కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గత కొన్ని రోజులుగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గున్తున్నారు... ఈ సందర్భంలో, నిన్న ఆయన ప్రయాణిస్తున్న విమానంలో అతి పెద్ద సాంకేతిక లోపం తలెత్తింది... మానవరహిత పైలట్ వ్యవస్థ పని చెయ్యకపోవటంతో, రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో, ల్యాండింగ్ కష్టం అయ్యింది... మూడో సారి అతి కష్టం మీద విమానం ల్యాండ్ అయ్యింది... ఆ టైంలో విమానంలో భయానక పరిస్థితినెలకొన్నా తాను ప్రశాంతంగాఉంటూ, తోటి ప్రయాణికులకు రాహుల్‌గాంధీ ధైర్యం చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఒక ఎస్పీజీ భద్రత ఉన్న వ్యక్తి ప్రయాణిస్తున్న విమానంలో ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తటం అనేది మామూలు విషయం కాదని, దీని వెనుక ఎదో కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది...
విమానంలో మానవరహిత పైలట్ వ్యవస్థ పని చెయ్యకపోవటం అనేది, అత్యంత ప్రమాదకరమైన అంశమని, రాహుల్ పై కుట్ర జరిగిందన్నది తమ ఆరోపణని, దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.. మరో పక్క ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ, వెంటనే రాహుల్ గాంధీకి ఫోన్ చేసే మాట్లాడారు.. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. ఘటన గురించి తెలిసింది అని, ఇలా ఎందుకు జరిగిందో శాఖా పరమైన ఎంక్వయిరీ జరుగుతుందని చెప్పినట్టు సమాచారం... రాహుల్ గాంధీ కూడా, ప్రధాని మోడీకి, ఘటన జరిగిన తీరు వివరించి, ప్రజల ఆశీర్వాదంతోనే క్షేమంగా బయట పడినట్టు రాహుల్ చెప్పారు..
ఇది ఇలా ఉండగా, విమానంలో సాంకేతికలోపం గురించి తెలిసిన వెంటనే కారణాలేమిటో తెలుసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని డీజీసీఏను ఆదేశించినట్లు కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. ఎవరైనా బాధ్యులని తేలితే తగిన చర్య తీసుకుంటామన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇద్దరు నిపుణులతో కమిటీని నియమించినట్లు డీజీసీఏ తెలిపింది. రెండు, మూడువారాల్లో నివేదిక వస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంతకుముందు విమానం నడిపిన పైలట్‌ను సైతం ప్రశ్నించనున్నట్లు తెలిపింది. మరో పక్క, కర్ణాటకలో జరిగిన విషయం, కుట్ర ఆరోపణలు రావటంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ, అక్కడ తెలుగు వారు అంటున్నారు.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థుతుల్లో ఏదీ తీసి పరెయ్యలేమని చెప్తున్నారు...