సైబర్ భద్రతా సవాళ్లను అధిగమించడంలో కొత్తగా ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఒక ముందడుగుగా భావించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి బిల్డింగ్ మూడవ అంతస్థులో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఆవశ్యకతను ఐటీ అధికారులు వివరించారు. ఈ సెంటర్ ద్వారా కంప్యూటర్స్ హ్యాకింగ్‌ను, వైరస్‌లను నియంత్రించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను ఎదుర్కోవడానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు, సంస్థలకు గూఢచార భాగస్వామ్య ముప్పును విశే్లషణ ద్వారా అందిస్తుందన్నారు. ఇలాంటి సెంటర్‌ను దేశంలో ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం-సామాజిక పరివర్తనాల్ని ప్రారంభించడంలో సహాయపడిన పలు సైబర్ ప్రోగ్రామ్‌లకు ఆంధ్రప్రదేశ్ నేతృత్వం వహిస్తుందని చెప్పారు. దేశంలో సైబర్ భద్రతా గమ్యస్థానంగా అమరావతిని రూపొందించడానికి ఇదొక ప్రోత్సాహకరంగా నిలుస్తుందన్నారు. సైబర్ నేరాలు ఇటీవల కాలంలో క్లిష్టమైన, ప్రధానమైన సమస్యగా మారాయని వివరించారు. ఇలాంటి వాటికి సైబర్ రక్షణ కల్పించడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ నుంచి లైవ్‌లో అందుబాటులో ఉన్న కేంద్ర ఐటీ శాఖ అధికారులు సహాని బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు విషయాలు చర్చించారు. కేంద్ర ఐటీ శాఖ అధికారి సహాని ముఖ్యమంత్రికి వివరిస్తూ సైబర్ భద్రతతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లడం దేశంలోనే వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, అందుకు అభినందిస్తున్నానని తెలిపారు.
అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా ఒక ఏకో సిస్టం తయారవుతుందని, ఇప్పటికే సీసీ కెమెరాల పరిజ్ఞానం, డ్రోన్ల పరిజ్ఞానం ఉపయోగించడం, రియల్‌టైమ్ గవర్నెస్ ద్వారా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సైబర్ సెక్యూరిటీ ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఇది ఒక వినూత్నమైన కార్యక్రమమని అన్నారు. ఈ సందర్భంగా, ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థలను హ్యాక్ చేయాలని విద్యార్థులు, ఐటీ ఎక్స్‌పర్ట్‌లకు సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైటులు ఎథికల్ హ్యాకింగ్ చేసి నిరూపిస్తే భారీ నజరానా ఇస్తామన్నారు. ఇది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సైబర్ సెక్యూరిటీ మీద తాను తీసుకున్న చర్యలు ఎంత ఖటినంగా ఉన్నాయో చెప్తుంది... ఎవరన్నా విద్యార్ధులు ట్రై చెయ్యండి, చంద్రబాబు సవాల్ ను స్వీకరించండి...