బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యారు. హై బిపితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నాలక్ష్మినారాయణ చేరారు. ఇవాళ సాయంత్రం గన్నవరంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని మాజీ మంత్రి కన్నా నిర్ణయించుకున్నారు. పార్టీ మారే విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనైతున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి కూడా తీవ్ర ఒత్తిడికి గురైన కన్నా .. ఆ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేది వాయిదా పడినట్లే అని సమాచారం అందించింది.

kanna 25042018 1

బీజేపీలో నిన్నమొన్నటి వరకు కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్న కన్నా పార్టీ అధ్యక్ష పదవిపై ఆశ పడ్డారు. బీజేపీలో చేరిన సమయంలో, తగిన ప్రాధ్యానత ఇస్తామని హామీ కూడా ఇచ్చారని కన్నా వర్గీయులు అంటున్నారు.. హరిబాబు రాజీనామాతో అది తనకు ఖాయమని నమ్మారు. అధిష్ఠానం కూడా తొలుత ఆయనకే ఇవ్వాలని భావించినా, పార్టీలోని సీనియర్లను కాదని, బయటి నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్ఠానం వెనక్కి తగ్గింది. దీంతో కినుక వహించిన కన్నా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఏ పార్టీలో చేరాలి అనే విషయం పై కన్నా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం... ఇటు తెలుగుదేశం పార్టీ నానియ్యదు... కాపు పార్టీగా పేరు ఉన్న జనసేన, అసలు అది ఒక పార్టీనో కాదో కూడా అర్ధం కావటం లేదు, మరో పక్క జగన్ రమ్మని ఆహ్వానం పంపుతున్నా, కన్నా వర్గీయులు కూడా అందుకే సై అంటున్నా, జగన్ పార్టీలో చేరిక విషయం పై కన్నా ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తుంది..

kanna 25042018 1

మరో పక్క బీజేపీ విషయానికి వస్తే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒకవేళ బీజేపీలో కొనసాగి.. ఎన్నికల బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదన్న భావనకు వచ్చిన ఆయన బీజేపీని వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజులపాటు తన అనుయాయులతో మంతనాలు జరిపి వారి మనోగతానికి అనుగుణంగా వైసీపీలో చేరాలని అయిష్టంగానే ఒప్పుకున్నారు.. ఇప్పటికే తనతో మంతనాలు సాగిస్తున్న వైసీపీ ముఖ్యులతో ఫోన్లో చర్చలు జరిపిన ఈ నెల 25న చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు... ఈ క్రమంలో, నేడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని మీడియాకు లీకులు ఇచ్చారు... అంతలోనే ఆయన అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read