మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులపై ఉన్న నేరారోపణలు నిరూపణ కాని కారణంగా నాంపల్లిలోని స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించి, ఆ కేసుని కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పు పై ప్రజలు ఆశ్చర్యపోయారు... 8 మందిని చంపింది ఎవరు అంటూ, ప్రశ్నిస్తున్నారు... కొన్ని రాజకీయ పార్టీలు అయితే, ఈ తీర్పు వెనుకు ఒక పార్టీ ఉంది అంటూ ఆరోపిస్తున్నాయి... ఇవన్నీ వినిపిస్తూ ఉండగానే, పెను సంచలనం చోటు చేసుకుంది... ఉదయం మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి, సాయంత్రానికి రాజేనామా చేశారు... ఈ పరిణామంతో అందరూ షాక్ అయ్యారు... అసలు ఏమి జరిగింది అని ఆరాలు తెయ్యటం మొదలు పెట్టారు.. ఎవరి ఒత్తిడి వాళ్ళ ఆ తీర్పు ఇచ్చారో, అని ఉదయం చెప్పిన వాళ్ళు, ఇప్పుడు ఈ పరిణామంతో, వారి మాటలకు మరింత బలం వచ్చినట్టు అయ్యింది...

court 16042018 1

ఉదయం సంచలన తీర్పు ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తీర్పు వెలువరించిన వెంటనే హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామా ఆమోదించేవరకు తనకు సెలవు ఇవ్వాలని కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెబుతున్నప్పటికీ... గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు తెలియవచ్చింది. మక్కా మసీదు పేలుళ్ల కేసుకు సంబంధించి ఏమైనా ఒత్తిడిలు ఎదుర్కొంటున్నారా? ఇంకేమైనా ఒత్తిడులు ఉన్నాయా?. అనే ఆరోపణలు వస్తున్నాయి.

court 16042018 1

తీర్పు ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేయడం తీవ్ర సంచలనం కలిగిస్తుంది. తన రాజీనామాకు సంబంధించి ఇప్పుడేమీ మాట్లాడలేనని, రాజీనామా ఆమోదం పొందిన తర్వాత తాను చెప్పదలచుకున్న విషయాలను మీడియా సమావేశంలో మాట్లాడతానని రవీందర్ రెడ్డి చెప్పారు. ఇవాళ్టి తీర్పు తర్వాత బెదిరింపులు వచ్చినట్లు రవీందర్ రెడ్డి ఆయన మిత్రులతో చెప్పారని సమాచారం. వాస్తవానికి మరో రెండు నెలల్లో రవీందర్ రెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది. అసలు రవీందర్ రెడ్డి రాజీనామా వెనుక ఎం జరిగింది? ఎందుకు రాజీనామా చేశారన్నదానిపై సర్వత్రా చర్చజరుగుతోంది. కాగా రవీందర్ రెడ్డి తెలంగాణ జుడీషియల్ అధికారుల సంఘం నాయకుడు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read