ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరించిన నేపదంలో, వివిధ దేశాలు లాక్ డౌన్ కు వెళ్ళాయి. భారత దేశంలో కూడా, కరోనాని కట్టడి చెయ్యటానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని నిర్ణయం తీసుకుని, దేశం మొత్తం లాక్ డౌన్ విధించింది. గత రెండు నెలలుగా లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేసింది. ప్రజలను కూడా రూల్స్ ఫాలో అయ్యేలా చేసారు. ప్రజలు కూడా సహకరించారు. అయితే కొద్ది మంది, ఏదైనా అవసరాల కోసం రోడ్డు ఎక్కినా, వారిని బయటకు రానివ్వలేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అయితే ప్రజలే ఇలా పనులు అన్నీ మానుకుని, ఉపాధి మానుకుని, పనులు మానుకుని సహకరిస్తే, మన రాష్ట్రంలో నాయకులు మాత్రం, అందుకు భిన్నమైన పరిస్థతి. ప్రజలు బాగానే సహకరించినా, ఏకంగా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు రోడ్డులు ఎక్కి, హడావిడి చేసి, కోరోనా టైంలో ఇబ్బంది పెట్టారు. ఒకరు ట్రాక్టర్ ర్యాలీ చేస్తే, ఒకరు పూలు చల్లించుకున్నారు. మరొకరు కేంద్రం ఇచ్చిన డబ్బులు పంచిపెట్టారు, మరొకరు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
నిన్నటికి నిన్న, విశాఖపట్నంలో, ఎల్జీ పాలిమర్స్ కు పరిహారం పేరుతొ, డాన్స్ లు, కోలాటాలు, పాలాభిషేకాలు చేసుకుంటూ వెళ్లారు. అయితే ఇదే సమయంలో, తెలుగుదేశం నాయకులను మాత్రం కరోనా పేరుతొ బయటకు రానివ్వలేదు. నిమ్మల రామానాయుడు కలెక్టర్ వద్దకు వెళ్తుంటే అడ్డుకున్నారు, కొల్లు రవీంద్రను అడ్డుకున్నారు, మడ అడవులు నరికేవేత వద్దకు వెళ్తే అడ్డుకున్నారు, విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్దకు వెళ్తే అడ్డుకున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. దీంతో, ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో, ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే, లాక్ డౌన్ ఉల్లంఘించారో, వారి పై, హైకోర్ట్ లో కేసు వేసారు. కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు అంటూ, హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు.
ఈ పిటీషన్ పై ఈ రోజు హైకోర్ట్ విచారణ చేసింది. ప్రజా ప్రతినిధులు అయ్యుండి, మీరే రూల్స్ అతిక్రమిస్తే ఎలా అంటూ కోర్ట్ వారి పై ఆగ్రహం వ్యక్తం సెహ్సింది. నిబంధనలు ఉల్లంగించిన వారి పై, ప్రభుత్వం చర్య తీసుకోలేదు కాబట్టి, వీరి పై విచారణ ఎందుకు వెయ్యకూడదొ చెప్పాలి అంటూ, హైకోర్ట్ ప్రశ్నించింది. మీ పై విచారణ ఎందుకు జరపకూడదు అని కోర్ట్ ప్రశ్నించగా, ప్రభుత్వం తరుపు సమాధానం చెప్పటానికి కొంత టైం కావాలి అని చెప్పటంతో, కోర్ట్ కేసుని వచ్చే వారానికి వాయిదా వేసింది.మధుసూధన రెడ్డి, రోజా, వెంకట్ గౌడ్, విడదల రజని, సంజీవయ్యలు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, శ్రీదేవిలు పై హైకోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. మరి వచ్చే వాయిదాలో, ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుందో చూడాలి.