జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన ఏమి కాని, అటు ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచే కాదు, సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇదేమి పాలన అంటూ బహిరంగంగానే తిట్టి పోస్తున్నారు. నిన్న కాక మొన్న వినుకొండ ఎమ్మెల్యే, బోచ్చుడు ఇసుక కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు, ఇసుక లారీలు ఏమై పోతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే రఘురామకృష్ణ రాజు, ఇళ్ళ స్థలాల విషయంలో, లంచాల పై దుమ్మెత్తి పోశారు. అయితే, ఇప్పుడు మరో సీనియర్ నేత వంతు. వైసీపీ ఎమ్మెల్యే, రాజకీయాల్లో సీనియర్, మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి తన ప్రభుత్వం పైనే సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్టంలో, జిల్లాలో ఉన్న అధికార యంత్రంగం పై విరుచుకుపడ్డారు ఆనం. ఏడాది వైసీపీ పాలనలో, కేకు సంబురాలు బాగా చేసుకున్నారని, ఈ కేకు సంబరాలు తప్ప, తన నియోజకవర్గంలో అభివృద్ధి అయితే శూన్యం అంటూ, తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి ఈ ఏడాది కాలంలో జరగలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఆనం.

ముఖ్యమంత్రి లేకలు రాస్తేనే, దిక్కులేని పరిస్థితిలో ఉంటే ఎలా అని అన్నారు. ఇక్కడ మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రిని కూడా పట్టించుకోవటం లేదని అన్నారు. వైద్య రంగం, విద్యా రంగంతో పాటు, సంక్షేమ పధకాల పై అధికారులను నివేదికలు ఇవ్వమని అడిగినా, ఎవరూ పట్టించుకోవటం లేదని ఆనం అన్నారు. ఇక మరో పక్క, నెల్లూరు జిల్లాలో నీళ్ళు అమ్ముకోవటం పై, ఆనం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎస్‍ఎస్ కెనాల్‍ను, పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవటం లేదని అన్నారు. తాను 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆనం అన్నారు. నాకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని, 23 జిల్లాలకు మంత్రిగా చేసానని గుర్తు చేసారు. ఇంకో ఏడాది చూస్తానని, పరిస్థతి ఇలాగే కొనసాగితే, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనుకాడను అంటూ ఆనం సంచలన వ్యాఖ్యలు చేసారు.

పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు కలిగిస్తుందో రంగుల ఉదంతమే రుజువు.. రాజ్యాంగ ఉల్లంఘనలకు, కోర్టు ధిక్కారానికి, అహంభావానికి- మూర్ఖత్వానికి ఇదే ఉదాహరణ. ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండా రంగులు వేయడం వైసిపి మూర్ఖత్వానికి పరాకాష్ట. తాము చేసిందే రైటు అంటూ కోర్టుల్లో పెడ వాదనలు చేయడం, తప్పుడు జీవోలు ఇవ్వడం, వందల కోట్ల ప్రజాధనం వృధా చేయడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ ఉల్లంఘనలు, న్యాయ నిబంధనల (రూల్ ఆఫ్ లా) ఉల్లంఘన, కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించడం... ఏడాది పాలనలో వైసిపి ప్రభుత్వం నూరు తప్పులు చేసింది. శిశుపాలుడిని మించి పోయింది తప్పుల మీద తప్పులు చేయడంలో.. రంగులపై ఎంత డబ్బు వృధా చేశారు..? మొదట వైసిపి 3 రంగులు వేశారు. ఎవరో కోర్టుకెళ్తే రంగులు తొలగించమని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దానిపై వైసిపి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ తిరస్కరిస్తే మళ్లీ హైకోర్టుకు వచ్చారు. నాలుగో రంగు(మట్టి రంగు) అడుగున వేసి మళ్లీ మసిబూసి మారేడుకాయ చేయాలని చూశారు. రంగులకు వక్రభాష్యాలు చెప్పి కోర్టుల కళ్లుగప్పే ప్రయత్నం చేశారు. ఆ 4 రంగులు కూడా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

తీర్పు అమలు చేయలేదు కాబట్టి ‘‘కోర్టు ధిక్కరణ’’గా తీసుకుని సిఎస్, సెక్రటరీ, కమిషనర్ హాజరు కావాలని ఆదేశించింది. వైసిపి తప్పులకు ఉన్నతాధికారులు ముగ్గురూ కోర్టులో నిలబడ్డారు. మళ్లీ మూర్ఖంగా దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. నెలరోజుల్లో రంగులు తొలగించాలని ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మీ పార్టీ రంగులు వేయడానికి ఇంత దుర్మార్గమా..? హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ నెలల తరబడి తిరుగుతారా..? హైకోర్టు, సుప్రీంకోర్టు 2చోట్ల ‘‘కోర్టు ధిక్కరణ’’ ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకుంటారా..? కొట్టేస్తారని తెలిసి ఇన్ని జీవోలు ఇస్తారా..? ఇది ఉన్మాదం కాకపోతే ఏమిటి..? దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేసిన చరిత్ర లేదు. ఆ దురాలోచనే ఏ పార్టీ, ఏ నాయకుడు చేయలేదు. అన్నివర్గాల ప్రజలు హాజరయ్యే ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసే దుస్సంప్రదాయానికి ఎవరూ తెగించలేదు. అన్నివర్గాలకు న్యాయం చేసే తటస్థ వేదికలుగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయ భవనాలకు పార్టీ రంగులేయడం అనైతికం. అందరిదీ ఒకదారి అయితే వైసిపిది మరోదారి, అదే ‘‘అడ్డదారి-మాయదారి’’.

రంగులపై డబ్బులు వృధా..అడ్వకేట్లకు ఫీజులు వృధా..ఇప్పుడు తొలగించడానికి డబ్బులు వృధా..? ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు..? రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదనలకు రూ5కోట్ల ఫీజులు..ఇప్పుడీ రంగులపై వాదనలకు ఇంకెంత దుర్వినియోగం చేశారో..? ఇలా ఫీజులకు, రంగులకు, కూల్చివేతలకు ‘‘వేలకోట్లు వృధాకేనా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని’’ అడిగింది..? తప్పుచేసి, ఆ తప్పును దిద్దుకోకుండా, తప్పు మీద తప్పులు, ఇన్ని తప్పులా చేసేది..? మీరు చేసిన తప్పులకు ప్రజలు మూల్యం చెల్లించాలా..? మీ తప్పుడు పనులకు రాష్ట్రం నష్ట పోవాలా..? మీ మూర్ఖత్వానికి జనం జరిమానా చెల్లించాలా..? ఇది సరైంది కాదు. రంగులు వేసినందుకు, వాటిని తొలగించడానికి అయ్యే ఖర్చును వైసిపి నుంచే వసూళ్లు చేయాలి. గతంలో దీనిపై వాదనల సందర్భంగా కోర్టులు కూడా అదే చెప్పాయి. వృధా చేసిన ప్రజాధనాన్ని వైసిపి నుంచి, వాళ్ల తప్పులకు తందాన అనే అధికారుల నుంచి రాబట్టాలి. చేసిన తప్పుకు మూల్యం వైసిపినే చెల్లించాలి.

చట్టం, న్యాయం అనేది, ఎక్కడైనా ఒకటే, ఏ కోర్టుకైనా ఒక్కటే. జరిగిన తప్పు తెలుసుకోకుండా, చేసిన తప్పు చేస్తూ, మమ్మల్ని కోర్టులు తపు పడుతున్నాయి, లేకపోతే, ఎవరో మ్యానేజ్ చేసారు అని చెప్పి, గోల చెయ్యటం ఎంత వరకు సమంజసం. ఎవరైనా, నాది అధికారం అని చెప్పి, ప్రభుత్వ భవనాలకు, పార్టీ రంగులు వేస్తే, ఏ కోర్టు చూస్తూ ఊరుకుంటుంది. ఇప్పుడు అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పంచాయతీ భవనాలకు రంగులు వేస్తూ ఇచ్చిన జీవోని, ఒకటికి రెండు సార్లు హైకోర్ట్ కొట్టేసిన సంగతి తెలిసిందే. దీని పై కోర్టు ధిక్కరణ కేసు కూడా హైకోర్టులో మొదలైంది. అయితే, దీని పై, ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి అపీల్ చేసింది. ఈ రోజు సుప్రీం కోర్టు కూడా ఈ విషయం పై, విచారణ చేసి, రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో హైకోర్టులోనే కాకుండా, సుప్రీం కోర్టులో కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు 4 రంగులు వెయ్యటం సరికదాని కోర్టు స్పష్టం చేసింది. ఇవి పార్టీ రంగులు కాదని, ఇవి వేరే రంగులు అంటూ, ప్రభుత్వం చేసిన వాదన పై , సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ రంగులును నాలుగు వారాల్లో తొలగించాలని, సుప్రీం కోర్టు టైం ఇచ్చింది. హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో తీర్పు అమలు చేయకపోతే ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుంది అంటూ, సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఏపి ప్రభుత్వం వేసిన పిటీషన్ ను, సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇప్పటికీ ఈ అంశం పై రెండు సార్లు, సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. మేము కూడా మా సీజే ఫోటో సుప్రీం కోర్టు బయట పెట్టుకోమా ? కేంద్ర కార్యాలయాలు అన్నీ కాషాయం రంగు వేస్తే మీరు ఊరుకుంటారా అంటూ, సుప్రీం కోర్టు గతంలోనే, రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు చెప్పినా, ప్రభుత్వం మూడు రంగులకు, మరో రంగు జోడించి, రంగులు వేద్దాం అని ప్రయత్నం చేసి, మొన్న హైకోర్టు ఆగ్రహానికి, ఈ రోజు సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురయ్యింది. ఇక ప్రభుత్వానికి, రంగులు తియ్యటం మినహా మరో ఆప్షన్ లేదు. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద, ఆఫీసర్లు బుక్ అవుతారు.

తిరుమలలో స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారిని ఈ నెల8వ తేదీ నుంచి దర్శించుకునే భాగ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు మూడు నెలల క్రితం తిరుమల దేవస్థానంలోకి స్వామివారి దర్శనార్ధం భక్తులను అనుమతించని పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లాక్ డౌన్ నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చాయి. ఈ క్రమంలో భక్తులకు స్వామివారి దర్శనార్దం అనుమతిని ఇవ్వాలని దేవస్థానం కార్య నిరవ్వహణాధికారి(ఈవో) ప్రభుత్వానికి లేఖరాసారు. భక్తులకు భౌతికదూరం పాటించే విధంగా, శానిటైజేషన్,థర్మల్ స్క్రీనింగ్ తదితరంశాలను పాటింపచేస్తూ దర్శనం కల్పిస్తామని లేఖలో ఈవో పేర్కొన్నారు. భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా క్యూలైనులు ఏర్పాటుతో పాటుగా పలు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈవో రాసిన లేఖకు స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతించింది.

భక్తులను దర్శనానికి అనుమతించే ముందు తిరుమల, తిరుపతి దేవస్థానం ఉద్యోగులుతోను, స్థానికులతో ముందుగా ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. కనీసం 6 అడుగుల భౌతికదూరం పాఠిస్తూ దర్శనం కల్పిం చాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎన్. వి. ప్రసాద్ ఉత్తర్వులు జారీచేసారు. భక్తులు దర్శనానికి లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా ప్రభుత్వం అనుమతిని కల్పించడంతో తిరుమల తిరుపతి దేవస్ధానం క్యూలైన్లులో మార్పు చేసింది. వరుసల్లో భక్తులు నిలిచే సమయంలో వారి మధ్య భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా ఉండే విధంగా చర్యలు చేపట్టింది. గట్టిభద్రతా చర్యలు దాదాపు 75రోజుల తరువాత ఏడుకొండల వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి అనుమతినివ్వడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈనెల 8వతేదీ నుంచి ప్రయోగాత్మకంగా తొలి సారిగా భక్తులను ఆలయంలోనికి అనుమతించి , ఇష్టదైవం దర్శనం కల్పించనుండటంతో కొన్ని నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొంటున్నారు.

ప్రయోగాత్మక దర్శనంలో తొలుత టిటిడి ఉద్యోగులతో బాటు తిరుమల తిరుపతి స్థానికులకు అవకాశం కల్పించనుంది. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తులు తిరుమల ఆలయంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ, క్యూలైన్లో ముందుకు కదిలేలా కసరత్తు చేపట్టారు. తాజాగా మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎస్వి ప్రసాద్ ఉత్తర్వులు జారీచేయడంతో భక్తుల అనుమతికి అవకాశం లభించింది. కరోనా వైరస్ తగ్గు ముఖం వట్టినా ప్రముఖ వుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తులను అనుమతించి శ్రీవారి దర్శనం కల్పించే విషయంలో మాత్రం టిటిడి ఉన్నతా ధికారులు పక్కాగా నిబంధనలు పాటించను న్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్పు లు వైకుంఠం-1 క్యూకాంప్లెక్స్ క్యూలైన్లలో చేప ట్టారు. తిరుమలకు భక్తులు రావడం దగ్గర నుంచి గదుల బుకింగ్, స్వామివారి దర్శనం కల్పిం చడం, లడ్డూ ప్రసాదాల పంపిణీ ఇలా ప్రతి విషయంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు

Advertisements

Latest Articles

Most Read