గత నాలుగేళ్లలో, గవర్నర్ ఎంత ఇబ్బంది పెట్టినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు ఒక్క మాట కూడా బహిరంగంగా మాట్లాడలేదు... మొన్నటి దాకా తెలంగాణాకు అనుకూలంగా ఉన్నా, కొన్ని రోజుల క్రితం నుంచి కేంద్రంలో బీజేపీతో కలిసి, రాష్ట్రంలో పవన్, జగన్ తో ఆడిస్తున్నారని వార్తలు వస్తున్నా, చంద్రబాబు ఏ నాడు బ్యాలన్సు తప్ప లేదు... గవర్నర్ పై, తెలుగుదేశం పార్టీ నేతలు ఏమన్నా వ్యాఖ్యలు చేసినా, వారిని వారించే వారు... అయితే, ఈ రోజు మాత్రం, చంద్రబాబు ఓపెన్ అప్ అయిపోయారు... రెండు రోజుల క్రితం గవర్నర్, కేంద్రం నుంచి ఎదో రాయబారం తెచ్చారు అనే వార్తలు వచ్చాయి... కర్ణాటక ఎన్నికలు అయ్యే వరకు, మోడీ పై విమర్శల వేడి తగ్గించమని కోరినట్టు తెలిసింది... అయితే చంద్రబాబు కూడా అదే రీతిలో స్పందించినట్టు సమాచారం...
అయితే ఈ రోజు, పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారన్న వార్తలు పేపర్లలో వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఓ గవర్నర్ ఆ విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. గవర్నర్ వ్యవస్థ వద్దని టీడీపీ ఎప్పుడో స్పష్టం చేసిందని, దానిపై పోరాటం కూడా చేశామని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతిప్రకారం చేసుకోవాల్సిన వ్యవస్థ అని. పేపర్లో వచ్చే విధంగా గవర్నర్ చేయడం కరెక్టు కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు... చంద్రబాబు గవర్నర్ పై ఇలా డైరెక్ట్ గా వ్యాఖ్యలు చెయ్యటం ఇదే మొదటి సారి...
ఈ రోజు గవర్నర్, మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే.. చంద్రబాబుతో జరిగిన చర్చల వివరాలు, ఢిల్లీ పెద్దలకు చెప్పటానికి వెళ్ళారని తెలుస్తుంది... మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ మూడు రోజుల పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు పెద్దలను ఆయన కలవనున్నారు. చంద్రబాబు దూకుడు తగ్గేలా లేదని, గవర్నర్ కేంద్ర పెద్దలకు చెప్పనున్నారు... అలాగే ఇక్కడ పవన్, జగన్ పోషిస్తున్న పాత్ర గురించి కూడా చర్చించనున్నారు... గవర్నర్ నివేదిక చుసిన తరువాత, కేంద్రం మరో ప్లాన్ తో ఆంధ్రప్రదేశ్ పై పట్టుకు ముందుకు రానుంది.. ఇప్పటికే పవన్, జగన్, తమ తమ పాత్రలు సమర్ధవంతంగా పోషిస్తున్నారు... కులాల వారీగా, కుట్రలకు బేస్ సెట్ చేసుకున్నారు... చంద్రబాబు ఎలాగు లొంగడు అని తెలుసుకున్న ఢిల్లీ పెద్దల, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి...