ఈ వైసిపీ పార్టీకి విజయవాడ ప్రజలు ఒకరకంగా కూడా కనిపించటం లేదు... రోజుకి ఒక డ్రామా ఆడుతూ, ప్రజలని పిచ్చోళ్లని చేస్తూ, నిజం అనుకునే లోప అబద్దం అంటారు, అబద్దం అనుకుంటే నిజం అంటారు... అసలు ఎవరు ఎవరి పక్షమో అర్ధం కాక, ఇటు ప్రజలు, అటు కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు... మొన్నటి మొన్న పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు అంటూ డ్రామా ఆడిన గౌతంరెడ్డి, నెల రోజుల క్రితం వైఎస్ జగన్ ను పాదయత్రలో కలవటం సంచలనం అయ్యింది... వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో, కాపుల ఆగ్రహానికి గురై, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ, అప్పట్లో వైసీపీ డ్రామా ఆడింది...
గౌతంరెడ్డి జగన్ ను కలిసిన్ వెంటనే, విజయసాయి వచ్చి, ఒక ప్రకటన విడుదల చేసారు... గౌతమ్‌రెడ్డికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ పార్టీ సభ్యుడు కూడా కాదని, ఆయన్ను సస్పెండ్ చేసాం అని చెప్పారు.. ఇది ఇలా ఉండగానే, ఈ రోజు జగన్ పాదయాత్ర విజయవాడలో అడుగుపెట్టింది... మరి ఏమైందో ఏమో తెలియదు కాని, వంగవీటి రాధాతో పని లేదు అనుకున్నాడో ఏమో కాని, గౌతం రెడ్డి సస్పెన్షన్ ఎత్తి వేస్తూ, లోటస్ పాండ్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి... సరిగ్గా, జగన్ విజయవాడలో అడుగుపెట్టిన క్షణమే, గౌతం రెడ్డి సస్పెన్షన్ ఎత్తి వేసారు అని తెలియటంతో, రాధా వర్గం ఒకింత షాక్ కు గురైంది... తన తండ్రిని ఘోరంగా అవమానించిన, వాడిని నెత్తిన పెట్టుకోవటంతో, ఇప్పుడు రాధా ఎలా స్పందిస్తారో అని ఆయన వర్గం వేచి చూస్తుంది...
రాధా ఇక మన మాట వినడు అని, జగన్ కు అర్ధమై పోయిందో ఏమో కాని, రంగాను అన్ని బూతులు తిట్టిన గౌతం రెడ్డిని, బహిరంగంగా కలిసి, తనతో పాటు నడిపించుకుని, రాధా ఉంటే ఎంత పొతే ఎంత అనే సంకేతం జగన్ ఇచ్చారు అని పరిశీలకులు అంటున్నారు.. రాధా సామాజికవర్గం కంటే, నా సొంత సామాజికవర్గమే నాకు ముద్దు అనే సంకేతం ఇచ్చి, రెడ్డి సామాజికవర్గాన్ని మంచి చేసుకోవటానికి, జగన్ ఇలా చేసారేమో అని అంటున్నారు... మరి ఈ పరిణామాలు చూస్తున్న రాధా, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి... ఇప్పటికే జగన్ పై అసహనంతో, ఊగిసలాటలో ఉన్న రాధా, ఈ పరిణామాలు చూసి, త్వరగా రియాక్ట్ అవుతారని అంటున్నారు...