లేనిది ఉన్నట్టు, ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి, ప్రజలను అదే నిజం అని నమ్మించే లోటస్ పాండ్ పైడ్ ఆర్టిస్ట్ ల గురించి చెప్పనవసరం లేదు.. వీరికి తోడుగా, 250 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న బీహార్ గ్యాంగ్ కూడా లోకల్ జఫ్ఫా గాళ్ళకి తోడైంది... సిగ్గు ఎగ్గు లేకుండా, మన మన రాష్ట్ర పరువు తియ్యటానికి, ఈ బీహార్ గ్యాంగ్ చేత, లోటస్ పాండ్ జగత్(న్) కంత్రీ వేషాలు వేస్తున్నాడు... వేషాలు అయితే వేస్తున్నాడు కాని, ఎప్పటి లాగే, సెల్ఫ్ గోల్ వేస్తూ, దొరికిపోయాడు... దొంగ పనులు, దొంగ వీడియో లో సృష్టించడం వీరి పని... ఇలా తయారు చేసి సోషల్ మీడియాలో వదలటం, అదే నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. ఇలాంటి ఎన్నో సంఘటనలు, గత నాలుగేళ్ళుగా చూస్తూనే ఉన్నాం... ప్రతి సందర్భంలో, ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తూ, చంద్రబాబుని టార్గెట్ గా చెయ్యటమే పనిగా పెట్టుకున్నారు... ఇలాంటే ఘటనే మరొకటి నిన్న జరిగింది...

jagan 15042018 1

జగన్‌ పాదయాత్ర విజయవాడలోకి ప్రవేశించగానే ఓ నకిలీ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను పోలీసులు లాఠీలతో కొడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది... అంతే ముందూ వెనకా చూడకుండా పైడ్ బ్యాచ్, సంఘవిద్రోహ సఖ్తులు సోషల్‌ మీడియాలో షేరింగ్‌లు మొదలుపెట్టాయి... ‘పాదయాత్రలో జగనన్నను కలవడానికి వస్తున్న అభిమానులపై ఖాకీల దాడి.. అందరికీ షేర్‌ చేయండి’ అని కామెంట్‌ చేస్తూ.. ఫేస్‌బుక్‌, వాట్సాప్ ల్లో షేర్‌ చేశారు... లోకేష్ ఇలా చేపిస్తున్నాడు అంటూ, ఆ వీడియోకి కామెంట్ జత చేసి, తప్పుడు ప్రచారం చేసారు... ఒక పక్క, వీడియోలో హిందీ మాటలు వినిపిస్తున్నా, ఇక్కడే జరిగింది అని నమ్మించే ప్రయత్నం చేసారు...

jagan 15042018 1

‘వైఎస్‌ జగన్‌ ది లీడర్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని నడుపుతున్న ముగ్గురు యువకులు ఈ వీడియో పలువురికి పంపారు. జగన్‌ పాదయాత్ర సాగుతున్నంత సేపూ ఇది నగరమంతా హల్‌చల్‌ చేసింది. అయితే ఇది భారత్‌బంద్‌ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో అని పోలీసులు గుర్తించారు. నకిలీ వీడియోను షేర్‌చేసి, పోలీసులపై బురదజల్లిన ఫేస్‌బుక్‌ పేజీ నిర్వాహకుడు కొల్లపల్లి శ్యామ్‌తోపాటు మరో ఇద్దరిపై ఐపీసీ 469, 471, 120(బి), 153 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎవరెవరి సెల్‌ఫోన్ల నుంచి ఈ వీడియో షేర్‌ అయిందన్న అంశాలను పరిశీలించి, వారిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read