిటీషన్లు విచారణకు రానున్నాయి. ఈ కేసులు అన్నీ వివిధ రకాల కేసులు, సిఆర్డీఏ అగ్రిమెంట్ ఉల్లంఘించటం పై, జీఎన్ రావు, బోస్టన్ కమిటీ చట్టబద్దత, మాస్టర్ ప్లాన్ ఉల్లంఘన, అమరావతిలో 144 పెట్టి నిర్బందించటం, ఇలా వివిధ రకాల కేసులు, ఈ రోజు హైకోర్టు ముందు విచారణకు రానున్నాయి. ఈ కేసులు అన్నీ, ఆన్లైన్ లోనే హైకోర్టు విచారణ చేయ్యనుంది. ఈ రోజు నుంచి రోజు వారీ విచారణ జరుగుతుందనే ఊహగానాల మధ్య, కోర్టు విచారణ పై ఆసక్తి నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read