తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు వచ్చిన గవర్నర్ నరసింహన్ హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. ఇవాళ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధానమంత్రి మోడీతో గవర్నర్ భేటీ కావాల్సింది. అయితే ఆయన అపాయింట్స్ క్యాన్సిల్ కావడంతో ఆయన ఇవాళ 12 గంటలకే హైదరాబాద్‌కు తిరుగు ముఖం పట్టారు. ప్రధాని చైనా పర్యటన ఆకస్మికంగా ఖరారు కావడంతో.. ఆయన కీలక కార్యక్రమాల షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. దీంతో ప్రధాని, గవర్నర్ భేటీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇతర మంత్రులతో జరగాల్సిన భేటీలు కూడా రద్దు చేసుకోవడం విశేషం.
తెలుగు రాష్ట్రాలపై గవర్నర్ ఇప్పటికే తాను తయారు చేసిన నివేదికను ప్రధాని, హోం శాఖకు పంపినట్లు తెలుస్తోంది. ఇలా ఆయన పర్యటన మధ్యలోనే ముగియడం, ప్రధానితో భేటీ కాకపోవడం, నేడు షెడ్యూల్ లో ఉన్న హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తో చర్చలు సాగకపోవడం, నరసింహన్ తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం కావడం గమనార్హం. నేడు షెడ్యూల్ లో ఉన్న హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తో చర్చలు సాగకపోవడం కొత్త చర్చను తెరపైకి తెచ్చింది. కాగా, ఇటీవలి కాలంలో గవర్నర్ తటస్థంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తుండటం, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్టుగా గవర్నర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన నేపథ్యంలో నరసింహన్ తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం కావడం గమనార్హం.
మరో పక్క ప్రధాని మోడీతో పాటు, మిగిలిన బీజేపీ పెద్దలు గవర్నర్ పై గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. చంద్రబాబుతో సంధి కుదర్చమని, కర్ణాటక ఎన్నికల దాక, చంద్రబాబుని విమర్శలు చెయ్యకుండా ఉండమని పంపించినా, గవర్నర్, చంద్రబాబుని ఒప్పించలేక పోగా, తిరిగి చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ లు తీసుకురావటం మోడీకి నచ్చలేదని తెలుస్తుంది. నిన్న చంద్రబాబు మరింత ఘాటుగా మోడీ పై వ్యాఖ్యలు చెయ్యటం, గవర్నర్ ని నేరుగా బహిరంగంగా విమర్శలు చెయ్యటం కూడా, మోడీకి మింగుడు పడటం లేదని సమాచారం. చంద్రబాబుని ఒప్పించటంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని, మరో పక్క జగన్, పవన్ ను ఆడిస్తుంది గవర్నర్ అనే విషయం సామాన్యులకు కూడా అర్ధం అవ్వటంతో, బీజేపీ ప్లాన్ కూడా బయట పడటంతో, గవర్నర్ ను మార్చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం...