నెల్లూరు సోగ్గాడు, పాపులర్ పొలిటీషియన్, టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డి పాటు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు. విలక్షణమైన వ్యక్తిత్వం, మాటతీరు, వేషధారణతో నెల్లూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్‌గా పేరొందిన ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడితోపాటు హస్తం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఆనం మృతితో టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

aanam 25042018 1

ఆనం వివేకా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియడంతో ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ నాయుడు,మంత్రులు ,ఇతర పార్టీ నేతలు హైదరాబాద్ వెళ్లి ప్రత్యేకంగా ఆయనను పరామర్శించి వచ్చారు. గత ఏడాది జూలై నుంచి ఆనం ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. గతంలో కోర్టుకు హాజరు కావాల్సిన సందర్భంలో అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానంటూ ఆయన న్యాయస్థానానికి సమాచారం అందించారు. దీంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.

aanam 25042018 1

ఇటీవల ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్న ఆనం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు బాబు. ఆనంను పరామర్శించిన వారిలో బాబుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలు ఉన్నారు. కాగా ఆనం ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నెల్లూరు జిల్లా నుంచి ఆయన అభిమానులు భారీగా ఆసుపత్రికి వద్దకు చేరుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read