ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా, ఒక ఎమ్మెల్యేకు క-రో-నా పాజిటివ్ సోకింది. విజయనగరం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యే గన్ మెన్ కు కూడా సోకింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక శాసనసభ్యుడికి కరోనా సోకడం ఇదే ప్రధమం. అంతే కాకుండా ఆయన గన్‌మెను కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే తన వ్యక్తిగత పని నిమిత్తం ఇటీవల అమెరికా వెళ్లి కొన్నాళ్లు అక్కడ ఉన్నారు. తిరిగి కొద్ది రోజుల క్రితమే జిల్లాకు చేరుకున్నారు. అనంతరం కొన్నాళ్లు ఐసోలేషన్లో ఉన్నారు. అయితే గతంలో ఆయనకు పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. కాని ఇటీవల కొంచెం నలతగా ఉండటంతో, ఆయన ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోగా, రెండు పరీక్షలలోను కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడే ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వార్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ కు గురి చేసింది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఇటీవలే, రాజ్యసభ ఎన్నికల్లో కూడా పాల్గున్నారని తెలుస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవటంతో పాటుగా, మాక్ పోలింగ్ తదితర అంశాల్లో కూడా ఈయన పాల్గున్నారు.
దీంతో, ఈయనతో సన్నిహితంగా మెలిగిన ఎమ్మెల్యేలు ఇప్పుడు టెన్షన్ కు గురి అవుతున్నారు. కొంత మంది తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ముందుగానే టెస్టులు చేపించుకుంటున్నారు. ఇటీవలే తెలంగాణాలో వరుస పెట్టి ఎమ్మెల్యేలకు పాజిటివ్ వస్తూ ఉండటంతో, ఇప్పుడు ఏపిలో కూడా మొదటి కేసు వచ్చింది. ఇక అమరో పక్క ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా వైరస్ పాజిటివ్ కేసులు మొత్తంగా 9372కి చేరుకున్నాయి. ఈ సంఖ్య ఇప్పటికి రోజువారి నమోదవుతున్న క-రో-నా కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కటి, రెండు రోజుల్లో 10వేలకు దగ్గరవుతుండటంతో ప్రజల్లోను, అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమతోంది. లాక్ డౌన్ నిబంధనలు తొలిగించిన నేపథ్యంలో కేసులు పెరిగి పోతున్నాయని అంటున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 443 క-రో-నా పాజిటీవ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇక కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలో మొత్తం 7451, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1584, విదేశాలనుంచి వచ్చిన వారిలో 337 మందిలో క-రో-నా పాజిటివ్ కేసు లు గుర్తించారు.