అగ్రిగోల్డ్ వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చిన సంగతి తెలిసిందే... చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత, వీరికి ఎలా అయినా న్యాయం చెయ్యాలని, అగ్రి గోల్డ్ ఆస్తులను అమ్మి, నష్టపోయిన వారికి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు... ప్రభుత్వం తరుపున చేస్తే లేని పోనీ తలనొప్పులు అని, కోర్ట్ ద్వారా ఈ ప్రక్రియ చెయ్యటానికి రెడీ అయ్యారు.. ఇదే తరుణంలో, అగ్రి గోల్డ్ ను టేకోవర్ చేసేందుకు జీఎస్సెల్ గ్రూపు ముందుకొచ్చింది. జీ ఛానెళ్ల నెట్ వర్క్ అధినేత సుభాష్ చంద్ర అమరావతి వచ్చి ఆ మధ్య చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు. అంతా స్వయంగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో, అగ్రిగోల్డ్ సంస్థను టేకోవర్ చేయడానికి ముందుకొచ్చిన ఎస్సెల్-జీ గ్రూపు చేతులేత్తేసింది... ఇదే విషయం నిన్న కోర్ట్ కి చెప్పింది.. అయితే, ఈ తతంగం మొత్తం వెనుక మోడీ, బీజేపీ పెద్దల ఒత్తిడి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి...
ఇది కనుక ఒక కొలిక్కి వస్తే, 19 లక్షల మందికి చంద్రబాబు దేవుడు అవుతాడు... అల చేస్తే, రాజకీయంగా చంద్రబాబుకి లాభం... అందుకే, ఇది ముందుకు వెళ్ళకుండా ఆపారు అంటున్నారు... జీ ఛానెళ్ల నెట్ వర్క్ అధినేత సుభాష్ చంద్ర, 2016లో బీజేపీ సపోర్ట్ తో రాజ్యసభకు ఎన్నికయ్యారు... మోడీ, సూచనలు మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, చంద్రబాబుకి ఏ మేలు చెయ్యకూడదు అనే ఆదేశాలు మేరకు, ఇలా జరిగి ఉండవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.. అగ్రిగోల్డ్ వ్యవహరం మళ్లీ మొదటికి రావడానికి వైసీపీనే కారణమని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… అగ్రిగోల్డ్ వ్యవహరంలో వైసీపీపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన ఆరోపణలు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టేకప్ చేయడానికి ముందుకొచ్చిన జీ-ఎస్సెల్ గ్రూప్.. వైసీపీ వల్లే వెనక్కు వెళ్లిందన్నారు. కేంద్రం మా చేతిలో ఉంది అంటూ సీబీఐ కేసుల పేరుతో జీఎస్సెల్ గ్రూప్‌ను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ విషయాన్ని జీ-ఎస్సెల్ కంపెనీ ప్రతినిధులే స్వయంగా వెల్లడించారని తెలిపారు.
అయితే, ఈ విషయం పై వైసిపీ తరుపున బొత్సా ఒక్కరే మాట్లాడుతున్నారు... ఆయన దీని పై సిబిఐ విచారణ అడుగుతున్నారు... సిబిఐ విచారణ జరిపితే, ఇక కేసు ఎప్పటికీ తేలదు... అదే వీళ్ళ ప్లాన్... అయితే, ఈ విషయం పై అగ్రిగోల్డ్ బాధితులు మండిపడుతున్నారు.. అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ విచారణకు మేం వ్యతిరేకమని అగ్రిగోల్డ్ బాధితులు తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడును కలిసిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వమే అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయాలని కోరామన్నారు. వేలం ప్రక్రియ కోసం కోర్టు అనుమతి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే సీఎం చొరవ తీసుకుంటున్నారన్నారు. అగ్రిగోల్డ్ పై రాజకీయాలు చేయొద్దని అన్ని పార్టీలను కోరుతున్నామన్నారు. సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం వేసే అఫిడవిట్‌ను పరిశీలించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎస్సెల్ గ్రూపును బీజేపీ పెద్దలు బెదిరించి ఉంటారని తాము భావిస్తున్నట్లు తెలిపారు.