జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే... ఏది ఎందుకు మొదలు పెడతాడో తెలియదు, ఎందుకు ఆపేస్తాడో తెలియదు... ఇదే కోవలో, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసి, కేంద్రం ఇంత ఇవ్వాలి అని తేల్చారు.. కాని, తరువాత నుంచి కేంద్రాన్ని ఒక్క మాట అనటానికి కూడా సాహసించటం లేదు.. ఈ వ్యవహారంతో చిర్రెత్తిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారయణ కూడా, పవన్ మీద నమ్మకం లేక, సొంతగా ఒక కమిటీ వేసుకుని, కేంద్రం చేస్తున్న అన్యాయం పై పోరాడుతున్నారు... పవన్ వ్యవహార శైలికి కారణం, బీజేపీతో పవన్ చేసుకున్న ఒప్పందమే అని విశ్లేషకులు అంటున్నారు.. మోడీని ఒక్క మాట కూడా అనకపోవటం, నేషనల్ మీడియాకు ఎక్కి, మోడీ నాకు ఆదర్శం అని చెప్పి, చంద్రబాబుని తిట్టటం, ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి...
ఇక గత నలుగు రోజులుగా అయితే, కల్లు తాగిన కోతిలా, ట్విట్టర్ లో పడి హడావిడి చేస్తూ, బజారు మనుషుల కంటే హీనంగా, ప్రవర్తిస్తున్నాడు.. ఇవి పక్కన పెడితే, ఈ నెల 16న అనంతపురం జిల్లలో పవన్ పర్యటన అని, అక్కడ ప్రత్యెక హోదా పై, ఆందోళన చేస్తారు అంటూ, హడావిడి చేసారు.. అయితే, చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యింది.... అది అయిపోయిన తరువాత ఈ నెల 23 న చిత్తూరు పర్యటన అంటూ హడావిడి చేసాడు... అది కాన్సిల్ అయ్యింది అని, పవనే స్వయంగా ట్విట్టర్ లో చెప్పాడు... 15న అనంతపురం, 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో పట్టణాల్లో హోదా పై నిర్వహించ తలపెట్టిన, మేధావులతో సమావేశాలని కూడా రద్దు చేసారు... దీని వెనుక చాలా పెద్ద స్కెచ్ నడుస్తుంది...
ముందుగా ఇక పవన్, హోదా పై ఏ రకమైన ఉద్యమాలు చెయ్యడు... కేవలం ఎవరన్నా ఉద్యమాలు చేస్తే, వారికి సహకరిస్తాడు... ఇక నుంచి, రాష్ట్ర ప్రభుత్వం పై మాత్రమే దాడి చేస్తాడు... అయితే 23 న చిత్తూరు పర్యటన వాయిదా వెయ్యటానికి కారణం కూడా ఉంది... ఇదే చిత్తూరు జిల్లా తిరుపతిలో, చంద్రబాబు ఈ నెల 30న మోడీకి వ్యతిరేకంగా పెద్ద సభ పెడుతున్నారు... ఇది అతి పెద్ద సభ... దీనిని ఆపమని, మోడీ గవర్నర్ ను కూడా పంపించాడు... కాని చంద్రబాబు మాత్రం, వెనక్కు తగ్గలేదు... వెంటనే వైసిపీ రంగంలోకి దిగింది, ఈ నెల 30న నయవంచన సభని వైజాగ్ లో పెడుతున్నట్టు చెప్పింది... పవన్ కూడా, 30వ తారీఖే చిత్తూరు పర్యటనకు వెళ్లనున్నారు... అటు జగన్ చేతే, ఇటు పవన్ చేతే బీజేపీ ఆడిస్తున్న డ్రామా ఇది... వీలైతే, 30వ తారీఖే పవన్ పై చెప్పులతో కాని, రాళ్ళ దాడి కాని ప్లాన్ చేసారు... చంద్రబాబు తిరుపతిలో పెట్టే మీటింగ్ డైవర్ట్ చెయ్యాలని, ఇద్దరికీ ఆదేశాలు వచ్చాయి... చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ఎలా అయితే డైవర్ట్ చేసారో, 30న తిరుపతిలో జరిగే చంద్రబాబు మీటింగ్ డైవర్ట్ చెయ్యటానికి, జగన్, పవన్ పోటీ పడుతున్నారు...