2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి, అనూహ్య విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు, చంద్రబాబు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అందేలా చేసినా, అభివృద్ధి కళ్ళ ముందు కనిపించినా, పునాదుల్లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ని, 72 శాతం పూర్తి చేసినా, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్డు, డ్రైనేజి వేసినా, చంద్రబాబుని ఓడించి, జగన్ కు భారీ గెలుపు కట్ట బెట్టారు ప్రజలు. 151 సీట్లతో, జగన్ అనూహ్య గెలుపు సాధించారు. గత ఏడాది కాలంలో, జగన్ మోహన్ రెడ్డి పాలన పై అటు ప్రజలు ఇబ్బందులు, ఇటు ప్రతిపక్షం పోరాటాలతో గడిచి పోయాయి. ఇసుక లేక ఆరు నెలలు ఇబ్బంది పడితే, మూడు నెలలు రాజధాని గొడవ, మరో మూడు నెలలు కరోనాతో జీవితాలు అల్లకల్లోలం అయిపోయాయి. పనులు లేవు, అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి. ఈ అసంతృప్తిని, 87 వేల కోట్లు అప్పు తీసుకొచ్చి, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి, చల్లార్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. మరో పక్క అభివృద్ది అనే మాటే లేదు. ఈ తరుణంలో, సొంత పార్టీలోనే ధిక్కార స్వరం మొదలైంది. ఏడాది కాలంగా, ఉగ్గ పెట్టుకున్న కోపం అంతా, నెమ్మదిగా బయటకు వస్తుంది, త్వరలోనే ఇది మరి కొంత మందికి పాకి, బద్దలవుతుంది అనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి, ఎవరినీ కలవరు అని, ఎవరి మాట లెక్క చెయ్యరు అని, ఎవరి సలహాలు తీసుకోరు అని, అసలు తమకు లెక్క చెయ్యటం లేదని, సీనియర్లకు లోలోపలు ఉన్న ఫీలింగ్. అడపాదడపా ఇది బయట పడుతూనే ఉంది. 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్న తమను కాదని, నిన్న కాక మొన్న వచ్చిన వారికీ, అవగాహన లేని వారిని అందలం ఎక్కిస్తున్నారనే కోపం సీనియర్లకు ఉంది. ఇక జగన్ వ్యవహార శైలితో కూడా వీళ్ళు విసుగు చెందారనే టాక్ నడుస్తుంది. ఏడాది కలాంలో అడపా దడపా వినిపిస్తున్న ఈ ధిక్కార స్వరం, వారం రోజులుగా ఎక్కువ అయ్యింది. వినుకొండ ఎమ్మెల్యే, బహిరంగంగా, రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతున్న తీరు పై గళం ఎత్తారు, ఇసుక రీచ్ నుంచి, ఎక్కడికి వెళ్తుందో అర్ధం కావటం లేదని, గరమల్లో గుప్పెడు ఇసుక కూడా ఇవ్వలేక పోతున్నాం అన్నారు.

ఇక మరో ఎమ్మెల్యే, 'జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఈ జిల్లాలో పాలనా వ్యవస్థ పూర్తిగా దారి తప్పింది. దీన్ని బాగు చేసేందుకు ఎవరో ఒకరు రావాల్సిన అవసరం ఉంది. సరిచేయకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు.' అని సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇక నిన్న నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రాంనాయరణ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏడాది కేకు సంబరాలు తప్ప, అభివృద్ధి ఏది, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు, ఇంకో ఏడాది చూస్తా, ఇలాగే ఉంటే ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు, ఇళ్ళ స్థాలల్లో అవినీతి, రాష్ట్రంలో మత మార్పిడులు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆర్డినెన్స్, తిరుమల భూవివాదం, ఇలా అన్నిటి పై, సొంత ప్రభుత్వం పైనే ఎదురు తిరుగుతున్నారు. ఇక గతంలో స్పీకర్ తమ్మినేని, నాటు సారా మాఫియా పై చేసిన వ్యాఖ్యలు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీళ్ళు అమ్ముకున్నారు అనే ఆరోపణలు, కరెంటు బిల్లుల పెరుగుదల పై, విజయనగరం జిల్లా సాలూరు వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొర వ్యాఖ్యలు, ఇలా చాలా మంది ఎదురు తిరుగుతున్నారు. మరి ఈ అసంతృప్తులను జగన్ అణిచివేస్తారా, లేదా పార్టీ పై పట్టు కోల్పోతారా అనేది, కాలమే సమాధానం చెప్పాలి.

ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీని పోలిన రంగులు వేయడాన్ని తప్పుపడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ బుధవారం తీర్పును ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులను నాలుగు వారాల్లో తొలిగించాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన అధికార పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ జెండాను పోలిన రంగులను తొలిగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిటన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లో రంగులను తొలిగించకుంటే కోర్టు దిక్కారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. మొత్తం 7 పేజీల తీర్పులో, సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు తరువాత రంగులు తొలిగించకుండా తప్పు చేసారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక సారి జీవో కొట్టివేసిన తరువాత మళ్ళీ వేరే రంగు జతచేసి జీవో ఎందుకు తెచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కోర్టు తీర్పులు అమలు చెయ్యకపోతే, అది న్యాయస్థానాల ప్రతిష్టను దిగజారుస్తాయని కోర్టు ఘాటుగా చెప్పింది.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులకు వేసే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో సంఖ్య 623ని న్యాయస్థానం రద్దు చేసింది. అయితే ఇదే సందర్భంలో, ప్రభుత్వం తరుపు న్యాయవాది చేసిన వాదనలను, సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. మూడు రంగులకు తోడు, మట్టి రంగు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించి జీవో ఇచ్చాం కాని, ఎక్కడా రంగులు వెయ్యలేదు అంటూ, ప్రభుత్వం వాదించటంతో, సుప్రీం సీరియస్ అయ్యింది. ఆదేశాలు అయితే ఇచ్చి జీవో ఇచ్చారు కదా, మొత్తం రంగులు వేసే దాకా, చూస్తూ ఉండమంటారా ? అయినా మూడు రంగులు అలాగే ఉంచి, మరో రంగు జోడించటం, కోర్టు దిక్కరణ అవుతుంది కదా అని కోర్టు ప్రశ్నించింది. అలాగే, తమకు లాక్ డౌన్ అయిన తరువాత, మూడు వారాల్లో రంగులు తొలగించమని హైకోర్టు చెప్పింది అని, అయినా ఇప్పుడే తమ పై కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు వెళ్ళింది అని చెప్పగా, రెండు వారాల్లో మీరు రంగులు తీస్తారా అని సుప్రీం అడగగా, నాలుగు వారాలు గడువు కావాలని ప్రభుత్వం కోరటంతో, సుప్రీం కోర్టు ఒప్పుకుంది.

మే 7 న జరిగిన విశాఖపట్నం గ్యాస్ లీక్ ఫలితంగా జరిగిన పర్యావరణ నష్టం, ప్రాణ నష్టానికి పూర్తి బాధ్యత, దక్షిణ కొరియా కంపెనీ ఎల్జీ పాలిమర్స్ అని, జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత ఎల్జీ పాలిమర్స్ కే ఉంది అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఈ రోజు తేల్చి చెప్పింది. ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులో, ముందస్తుగా విశాఖపట్నం జిల్లా మేజిస్ట్రేట్ ముందు రూ .50 కోట్లు జమ చేయాలని ఎన్జిటి కంపెనీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, జమ చేసిన ఈ మొత్తాన్ని, పర్యావరణ పునరుద్ధరణకు మరియు బాధితులకు పరిహారం కోసం ఉపయోగించాలని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. 30 కోట్లు ప్రభుత్వం పరిహారం కింద జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మొత్తం పరిహారం, ఆ కంపెనీనే భరించాలి అంటూ, ఎన్జీటి స్పష్టం చేసింది. అయితే ఇదే సందర్భంలో, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటాగా తీసుకోవటం పై, ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం చెప్పటం పై, గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎన్జిటి ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ అని, పర్యావరణ ప్రమాదాల జరిగినప్పుడు, చూస్తూ కూర్చోం అని, సుమోటోగా తీసుకోవడానికి అధికారం ఉందని, ఉత్తర్వులను సమర్థవంతంగా పాస్ చేయగలదని ఎన్జీటీ చెప్పింది. ఇటువంటి పర్యావరణ విషాదాల బాధితులు అట్టడుగు వర్గాలకు చెందిన వారు అయినప్పుడు ఈ విస్తృత అధికారాలు మరింతగా ఉపయోగిస్తాం అని ట్రిబ్యునల్ తెలిపింది. ఇటువంటి సందర్భాల్లో, ఇది ట్రిబ్యునల్ కు ఉన్న అధికారం మాత్రమే కాదు, సమర్థవంతమైన పరిహారం కోసం అటువంటి అధికారాన్ని ఉపయోగించడం మా విధి అని ఎన్జీటీ చెప్పింది. వైజాగ్ గ్యాస్ లీక్ వంటి కేసులలో తన పాత్ర పై గట్టిగా చెప్పింది ఛైర్మన్ జస్టిస్ ఎకె గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం. ఇతర వేదికల ముందు గ్యాస్ లీక్ కేసుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విచారణ పై, ఎన్‌జిటి విచారణ ప్రభావం చూపదు అని, వాటి పరిధిలో , వాటి విచారణ జరుగుతుంది అని తేల్చి చెప్పింది.

పునరుద్ధరణ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF & CC), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) మరియు ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం నుంచి, ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. ఈ కమిటీ, ప్రణాళికను రెండు నెలల వ్యవధిలో సిద్ధం చేయాలని ఎన్‌జిటి ఆదేశించింది. చేసిన అంచనా, పునరుద్ధరణ ప్రణాళిక ఆధారంగా, ఫైనల్ గా పరిహారం లెక్కించబడుతుందని ఎన్జీటీ చెప్పింది. ఇక తరువాత, చట్టబద్ధమైన అనుమతులు లేకుండా పనిచేయడానికి సంస్థకు అనుమతించడంలో చట్ట వైఫల్యానికి కారణమైన వ్యక్తుల పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వచ్చే విచారణను, నవంబర్ 3వ తేదీకి, ఎన్జీటీ వాయిదా వేసింది.

ప్రసిద్ధ హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దల , ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. ప్రచురణ విభాగం ఉద్యోగుల నిర్లక్ష్యం వెరసి సప్తగిరి మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం రాయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ విషయంపై అటు శ్రీవారి భక్తులు ఇటు హిందు ఆధ్యాత్మిక సంస్థలు, బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో నిరసన తెలియజేస్తున్నారు. ఈ తప్పి దంతో మరోసారి టిటిడి వివాదాలను కొనితెచ్చు కొన్నట్ల య్యింది. తిరుమల తిరువతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలవారీగా ఆధ్యాత్మిక భక్తి ప్రధానమైన విషయాలతో, తిరుమల ఆలయంతో బాటు టిటిడి అనుబంధ ఆలయాల్లో జరిగే కైంకర్యాలు, విశేషాలతో భక్తులకు సమాచారాన్ని తెలిసేలా సప్తగిరి మాసపత్రికను ఐదు భాషల్లో ముద్రించి పంపిణీ చేస్తుంది. నెలవారీగా హిందు ఆధ్యాత్మిక విషయాలు, ఆలయాల్లో కార్యక్రమాల ప్రచురణకు ప్రాధాన్యతనిస్తుంది. తాజాగా టిటిడి ప్రచురించి మార్కెట్లోకి విడుదల చేసిన ఏప్రిల్ నెల సప్తగిరి మాసవత్రికలో వివాదం రేగింది.

రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం రాశారంటూ తిరుపతిలో బిజెపి నాయకులు మంగళవారం టిటిడికి చెందిన శ్రీకోదందరామాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. శ్రీసీతారాములకు లవుడు ఒక్కడే కుమారుడని, కుశుడు దర్భతో వాల్మీకి ప్రాణం పోసి చేసిన బొమ్మ అంటూ జానపథకథలో కథనం ప్రచురించారు. ఈ కథను తిరువతికి చెందిన తొమ్మిదోతరగతి బాలుడు పునీత్ రాశాడు. దీనిపై బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టిటిడి వంటి ధార్మిక సంస్థ వాల్మీకి రచించిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. జానపదాల్లో రకరకాల ప్రచారం పై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతుందని వారు నిరనన తెలిపారు. ఇదిలా వుండగా మాసపత్రిక ముద్రణ ఎడిటర్, సబ్ ఎడిటర్లు పర్యవేక్షిస్తారు. అలాంటిది ఇంతవరకు ఎంతో ప్రాధాన్యత వున్న సవగిరికి ఈ తప్పుడు కథనంతో పాఠకుల్లో నమ్మకం కోల్పోయి విశ్వాసం పోతుందని భక్తులు వాదనలు.

Advertisements

Latest Articles

Most Read