ఢిల్లీలో ప్రధాని ఇంటి ముందుకు వెళ్లి ధర్నా చేసి, మోడీతో డీ అన్నారు తెలుగుదేశం ఎంపీలు... నువ్వు ఇంత అన్యాయం చేస్తావా, నీ బండారం మొత్తం బయట పెడతా అంటూ, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి, నేషనల్ మీడియాను పిలిచి, ఇది మోడీ చేసిన మోసం అంటూ, వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా, మోడీని ఎండగట్టారు. రేపు తన పుట్టిన రోజున కూడా, మోడీ చేసిన మోసం పై, జాతీయ స్థాయిలో ఫోకస్ కోసం, నిరసన దీక్ష చేస్తున్నారు... చంద్రబాబు ఇన్ని చేస్తుంటే, అటు జగన్, ఇటు పవన్, వచ్చి చంద్రబాబు మీద పడి ఏడుస్తూ, మోడీకి లొంగిపోయి, నాటకాలు ఆడుతున్నారు... అయితే, ఇప్పుడు మోడీ, స్వీడన్ దేశం వెళ్ళినా వదలటం లేదు.
ప్రధాని మోడీ స్వీడన్ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా,కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తోందంటూ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు నిరసనలు తెలియజేస్తున్నారు. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ లో ప్రధాని నరేంద్ర మోదీ బస చేసిన హోటల్ ముందు ఐరోపాలోని తెదేపా ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన కొందరు ప్లకార్డులు, పార్టీ జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయండి, హామీలు అమలు చేయండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి" అన్న నినాదాలు ఉన్న ప్లకార్డులు ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు.
రెండు దఫాలుగా నిరసన చేయగా... పోలీసులు బలవంతంగా పంపించేశారని ఐరోపాలోని తెదేపా ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చేస్తున్న నిరాహారదీక్షలో ప్రవాసాంధ్రులు పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు. వివిధ ఐరోపా దేశాల్లో స్థిరపడిన 10 మంది ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రితో పాటు విజయవాడలో దీక్షలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి దీక్షకు సంఘీభావంగా లండన్లో పార్లమెంటు ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద, ఐర్లాండ్, స్వీడన్, జర్మనీ, హాలెండ్ తదితర ప్రాంతాల్లోను ప్రవాసాంధ్రులు దీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.