గత 15 రోజులుగా, టీవీల్లో వస్తున్న చండాలం ఇది.. పవన్ కళ్యాణ్ ని ఇందులో లాగినా, అది సినిమాలు వరుకే అని చెప్పి, ఈ దరిద్రం గురించి ఒక్క ఆర్టికల్ కూడా రాయకుండా ఉన్నాం... కాని ఈ రోజు, మన జగన్ బాబు హ్యాండ్, ఈ దరిద్రంలో ఉందని తెలుసుకుని రాయక తప్పటం లేదు... మొన్నటిదాకా పవన్, టిడిపితో కలిసి ఉన్నాడు, నాకేంటిలే అని జగన్ రెలాక్ష్ అయ్యాడు... కాని, పవన్, టిడిపితో విభేదించి, దూరం వెళ్ళిపోయాడు... కారణాలు ఏవైనా, ఇప్పుడు అప్రస్తుతం... పవన్ కళ్యాణ్ తన ప్రతిపక్ష హోదాకు ఎసరు పెడుతున్నాడు అనుకున్నాడో ఏమో, జగన ఒక భారీ ప్లాన్ వేసాడు... పవన్ ని ఎక్కడ కొడితే, ప్రజలు ఈజీగా నమ్ముతారో, అక్కడే కొట్టటానికి కుట్ర పన్నాడు... వాస్తవాలు చెప్తే ప్రజలు నమ్ముతారు కాని, కుట్ర పన్నితే, అది ఏ నాటికైనా బయటకు వస్తుంది అనే విషయం జగన్ మర్చిపోయాడు.. పవన్ ని రాజకీయంగా ఎదుర్కోలేక, చీప్ ట్రిక్స్ కి దిగి, దొరికిపోయాడు...

audio 19042018

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధించారంటూ దుమారం రేపుతున్న నటి శ్రీరెడ్డికి సంబంధించి 12 నిమిషాల ఆడియో టేప్ ఒకటి బయటపడింది. వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ వేసుకుని తన దగ్గరకు వచ్చారని అందులో పేర్కొంది. వివాదంలో తనను వాడుకోవాలని ప్రయత్నించారని, ఇంకా ఇరికిద్దామని చూశారని అయితే తన ఏడుపు చూసి కొద్దిగా తగ్గారని చెప్పింది. ఢిల్లీ స్థాయికి తన సమస్యను తీసుకువెళ్తానని శ్రీరెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఆడియో టేపు సంచలనం రేపుతోంది. శ్రీరెడ్డి వివాదం వెనుక ఎవరో ఉన్నారంటూ కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు కీలకంగా మారబోతున్నాయి.

audio 19042018

జగన్ పార్టీ, ఇదంతా చేపిస్తుంది అనే విషయం క్లియర్ అయ్యింది... అయితే, క్యాస్టింగ్ కౌచ్ పేరుతో, జనాలని పిచ్చోల్లని చెయ్యటానికి, తద్వారా నెమ్మదిగా, పవన్ ని వ్యక్తిగతంగా దెబ్బ కొట్టే ప్లాన్ వేసాడు జగన్... ఇది బయట పాడిపోవటంతో, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. అయితే, ఈ ఆడియో ఎవరు లీక్ చేసారు అనేది తెలియాల్సి ఉంది.  ఇది నిజమా కాదా అనేది శ్రీ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది... పోలీసులు కూడా ఈ విషయం తేల్చాల్సిన అవసరం ఉదని.. వైసిపీ నుంచి ఎవరూ ఇప్పటి వరకు ఖండించకపోవటం కూడా, ఆసక్తిగా మారింది... ఇది ఇలా ఉంటే, శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిర్దంద్వంగా అందరూ ఖండించారు. రాజకీయ ఉద్దేశ్యాలతో ఆమె పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తే అదే మాటలు రేపు మరొకరిని అంటుంది. అప్పుడు భాధ పడి ప్రయోజనం లేదు. రాజకీయంగా పవన్ ని సమర్ధించలేకపోవచ్చు. అది వేరేసంగతి. కాని, జగన్ లాంటి వాడు, ఇంత నీచ్చానికి దిగజారితే, ఎవరూ చూస్తూ ఊరుకోరు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read