మోడీ వల్లే, కియా కార్ల కంపెనీ మన రాష్ట్రానికి వచ్చింది అని, నిస్సిగ్గుగా వాదిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకి, ముఖ్యంగా తన ఫేస్బుక్ పేజీలో మోడీ వల్లే, కియా వచ్చింది అని పెట్టుకున్న పురందేశ్వరి గారికి, వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రే సమాధానం చెప్పారు... మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న మీడియాతో మాట్లాడుతూ, కియాను మహారాష్ట్రకు తీసుకురావటానికి అన్ని ప్రయత్నాలు చేసాం.. ఎన్నో సార్లు ప్రయత్నించాం.. కాని కియా కంపెనీ కోర్కెలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మాకు ఇప్పటికే చాలా కంపెనీలు ఉన్నాయి, అందుకే వారి కోర్కెలకు మేము లొంగలేదు... వారి కోర్కెలకు లొంగితే, మిగతా కంపెనీలు కూడా వస్తాయి, అందుకే మేము కియాను ఇక్కడకు రప్పించలేకపోయాయం అంటూ మహారాష్ట్ర సియం చెప్పారు...
అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కియా కంపెనీ అడిగిన అన్నటికీ అంగీకరించారని అందుకే, కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళింది అంటూ, మహారాష్ట్ర సియం చెప్పారు... ఒక పక్క బీజేపీ నేతలు, మా మోడీ వల్లే, ఆంధ్రప్రదేశ్ లో కియా వచ్చింది అంటూ హడావిడి చేస్తుంటే, వాళ్ళ ముఖ్యమంత్రే, చంద్రబాబు వల్లే కియా ఏపి వెళ్లిందని ఒప్పుకున్నారు... గత కొద్ది రోజుల నుంచి, రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గు అనేది పూర్తిగా వదిలేసి, ఏమాత్రం ప్రజలు ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, చంద్రబాబు ఎంతో కష్టపడితే తెచ్చిన కంపెనీని, మోడీ వల్లే రాయలసీమలో పెట్టారు అంటూ, ఒక ఫేక్ ఇమేజ్ పట్టుకుని ప్రచారం మొదలు పెట్టారు...
పురందేశ్వరి లాంటి నాయకురాలు కూడా, మోడీ వల్లే వచ్చింది అంటూ, నిస్సిగ్గుగా, చంద్రబాబు కష్టాన్ని, మోడీ ఖాతాలో వేసారు.. చంద్రబాబు మాత్రమే కాదు, ఇది వరకు తమిళనాడుకి చెందిన ఒక కన్సల్టెంట్, కియా అన్ని రాష్ట్రాలను కాదని, ఆంధ్రప్రదేశ్ కి ఎలా వచ్చిందో క్లియర్ గా చెప్పారు... అది అప్పట్లో, బాగా వైరల్ అయ్యింది కూడా... మొన్న కియా ప్రారంభోత్సవం అప్పుడు కూడా, చంద్రబాబుపై కియా ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు... పెట్టుబడులు ఆకర్షించడంలో ఆయన దిట్టగా అభివర్ణించారు... చంద్రబాబు చొరవ చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ప్రతిపాదనలు ఇచ్చిన వెంటనే,.... చకచకా అన్ని రకాల అనుమతులు, భూకేటాయింపులు జరిపారని చెప్పారు... ఆ వెంటనే త్వరితగతిన కార్ల ఉత్పత్తిని చేపట్టాలంటూ రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి పెంచిందన్నారు... ఈ హడావుడిలో భూమి పూజ అట్టహాసంగా చెయ్యలేకపోయామన్నారు... ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే 13 వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు...