జనసేన పార్టీలో తాను చేరుతానని చెప్పలేదని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జనసేనలో తానేమీ చేరబోవడం లేదన్నారు.. పవన్ రాజకీయాల్లో నెగ్గాలంటే రెండు పడవల మీద కాలు పెట్టారాదు. సినిమావాళ్ళు రాజకీయాల్లో నెగ్గరు. అది ఒక్క ఎన్.టీ. ఆర్ కు మాత్రమే దక్కింది. ఆయన తొమ్మిది మాసాల పాటు ప్రజల్లోనే జీవించడం వలన ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన మాదిరి నెగ్గాలంటే పవన్ ప్రజల్లో తిరిగి విశ్వాసం కలిగించాలి అంటూ పవన్ పై ముద్రగడ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి... అంతే కాదు, అందరూ చెప్తున్నట్టే, ముద్రగడ కూడా, పవన్ బీజేపీతో కలిసిపోయారు అనే ఆరోపణలు చేసారు...
ముద్రగడ మాట్లాడుతూ, "పవన్ మహా వృక్షము నీడలో ఉన్నారు. ఆయన బి.జె.పి.ని వదిలి బయటకు వస్తే గాని ఎదగ రు. తాను ఏపార్టీ లో గాని ఎవరికి గాని మద్దతు ఇవ్వను." అంటూ ముద్రగడ పవన్ పై వ్యాఖ్యలు చేసారు... తన అభిప్రాయాలను జనసేన నేత రాఘవయ్యతో చర్చించానని ఆయన స్పష్టం చేశారు. అంత మాత్రానా తాను జనసేన పార్టీలో చేరుతున్నట్టు కాదని ఆయన గుర్తు చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం కొంత కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే... ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, పక్కగా కమిటి వేసి, కాపులకి రిజర్వేషన్ కోసం, కేంద్రానికి పంపింది...
కేంద్రం మాత్రం, ఇప్పటికీ ఏమి స్పందించలేదు... ముద్రగడ, కేంద్రం పై పోరాడకుండా, చంద్రబాబు పైనే విమర్శలు గుప్పిస్తూ ఉంటారు... మరో పక్క, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చెయ్యటం, ఇప్పుడు ఆసక్తిగా మారింది... పవన్ కి కూడా కాపు సామాజికవర్గ సపోర్ట్ ఉండటంతో, ముద్రగడ లాంటి వారి మాటలు, ఆసక్తిగా మారాయి.. మరో పక్క,ముద్రగడని జగన్ నడిపిస్తున్నారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి... ముద్రగడ పనులు కూడా అలాగే ఉంటాయి... ఎప్పుడూ జగన్ మనుషులని కలుస్తూ, జగన్ ను పైకి ఎత్తుతూ ఉంటారు... ట్రైన్ తగలుబెట్టిన విషయంలో కూడా, జగన్ పార్టీ నేతల సపోర్ట్ తోనే చేసారు అని, సిఐడి కేసు కూడా బుక్ చేసిన సంగతి తెలిసిందే...