అమ్మోనియం నైట్రేట్ నిల్వలనుంచి విశాఖను కాపాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అమ్మోనియం నైట్రేట్ బహుళార్థ ప్రయోజనాలు కలిగినరసాయనం అని దీనిని జాగ్రత్త గా వాడుకుంటే ప్రగతి ఫలాలు అందిస్తుందని, అయితే ఏ మాత్రం అజాగ్రత్త చేసినా.. ఊహించని విధ్వంసాన్ని సృష్టిస్తుందని హెచ్చరించారు. ఈ సంద ర్భంగా లెబనాన్‌లో పేలిన విధ్వంసాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రమాదంలో 158 మంది మరణించగా 4 వేలకు పైగా తీవ్రంగా గాయపడ్డారని కోట్ల రూపా యల ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన నగరంలోని జనాభాలో సగానికి పైగా జీవితాలు కకావికలం అయ్యాయని వెల్లడించారు. సుమారు 200 కిలోమీటర్ల మేర పేలుడు శబ్దం వినిపించిందన్నారు. రిక్టర్ స్కేలులో బీరూట్ నగరంలో ప్రకంప నలు 3.3గా నమోదయ్యా యని తెలిపారు. ఇది ఒక మోస్తరు భూకంపం వంటిదని చిన్న దేశమైన లెబనాన్ కోలుకోవడానికి దశాబ్ద కాలం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ప్రస్తుతం విశాఖలో 19,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నిల్వలు ఉన్నాయని బీరూట్ నగరంతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువని తెలిపారు. విశాఖ నగరంలో అమ్మోనియం నైటైట్ పేలుళ్లు జరిగితే పరిస్థితి ఊహించుకోవడానికే ఒళ్లు గగ్గురుపు డుతోందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత ప్రమాదకరమైన రసాయనాన్ని కేవలం విశాఖ పోర్టు ద్వారా దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. విశాఖ కేంద్రంగా అమ్మోనియం నైట్రెట్ దేశ మంతటికీ సరఫరా అవుతుందని వెల్లడించారు. అమ్మోనియం నైటైటి నిల్వలకు 7 గోదాములు విశాఖ లో ఉన్నాయని బీరూట్ ప్రమాదం తరువాత వీటిని పరిశీలించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ రసాయనం కారణంగా ఒక్క ప్రమాదం కూడా జరగలేదని 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని భయం అవసరం లేదని అధికారులు చెబుతున్నారని అయితే కీడెంచి మేలెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ప్రభుత్వాలు, అధికారులు అమ్మోనియం నైటైటి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరి కలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో విశాఖలో చిన్న చిన్న తప్పిదాల వల్ల పెద్ద, పెద్ద పారిశ్రామిక ప్రమాదాలు చోటుచేసు కుంటున్నాయని ఈ నేపథ్యంలో అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. బీరూట్‌లో ప్రమాదం జరిగినప్పుడు 270 డిగ్రీల ఉష్ణోగ్రతలు లేవని అటువంటప్పుడు ప్రమాదం ఏ విధంగా సంభవించిందో అధికారులు ఆలోచిం చాలని హితువు పలికారు. ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలను ఉంచ కుండా వికేంద్రీకరణ జరపడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలని ఉదాసీనంగా వ్యవహరిస్తే జరగరానిది జరిగితే నష్టాన్ని అంచనా వేయడానికే భయమేస్తోందన్నారు. మరోవైపు విజయవాడ శివారులోని కొండ పల్లిలో కూడా 100 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నట్లు మీడియా ద్వారా తెలిసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గుండెల మీద నిప్పుల కుంపటితో ఉన్న విశాఖ రక్షణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పవన్ కళ్యాణ్ కోరారు.