మన రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకుని, వారితో డైరెక్ట్ గా కలవకుండా, ప్రజలని కన్ఫ్యుస్ చేస్తూ, బీజేపీ ఎలా గేమ్ ఆడిస్తుందో, కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ముల ప్రయోగిస్తుంది... అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులకు విజయావకాశాలు లేకపోవటంతో లోపాయకారిగా జేడీఎస్ మద్దతు తీసుకుంటుంది... ముక్కోణ పోటీ సృష్టించి, తద్వారా లబ్ది పొందటానికి, వీలైతే ఎన్నికలు అయిన తరువాత, జేడీఎస్ తో కలిసి పనిచెయ్యటానికి కూడా సిద్ధమవుతుంది... సిద్ధరామయ్య ఇప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ముందుగా చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి మాత్రమే సిద్ధరామయ్య పోటీ చేస్తారని ప్రకటించారు. అక్కడ జేడీఎస్‌కు రహస్యంగా మద్దతివ్వాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం...
అదే జరిగిన పక్షంలో సామాజిక వర్గాల లెక్కలు చూస్తే అక్కడున్న రెండున్నర లక్షల మంది ఓటర్లలో 70 వేల మంది ఒక్కళిగలు ఉన్నారు. ఓబీసీలు, దళితులు, ముస్లింలు కలిసి లక్షన్నర మంది ఉన్నారు. సిద్దరామయ్య ప్రాతినిధ్యం వహించే కురుబ సామాజిక వర్గం ఓబీసీ కిందకు వస్తుంది. చాముండేశ్వరీ నియోజకవర్గంలో ఒక్కళిగల కారణంగా సిద్దరామయ్య ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నారని, ముందు జాగ్రత్త చర్యగా బాదామి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్యకు చెందిన కురుబ సామాజిక వర్గం బాదామీ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడ నుంచి ధైర్యంగా పోటీ చేస్తున్నారు. దీని వల్ల బాగల్కోట్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కూడా నమ్ముతున్నారు. అయితే బాగల్కోట్ ప్రాంతంలో సిద్దరామయ్య ఆటలు సాగవని యడ్యూరప్ప వర్గం సవాలు చేస్తోంది. చాప కింద నీరులా బీజేపీ తన పని చేసుకుపోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
సామాజిక వర్గాల లెక్కలు వేసుకుని జయాపజయాలపై అంచనాకు వచ్చేందుకు ఆరెస్సెస్ శ్రేణుల సేవలు ఉపయోగపడుతున్నాయి. ఒక్కళిక సామాజిక వర్గం ఓట్లు ఏకమొత్తంగా జేడీఎస్ కు పడిన పక్షంలో ముక్కోణ పోటీ ఖాయమని బీజేపీ అంచనాకు వచ్చింది. అందుకే కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పోటీని పెంచి పోషించేందుకు ప్రయత్నిస్తోంది. జేడీఎస్‌కు బలమున్న ప్రాంతాల్లో తెరవెనుకగా ఆ పార్టీని ప్రోత్సహిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమయ్యాయి. బీజేపీ మద్దతు లభిస్తే తమకు కూడా ప్రయోజనం కలుగుతుందని జేడీఎస్ నేత దేవెగౌడ నమ్ముతున్నారు. సరిగ్గా మన రాష్ట్రంలో లాగే, కర్ణాటకలో కూడా, జేడీఎస్ పని కానిస్తుంది బీజేపీ... మరి వీళ్ళ ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి...